గోపాల.. గోపాల మొదటి పాట విడుదల | first song of gopala gopala released in youtube | Sakshi
Sakshi News home page

గోపాల.. గోపాల మొదటి పాట విడుదల

Published Thu, Jan 1 2015 5:26 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

గోపాల.. గోపాల మొదటి పాట విడుదల - Sakshi

గోపాల.. గోపాల మొదటి పాట విడుదల

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'గోపాల గోపాల' సినిమాలో మొదటి పాటను యూట్యూబ్లో విడుదల చేశారు. లహరి మ్యూజిక్ సంస్థ ఈ పాటను విడుదల చేసింది. ''ఆరరే ఆలా.. ఆయారే నందలాలా'' అంటూ ఈ పాట మొదలవుతుంది. తర్వాత ప్రధానంగా 'భాజేరే భాజే.. డోల్ భాజే' అంటూ కొనసాగుతుంది. మొదటి మోషన్ పోస్టర్లో అందించిన నేపథ్య సంగీతమే ఇందులో వినపడుతుంది.

ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మోషన్ పోస్టర్ తరహాలోనే ఈ పాటను విడుదల చేయడం గమనార్హం. ఉయ్యాలలో కూర్చున్న వెంకటేశ్,  పవన్ కల్యాణ్ బైకు వెనక కూర్చున్న వెంకటేశ్, ఉయ్యాలలో విలాసంగా పవన్ కూర్చుని ఉండగా.. వెంకటేశ్ కూడా వెనకాల అదే తరహాలో నిలుచుండటం తదితర ఫొటోలు ఈ మోషన్ పోస్టర్లో కనిపిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement