
విద్యార్థులు ఇతివృత్తంగా నెరి
నెరి చిత్రం టాకీ పార్టును పూర్తి చేసుకుందని ఆ చిత్ర నిర్మాత మోహన్‌కుమార్ తెలిపారు. ఈయన కథ, కథనం, మాటలు సమకూర్చి కథానాయకుడిగా నటిస్తూ అమోఘా ఫిలిం మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నెరి. శ్రేయశ్రీ,, సత్యకళ కథానారుుకలుగా నటిస్తున్న ఇందులో కింగ్‌కాంగ్, స్వతంత్రదాస్, శ్రీలత, పరుుల్‌వాన్ రంగనాథన్, బాలతారలు ఎం.శివాని, ఎం.భరత్ నటిస్తున్నారు. విలన్‌గా భగవతిబాలా నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను భగవతిబాలా నిర్వహిస్తున్నారు.రమేష్‌భారతి, స్వతంత్రదాస్, ప్రత్యూగన్, కార్తికేయన్, నందుదాసన్, ఐదుగురు గీత రచరుుతలు రాసిన పాటలకు కే.రాజ్‌భాస్కర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
చిత్ర వివరాలను నిర్మాత, కథానాయకుడు మోహన్‌కుమార్ తెలుపుతూ నక్క వేషాలను వేసే విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టడం ఉపాధ్యాయులకు శ్రమతో కూడిన కార్యమేనన్నారు. అలాంటి విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న కథా చిత్రం నెరి అని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఒకే షెడ్యూల్‌లో కరూర్, ఊటీ, కోడైక్కానల్, ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో నిర్వహించి 60 రోజుల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. పాటలను బెల్జ్జియం, మలేషియా, సింగపూర్‌లలో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.