‘యన్‌.టి.ఆర్‌’ తొలి పాట..! | Ntr Biopic NTR Kathanayakudu First Single | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 2 2018 8:40 AM | Last Updated on Sun, Dec 2 2018 4:01 PM

Ntr Biopic NTR Kathanayakudu First Single - Sakshi

బాలకృష్ణ హీరోగా నందమూరి తారకరామరావు జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈసినిమా తొలిభాగం యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. ఆదివారం తొలి పాటను రిలీజ్ చేశారు.

రచయితలు శివ శక్తిదత్తా, కే రామకృష్ణలు పూర్తి సంస్కృత పదాలతో గంభీరమైన పాటను రచించారు. కీరవాణి సంగీత సారధ్యంలో బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్‌ ఈ గీతాన్ని ఆలపించారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ ఎన్టీఆర్‌ సతీమణి బసవ తారకం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా, సుమంత్‌, సత్యనారాయణలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement