తనను ప్రేమించకపోతె యాసిడ్ పోస్తానని బెదిరించిన యువకుడి పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి అతన్ని ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కదిరికి చెందిన శ్రీలత(24) జేఎన్‌టీయూ అనంతపురంలో 2013-15 బ్యాచ్‌లో ఎంబీఏ చదివింది. విద్యార్థి దశలో కళాశాలలో గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చిన సుశిల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు.
అప్పటి నుంచి తనను ప్రేమించాలని.. లేకపోతె కుటుంబ సభ్యులందరిని హతమారుస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన శ్రీలత గత నెల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సుశిల్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. సుశిల్‌కుమార్ మద్రాస్ ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొంది కదిరిలో గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాడు.