Pushpa Promo: Allu Arjuns Pushpa Movie First Single Promo Released - Sakshi
Sakshi News home page

Pushpa : తగ్గేదే లే.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..

Published Tue, Aug 10 2021 3:17 PM | Last Updated on Tue, Aug 10 2021 4:12 PM

Allu Arjuns Pushpa Movie Update: First Single Released - Sakshi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఎర్ర చందనం స్మ‌గ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ డ్రైవర్ పుష్ప రాజ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన  టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టున్నాయి. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ చిత్రం ఫస్ట్‌ ఫార్ట్‌ కిస్మస్‌ సందర్భంగా రిలీజ్‌ కానున్నట్లు ఇదివరకే  అధికారిక ప్రకటన వచ్చేసింది.

దీంతో ప్రమోషన్‌  కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఈ  మూవీ ఫస్ట్‌ సాంగ్‌ “దాక్కో దాక్కో మేక” ఫస్ట్‌ సింగిల్‌ను ఆగస్టున13న రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించిన చిత్రబృందం తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది.  ఐదు భాషల్లో ఐదుమంది సింగర్స్‌తో ఈ పాటను పాడించారు. దేవీశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement