తిరుపతిక్రైం: ప్రియురాలు మృతి చెందడంతో మనస్తాపానికి గురైన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సోమవారం తిరుపతి ఇం దిరానగర్‌లో చోటు చేసుకుంది. వెస్ట్ సీఐ అం జూయాదవ్ కథనం మేరకు.. సరళ సులభ్‌లో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు. భర్త లేకపోవడంతో ఈమె పిల్లలను అల్లారుముద్దుగా పెంచింది. కొడుకు దినేష్(18) కొంతకాలంగా అక్క కూతురు శ్రీలత ను ప్రేమిస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ వీరి మ ద్య నెల నుంచి మాటలు లేవు. ఈ నేపథ్యంలో 5వ తేదీన చెన్నైలో శ్రీలత ఆత్మహత్యకు పాల్పడింది. దినేష్ హుటాహుటిన తల్లి, తన చెల్లితో పాటు చెన్నై వెళ్లాడు.
అక్కడ శ్రీలత అంత్యక్రియలు పూర్తిచేసుకుని తిరిగి తిరుపతికి ఆదివా రం రాత్రి చేరుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, శ్రీలత లేని జీవితం వ్యర్థం అంటూ సూసైడ్ నోట్ రాశాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. స్కూల్ నుంచి వచ్చిన చెల్లెలు చూసి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అప్పటికే దినేష్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని రుయా మెడికల్ కళాశాలకు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేయసి మృతితో ప్రియుడి ఆత్మహత్య
Published Tue, Dec 9 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement
Advertisement