
సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడు రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా హరీష్ వట్టికూటి దర్శకత్వంలో మాస్టర్ హరి సమర్పణలో సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మోహన్‌బాబు పులిమామిడి నిర్మించిన సినిమా ‘శివకాశీపురం’. ఇందులో ప్రియాంకా శర్మ కథానాయికగా నటించారు. వచ్చే నెల 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాతలు కేవీవీ సత్యనారాయణ, రాజ్ కందుకూరి, రుద్రరాజు పద్మరాజు, నల్లమోతు శ్రీధర్ అతిథులుగా పాల్గొని చిత్రం పాటలు, ట్రైలర్, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ‘‘ట్రైలర్ బాగుంది. రాజేష్ బాగా నటించాడు. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కేవీవీ సత్యనారాయణ.
‘‘ఈ సినిమా టైటిల్ నాకు బాగా నచ్చింది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘ఈ రోజుల్లో చిన్న సినిమా విడుదల కావడం కష్టంగా మారింది. ట్రైలర్‌లో టీమ్ తపన కనిపిస్తోంది. వారి కష్టానికి తగిన ఫలితాన్ని అందించాలని మిత్రుడు విజయవర్మ సినిమా విడుదల బాధ్యతను తీసుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు రుద్రరాజు పద్మరాజు. ‘‘మంచి కథతో సినిమా తీశాం. హరీష్ బాగా తెరకెక్కించాడు’’ అన్నారు నిర్మాత మోహన్. ‘‘ఒక మంచి చిత్రం చేయడానికి నిర్మాత ఎలాంటి సహయం అదించాలన్నది మోహన్‌బాబుగారిని చూసి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో సినిమా చేయడం వేరు, దాన్ని రిలీజ్ చేయడం వేరు. ఆ బాధ్యతను తీసుకున్న విజయ్‌వర్మకు థ్యాంక్స్’’ అన్నారు హరీష్. ‘‘ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు విజయ్. ‘‘నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు థ్యాంక్స్. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు హీరో రాజేష్. ప్రియాంక శర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment