first song
-
‘సర్కారు వారి పాట’ మూవీ టీంకు షాక్, ముందుగానే ఆన్‌లైన్‌లోకి..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ టీంకు మరోసారి భారీ షాక్ తగిలింది. ప్రారంభం నుంచి సర్కారు వారి పాటను పైరసి వీరులు వెంటాడుతున్నారు. ప్రారంభం నుంచి ఈ మూవీ అప్డేట్ విషయంలో చిత్ర బృందం కంటే లీక్ వీరులు ముందుగా స్పందిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ల నుంచి రేపు రాబోయే తొలి సాంగ్ వరకు ముందుగానే అప్డేట్ లీక్ చేస్తున్నారు. చదవండి: సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీపై నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా రేపు ఈ చిత్రం నుంచి విడుదల కానున్న ఫస్ట్ లిరికల్ సాంగ్ ముందుగానే నెట్టింట దర్శనమించింది. వాలంటైన్స్ డేకు మహేశ్ ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేయాలనుకున్న మూవీ టీంకు షాకిస్తూ లీకు వీరులు ఒకరోజు ముందుగానే ఈ పాటను ఆన్లైన్లో లీక్ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మూవీ టీజర్ ఇలాగే లీక్ అయ్యిందని.. ఇప్పుడు కళావతి పాట కూడా లీక్ కావడంతో… చిత్రయూనిట్‌పై మండిపడుతున్నారు. చదవండి: ఖిలాడి డైరెక్టర్‌తో రవితేజ వివాదం, రమేష్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్ ఇదిలా ఉంటే నిన్న(శుక్రవారం) కళావతి పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్, కీర్తి సురేశ్‌ల మధ్య రొమాంటి యాంగిల్ ఉండటంతో సోషల్ మీడియాలో రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఫుల్సాంగ్ ఆసక్తికగా ఎదురు చూస్తున్న వారికి ఇది బిగ్ సర్ప్రైజ్ అంటు కామెంట్స్ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 12న విడుదల కానుంది. -
'పుష్ప' ఫస్ట్ సింగిల్ ప్రోమో మామూలుగా లేదుగా..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్రైవర్ పుష్ప రాజ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టున్నాయి. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ చిత్రం ఫస్ట్ ఫార్ట్ కిస్మస్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు ఇదివరకే అధికారిక ప్రకటన వచ్చేసింది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ సాంగ్ “దాక్కో దాక్కో మేక” ఫస్ట్ సింగిల్‌ను ఆగస్టున13న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించిన చిత్రబృందం తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఐదు భాషల్లో ఐదుమంది సింగర్స్‌తో ఈ పాటను పాడించారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. The Deadly Combo is Ready to Rock on this 13th with #PushpaFirstSingle🔥 - https://t.co/abv0fE7Zi5#Pushpa #ThaggedheLe@alluarjun @iamRashmika #FahadhFaasil @thisisdsp @aryasukku @resulp @adityamusic @MythriOfficial pic.twitter.com/7BrNqyiBku — Aditya Music (@adityamusic) August 10, 2021 -
ఎస్పీ బాలు మొదటి, చివరి పాట తెలుసా?
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. సింగర్ అవ్వాలని అనుకోలేదు. కానీ గాయకుడిగా మారాక పాటనే ప్రాణంగా ప్రేమించాడు. నటన, నిర్మాణం, డబ్బింగ్ ఇలా ఎన్నింటిలోనూ రంగ ప్రవేశం చేశారు.. కానీ పాటల పల్లకితోనే చివరి వరకూ ప్రయాణం చేశారు. చావు అంచున ఉన్న చివరి క్షణాల్లోనూ పాడుతూ మృత్యువు ఒడిలోకి వెళ్లిపోవాలన్నది ఆయన చివరి కోరిక. మరి ఆయన పాడిన మొదటి పాట, ఆఖరు పాట ఏంటో తెలుసుకుందాం. 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రం ద్వారా ఎస్పీ బాలుకు తొలిసారి వెండితెరపై ఓ పాట పాడే అవకాశం లభించింది. (చదవండి: జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’) 1966లో విడుదలైన ఈ సినిమాకు ఎస్పి కోదండపాణి సంగీతం అందించారు. నటుడు, నిర్మాత పద్మనాభం చిత్రాన్ని నిర్మించారు. ఇందులో గాయని పి.సుశీలతో కలిసి "ఏమి వింత మోహం" అనే పాటను బాలు ఆలపించారు. చివరగా.. గత ఏడాది వచ్చిన 'పలాస 1978' సినిమాలో 'ఓ సొగసరి' అనే పాటను పలాస బేబీతో కలిసి పాడారు. లక్ష్మి భూపాల రాసిన ఈ పాటకు రఘు కుంచె సంగీతం అందించారు. బాలు తన కెరీర్లో 16 భాషల్లో 40 వేల పై చిలుకు పాటలు పాడి, అత్యధిక పాటలు పాడిన సింగర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమగాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది. (చదవండి: పాట కోసమే ఆయన పుట్టారు..) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘యన్.టి.ఆర్’ తొలి పాట..!
బాలకృష్ణ హీరోగా నందమూరి తారకరామరావు జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈసినిమా తొలిభాగం యన్.టి.ఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఆదివారం తొలి పాటను రిలీజ్ చేశారు. రచయితలు శివ శక్తిదత్తా, కే రామకృష్ణలు పూర్తి సంస్కృత పదాలతో గంభీరమైన పాటను రచించారు. కీరవాణి సంగీత సారధ్యంలో బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్ ఈ గీతాన్ని ఆలపించారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా, సుమంత్, సత్యనారాయణలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
అందమైన ప్రేమకథ!
సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు రాజేశ్ శ్రీ చక్రవర్తి హీరోగా హరీశ్ వట్టికూటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శివకాశీపురం’. ప్రియాంకా శర్మ కథానాయిక. సాయి హరేశ్వర ప్రొడక్షన్స్‌పై మోహన్‌బాబు పులిమామిడి నిర్మించిన ఈ చిత్రం తొలి పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హరీష్ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ అండ్ టీనేజ్ లవ్‌స్టోరీ ఇది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించాం’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీపావళికి టీజర్‌ను రిలీజ్ చేస్తాం. ప్రీ–రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరుపుతాం. వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయాలను కుంటున్నాం’’ అన్నారు మోహన్‌బాబు. ‘‘నువ్వు చాలా హాట్ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. హీరోగా ఇది మొదటి సినిమా’’ అన్నారు రాజేశ్. -
స్టార్స్ ఆన్ రోడ్!
ఫస్ట్ ట్రైలర్‌తోనే ఇండస్ట్రీ, అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది సూజిత్ సర్కార్ రూపొందిస్తున్న ‘పికూ’. లేటెస్ట్గా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. చిత్రంలోని తొలి సాంగ్... ‘జర్నీ’ ఇది. ఈ పాటలో మెగా స్టార్ అమితాబ్ బచన్, సూపర్ హీరోయిన్ దీపికా పడుకొనే, నటుడు ఇర్ఫాన్ ఖాన్లు... దిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రయాణిస్తుంటారు. అనుపమ్ రాయ్, శ్రేయ గోశాల్ ఈ పాట ఆలపించారు. ఈ ట్రైలర్‌కు కూడా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తండ్రీ కూతుళ్ల చుట్టూ తిరిగే కథ ఇది. అమితాబ్, దీపికా ఈ రోల్స్ ప్లే చేస్తున్నారు. దీపిక అందాల రాసిగా కనిపించడమే కాదు... అద్భుతంగా నటించిందనేది ఇండస్ట్రీ టాక్. ఇక బిగ్ బీ పెర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుందట! వీరికి తోడు క్యారెక్టర్లో ఒదిగిపోయే ఇర్ఫాన్‌ఖాన్ ఉండనే ఉన్నాడు. మూవీ మంచి మార్కులు కొట్టేయడం ఖాయమని ఇప్పటి నుంచే బీటౌన్‌లో టాక్! -
గోపాల.. గోపాల మొదటి పాట విడుదల
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'గోపాల గోపాల' సినిమాలో మొదటి పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. లహరి మ్యూజిక్ సంస్థ ఈ పాటను విడుదల చేసింది. ''ఆరరే ఆలా.. ఆయారే నందలాలా'' అంటూ ఈ పాట మొదలవుతుంది. తర్వాత ప్రధానంగా 'భాజేరే భాజే.. డోల్ భాజే' అంటూ కొనసాగుతుంది. మొదటి మోషన్ పోస్టర్లో అందించిన నేపథ్య సంగీతమే ఇందులో వినపడుతుంది. ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మోషన్ పోస్టర్ తరహాలోనే ఈ పాటను విడుదల చేయడం గమనార్హం. ఉయ్యాలలో కూర్చున్న వెంకటేశ్, పవన్ కల్యాణ్ బైకు వెనక కూర్చున్న వెంకటేశ్, ఉయ్యాలలో విలాసంగా పవన్ కూర్చుని ఉండగా.. వెంకటేశ్ కూడా వెనకాల అదే తరహాలో నిలుచుండటం తదితర ఫొటోలు ఈ మోషన్ పోస్టర్లో కనిపిస్తాయి. -
గోపాలుని పరిచయ గీతం
మసాలా సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్‌కి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో, పరిచయ గీతానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. సినిమాలో ఫస్ట్ సాంగ్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు అభిమానులు. ‘గోపాలా గోపాలా’ టీమ్ ప్రస్తుతం అదే పనిమీద ఉంది. ఇటీవలే హైదరాబాద్ హైటెక్ సిటీ ఫ్లై ఓవర్‌పై పవన్‌కల్యాణ్ పరిచయ సన్నివేశాన్ని చిత్రీకరించారు దర్శకుడు కిశోర్‌కుమార్ పార్థసాని(డాలీ). ఇప్పుడు పరిచయ గీతం చిత్రీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన లీడ్ సన్నివేశాన్ని మంగళవారం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో సుచిత్రా చంద్రబోస్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్ తదితరులు ఈ సన్నివేశంలో పాల్గొన్నారు. ఈ పాట చిత్రీకరణలో పవన్‌కల్యాణ్ కూడా పాల్గొంటారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ సన్నాహాలు చేస్తున్నారు. -
స్వరరాగ గంగాప్రవాహానికి స్వర్ణోత్సవం!
సందర్భం: కె.జె. ఏసుదాస్ తొలి తెలుగు పాటపాడి 50 ఏళ్లు లాంగ్ జర్నీ చేయాల్సొచ్చింది. తోడుగా ఎవరూలేరు. కె.జె.ఏసుదాస్ ఎంపిత్రీ మాత్రమే ఉంది. కారులో నేను. తోడుగా ఏసుదాస్ పాటలు. కాలం తెలియడం లేదు. అలసట అంతకన్నా లేదు. ఓ మధుర యాత్ర మొదలైంది. ‘ఓ.... నిండు చందమామ... నిగనిగలా భామ.... ఒంటరిగా సాగలేవు... కలిసిమెలసి పోదామా...ఓ...ఓ..ఓ’ అబ్బ... సంగీతం ఎంత శక్తిమంతమైంది. ఎక్కడలేని ఏకాగ్రత. అంతులేని ప్రశాంతత. ‘ఒంటరిగా సాగలేవు... కలిసిమెలసి పోదామా..’ ఇంకేముంది... కొండంత భరోసా ఇచ్చేశారు ఏసుదాస్. మనిషి తోడులేడన్న బాధ క్షణాల్లో దూదిపింజలా ఎగిరిపోయింది. సంగీతం మధురం. ఇది నిజం. నాలుగైదు పాటలు ఆపకుండా వింటాం. కానీ... ఆరో పాటకొచ్చేసరికి ‘ఇక చాల్లే’ అనిపిస్తుంది. తీపిని అదే పనిగా తినలేం కదా. కానీ ఏసుదాస్ పాట తీయనిది కాదు. ఎందుకంటే... తీపిలా ఆయన పాట వెగటు అనిపించదు. ఏసుదాస్ పాట అమ్మ గోరుముద్ద లాంటిది. ఎప్పటికీ ఆ రుచి వెంటాడుతూనే ఉంటుంది. సోలో సాంగ్స్ పాడటంలో ఏసుదాస్ కింగ్. సినిమాలో ఆయన పాట ఉందీ అంటే... ‘ఆ ఆల్బమ్‌లో అదే హిట్’. అందులో తిరుగేలేదు. మన దర్శకులు కూడా ఏసుదాస్‌తో అలాంటి పాటలు పాడించడానికే మక్కువ చూపించారు. అయితే.. ఏసుదాస్ పాడిన యుగళగీతాలు కొన్ని ఉన్నాయి. ఆ పాటలు వింటే... మనసుకు చేరువైన వారితో ఇమ్మీడియట్‌గా కాసేపు స్పెండ్ చేయాలనిపిస్తుంది. అంతగా ప్రభావితం చేస్తాయి ఆ పాటలు. కెరీర్ ప్రారంభంలో ఎస్.జానకితో ఆయన పాడిన ‘కొంగున కట్టేసుకోనా..’ పాట అందుకు ఉదాహరణ. ‘ఇద్దరు మొనగాళ్లు’(1966) సినిమాలోని ఈ పాట ఇప్పుడు విన్నా.. హృదయమంతా బరువనిపిస్తుంది. ‘జడతోనే కట్టేసుకోవే... ఓ రాణి రాణి రాణీ... ఒడిలోన లాలించుకోవే... నను వడిలోన లాలించుకోవే..’ అని ఓ విధమైన జిలుగుతో అంటారాయన. ఆ అక్షరాలు ఏసుదాస్ గళం నుంచి జాలువారుతుంటే మనలో ఏదో తెలీని ఫీలింగ్. ‘శివమెత్తిన సత్యం’(1982)లోని గీతా... ఓ గీతా... డార్లింగ్.. మై డార్లింగ్, ‘పచ్చనికాపురం’(1955)లోని ‘వెన్నెలైనా... చీకటైనా..’ ఇలా చెప్పుకుంటూ పోతే... ఆయన పాడిన డ్యూయెట్లు ఎన్నో.. ఎన్నో.. ఎన్నెన్నో... ఏసుదాస్ స్వరం మృదంగనాదంలా ఉంటుంది. భావ గంభీరత ఆయనకు దేవుడిచ్చిన వరం. సాధారణమైన పాటకు తన గానంతో చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తారు ఏసుదాస్. ఆ గళం నుంచి జాలువారి.. చిర స్థానాన్ని సంపాదించిన గాన కుసుమాలు వేలల్లోనే. విరహం, విచారం, వైరాగ్యం, వేదాంతం, భక్తి... ఇలా ఏ భావమైనా... ఏసుదాస్ గొంతు నుంచే వినాలి. ‘దారి చూపిన దేవతా...ఈ చేయి ఎన్నడు వీడక’, ‘ఆలనగా.. పాలనగా అలసిన వేళల అమ్మవుగా’, ‘తకథిమి తకథిమి తోం దీని తస్సాదీయా...’, ‘మిడిసి పడే దీపాలివి.. మిన్నెగసి పడే కెరటాలివి’, ‘రజనీ రజనీ రజనీ పూవవుతున్న మొగ్గవని’, ‘చుక్కల్లే తోచావె’, ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు’, ‘స్వరరాగ గంగా ప్రవాహమే..’, ‘అనురాగమె మంత్రంగా’, ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ’... ఇలా చెప్పుకుంటూ పోతే... తెలుగు శ్రోతలకు ఏసుదాస్ అందించిన స్వర వరాలు ఎన్నో. ఈ మధ్య పాడటం కాస్త తగ్గించిన ఏసుదాస్... రీసెంట్గా ‘మిథునం’ చిత్రంలో ‘ఆదిదంపతులు..’ పాట పాడారు. తెలుగులో ఏసుదాస్ పాడిన తొలి పాట ‘బంగారు తిమ్మరాజు’ సినిమాలోనిది. ఎస్పీ కోదండపాణి స్వరాలందించిన ఆ సినిమా విడుదలై నేటికి యాభై ఏళ్లు. అంటే తెలుగు లోగిళ్లలోకి ఏసుదాస్ పాట ప్రవేశించి అయిదు దశాబ్దాలైందన్నమాట. ఇన్నాళ్లుగా తన గానామృతంతో ఓలలాడిస్తూ... శ్రోతల్ని రుణగ్రస్థుల్ని చేశారాయన ‘స్వాతికిరణం’లో చెప్పినట్లు.. నిజంగా... ఏసుదాస్‌ని కన్నవారి జన్మ పావనం. ఆయన పాటలు విన్నవారి జన్మ శ్రావణం.