ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు రాజేష్ శ్రీ చక్రవర్తిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘శివకాశీపురం’. ప్రియాంకా శర్మ కథానాయిక. హరీష్ వట్టికూటి దర్శకత్వంలో సాయి హరీశ్వర ప్రొడక్షన్స్‌పై మోహన్‌బాబు పులిమామిడి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 3న విడుదల కానుంది. ‘‘ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. విభిన్న కథాంశాలతో రూపొందిన చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
యాక్షన్, పాటలు హైలైట్’’ అన్నారు హరీష్ వట్టికూటి. ‘‘దర్శకుడు, నటీనటులు, టెక్నీషియన్స్ సహకారంతో మంచి చిత్రాన్ని నిర్మించా. ఆగస్టు 3న రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు మోహన్‌బాబు పులిమామిడి. ఈ చిత్రానికి సంగీతం: పవన్ శేషా, కెమెరా: జయ జి. రామిరెడ్డి, సినిమా విడుదల పర్యవేక్షణ: విఎస్. విజయ్‌వర్మ పాకలపాటి.
సైకలాజికల్ థ్రిల్లర్
Published Wed, Jul 18 2018 12:46 AM | Last Updated on Wed, Jul 18 2018 12:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment