Sarkaru Vaari Paata Movie Song Leaked: - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ మూవీ టీంకు షాక్‌, ఒకరోజు ముందుగానే ఆన్‌లైన్‌లోకి..

Feb 12 2022 7:52 PM | Updated on Feb 12 2022 9:08 PM

Sarkaru Vaari Paata Movie First Lyrical Song Leaked Online Before Day February 14th - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ టీంకు మరోసారి భారీ షాక్‌ తగిలింది. ప్రారంభం నుంచి సర్కారు వారి పాటను పైరసి వీరులు వెంటాడుతున్నారు. ప్రారంభం నుంచి ఈ మూవీ అప్‌డేట్‌ విషయంలో చిత్ర బృందం కంటే లీక్‌ వీరులు ముందుగా స్పందిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ల నుంచి రేపు రాబోయే తొలి సాంగ్‌ వరకు ముందుగానే అప్‌డేట్‌ లీక్‌ చేస్తున్నారు.

చదవండి: సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీపై నటుడు నరేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కాగా రేపు ఈ చిత్రం నుంచి విడుదల కానున్న ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ ముందుగానే నెట్టింట దర్శనమించింది. వాలంటైన్స్‌ డే​కు మహేశ్‌ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్న మూవీ టీంకు షాకిస్తూ లీకు వీరులు ఒకరోజు ముందుగానే ఈ పాటను ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మూవీ టీజర్ ఇలాగే లీక్ అయ్యిందని.. ఇప్పుడు కళావతి పాట కూడా లీక్ కావడంతో… చిత్రయూనిట్‏పై మండిపడుతున్నారు. 

చదవండి: ఖిలాడి డైరెక్టర్‌తో రవితేజ వివాదం, రమేష్‌ వర్మ భార్య షాకింగ్‌ కామెంట్స్‌

ఇదిలా ఉంటే నిన్న(శుక్రవారం) కళావతి పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్‌, కీర్తి సురేశ్‌ల మధ్య రొమాంటి యాంగిల్‌ ఉండటంతో సోషల్ మీడియాలో రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఫుల్‌సాంగ్‌ ఆసక్తికగా ఎదురు చూస్తున్న వారికి ఇది బిగ్‌ సర్‌ప్రైజ్‌ అంటు కామెంట్స్‌ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 12న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement