యన్‌.టి.ఆర్‌ : 16న ట్రైల‌ర్.. 21న ఆడియో | Ntr Biopic Trailer And Audio Launch Dates | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 13 2018 12:24 PM | Last Updated on Thu, Dec 13 2018 5:40 PM

Ntr Biopic Trailer And Audio Launch Dates - Sakshi

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ యన్‌టిఆర్‌ బయోపిక్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ స్టిల్స్‌తో పాటు రెండు పాటలను కూడా విడుదల చేశారు.  తాజాగా చిత్ర టైలర్‌, ఆడియో రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు.

యన్‌.టి.ఆర్‌ ట్రైల‌ర్ లాంచ్‌ డిసెంబర్‌ 16న హైద‌రాబాద్‌లో, ఆడియో రిలీజ్ ఈవెంట్ డిసెంబర్‌ 21న నంద‌మూరి తార‌క‌రామారావు పుట్టిన ఊరు నిమ్మకూరులో జ‌ర‌గ‌నున్నాయి.ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా యన్‌.టి.ఆర్‌ క‌థానాయ‌కుడు, యన్‌.టి.ఆర్‌ మ‌హానాయ‌కుడు పేర్లతో  రెండు భాగాలుగా వ‌స్తుంది. విద్యాబాల‌న్, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్, ర‌కుల్ ప్రీత్ సింగ్, లెజెండ‌రీ కైకాల స‌త్యనారాయ‌ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement