
సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు రాజేశ్ శ్రీ చక్రవర్తి హీరోగా హరీశ్ వట్టికూటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శివకాశీపురం’. ప్రియాంకా శర్మ కథానాయిక. సాయి హరేశ్వర ప్రొడక్షన్స్‌పై మోహన్‌బాబు పులిమామిడి నిర్మించిన ఈ చిత్రం తొలి పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హరీష్ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ అండ్ టీనేజ్ లవ్‌స్టోరీ ఇది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించాం’’ అన్నారు.
‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీపావళికి టీజర్‌ను రిలీజ్ చేస్తాం. ప్రీ–రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరుపుతాం. వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయాలను కుంటున్నాం’’ అన్నారు మోహన్‌బాబు. ‘‘నువ్వు చాలా హాట్ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. హీరోగా ఇది మొదటి సినిమా’’ అన్నారు రాజేశ్.
Comments
Please login to add a commentAdd a comment