Sarovaram
-
మీరెప్పుడైనా.. ఈ మృత్యుసరోవరం గురించి విన్నారా!?
సముద్రంలో ఉన్న మృత్యుసరోవరం ఇది. సముద్రంలోకి దిగి చూస్తే, ఇది మామూలుగానే కనిపిస్తుంది గాని, ఇందులో ఈత కొట్టాలని సరదా పడితే మాత్రం, చావును కోరి కొనితెచ్చుకున్నట్లే! వంద అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మడుగులోని అత్యంత లవణీయత కలిగిన నీరు, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ప్రాణాంతక విషవాయువులు దీనిని మృత్యుసరోవరంగా మార్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని తొలిసారిగా 2015లో కనుగొన్నారు. ఇందులో ఈదులాడేందుకు దిగి మరణించిన జంతువుల కళేబరాలను శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం సేకరించి, భద్రపరచారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో వద్ద సముద్రంలోకి దిగి పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలకు సముద్రం లోపలి భాగంలో ఈ మడుగులాంటి ప్రదేశం కనిపించింది. దాదాపు వంద అడుగుల విస్తీర్ణంలో బురదనీటితో నిండిన ఈ మడుగులోకి వెళ్లే పీతలు, మొసళ్లు వంటి జీవులు నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడాన్ని వారు గమనించారు.సాధారణంగా సముద్రపు నీటిలో ఉండే ఉప్పదనం కంటే, ఈ మృత్యుసరోవరం నీటి ఉప్పదనం నాలుగురెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి కొద్ది జలచరాలు మాత్రమే ఇందులోని పరిస్థితులను తట్టుకుని మరీ బతకగలవని, మిగిలినవి ఇందులోకి దిగితే నిమిషాల్లోనే మరణిస్తాయని చెబుతున్నారు. దీనిని ‘హాట్ టబ్ ఆఫ్ డిస్పెయిర్’ అని, ‘జకూజీ ఆఫ్ డిస్పెయిర్’ అని అభివర్ణిస్తున్నారు.ఇవి చదవండి: గ్యాప్ ఇవ్వలా... వచ్చింది -
మలుపుల సరోవరం
విశాల్ వున్న, ప్రియాంకా శర్మ, శ్రీలత, తనికెళ్ల భరణి, ‘ఛత్రపతి’ శేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సరోవరం’. సురేష్ యడవల్లి దర్శకత్వంలో శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సురేష్ యడవల్లి మాట్లాడుతూ– ‘‘సరోవరం’ అనే గ్రామంలో జరిగిన కథ ఇది. భావోద్వేగంతో నడిచే ఈ కథలోని మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్.శ్రీలత. ‘‘మాస్కు కావాల్సిన అంశాలతో పాటు యూత్‌ని ఆకట్టుకునే అంశాలు కూడా ఉన్నాయి’’ అన్నారు నటులు ‘జబర్దస్త్’ నవీన్, రాము. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పులి ఈశ్వర్ రావు. -
‘సరోవరం’ 100 డేస్ ఆడాలి
విశాల్, ప్రియాంకా శర్మ జంటగా శ్రీలత క్రియేషన్స్ పతాకంపై నూతన దర్శకుడు సురేశ్ యాదవల్లి రూపొందించిన చిత్రం ‘సరోవరం’. ఈ చిత్రంతో ఎస్. శ్రీలత నిర్మాతగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హోం మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి పాటల సీడీలను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా 100డేస్ ఆడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. జబర్దస్త్ టీమ్ ఈ సినిమాలో మంచి కామెడీ చేశారు’’ అన్నారు విశాల్. ‘‘యూనిట్‌ని ప్రోత్సహించడానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంకా శర్మ. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, నిర్మాత శ్రీలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాకి బెక్కం రవీంద్ర లైన్ ప్రొడ్యూసర్. -
సరోవరంలో సస్పెన్స్
విశాల్, ప్రియాంకా శర్మ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సరోవరం’. సురేశ్ యాదపల్లిని దర్శకత్వంలో శ్రీలత నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్లు, టీజర్‌ను నిర్మాత మల్కాపురం శివకుమార్ రిలీజ్ చేశారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా షేక్ మాట్లాడు తూ– ‘‘మంచి కథతో తీస్తోన్న చిన్న సినిమాలు హిట్టవుతున్నాయి. ఆ తరహాలోనే ఈ చిత్రం కూడా సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘సరోవరం’ కథేంటి? టైటిల్ ఎందుకు పెట్టామన్నది ఆసక్తికరం. నటీనటు లందరూ కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా నటించారు’’ అన్నారు.