Leaked
-
ఒక్క వీడియోతో రెండు నెలల కష్టం బూడిదలో పోసినట్లైంది: డైరెక్టర్ ఆవేదన
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం రజినీకాంత్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీని భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో సైమన్ పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వైజాగ్‌లో నాగార్జున్పై ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట లీకైంది. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేశారు. అది కాస్తా వైరల్ కావడంతో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్పందించారు. దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.లోకేశ్ తన ట్వీట్లో రాస్తూ..' మేము దాదాపు రెండు నెలల పాటు కష్టపడ్డాం.. ఈ ఒక్క వీడియోతో మా కష్టం వృథా అయింది. మీ అందరికీ నాదొకటే విజ్ఞప్తి.. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు.. దీని వల్ల మేం పడిన కష్టమంతా వృథా అవుతుంది.. ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: రజినీకాంత్- కనగరాజ్ 'కూలీ'.. నాగార్జున వీడియో లీక్!) కాగా.. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ దేవాగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో జరుగుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Two months of hard work by many people have gone in vain because of one recording. I humbly request everyone not to engage in such practices, as they spoil the overall experience. Thank you.— Lokesh Kanagaraj (@Dir_Lokesh) September 18, 2024 -
ఐఫోన్ 16 ఫోన్లు ఇలాగే ఉంటాయా?
కొత్త ఏడాదిలో యాపిల్ నుంచి రానున్న హై-ఎండ్ వేరియంట్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఐఫోన్ 16 (iPhone 16), ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ లుక్, స్పెసిఫికేషన్లు ఇలాగే ఉంటాయంటూ వాటి ప్రోటోటైప్ లీక్ అయింది. యాపిల్ అంతర్గత డిజైన్ల ఆధారంగా మ్యాక్రూమర్స్ (MacRumors) అనే వెబ్సైట్ ఐఫోన్ 16, ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లు ఇలాగే ఉంటాయంటూ మాక్అప్లను రూపొందించింది. వీటి ప్రకారం.. యాపిల్ తదుపరి తరం వేరియంట్లు పెద్ద డిస్ప్లే, కెపాసిటివ్ క్యాప్చర్ బటన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఐఫోన్ 16 వేరియంట్ డిస్ప్లే 6.3 అంగుళాలు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్ప్లే 6.9 అంగుళాలు ఉంటాయి. అంటే ఇది ఐఫోన్ 15 ప్రో లైనప్‌లో ఉన్న 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల కంటే ఎక్కువ. ప్రో మోడల్‌లలో వస్తుందని భావిస్తున్న కొత్త టెలిఫోటో కెమెరా మాడ్యూల్ దీనికి కారణం కావచ్చు. గత సంవత్సరం వచ్చిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లో మాత్రమే టెలిఫోటో లెన్స్ ఉంది. కానీ రానున్న రెండు ప్రో మోడల్‌లలో టెలిఫోటో లెన్స్‌లను చూడొచ్చని భావిస్తున్నారు. డిజైన్ విషయంలో గతంలో వచ్చిన వేరియంట్ల కంటే పెద్దగా మార్పులు లేనప్పటికీ రానున్న కొత్త మోడల్స్‌లో కనీసం నాలుగు బటన్ కాన్ఫిగరేషన్లతో ప్రయోగాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే బటన్ ప్లేస్మెంట్ ఉంటుంది కానీ యాడెడ్ బటన్‌తో ఉంటుంది. కొత్త క్యాప్చర్ బటన్ ఫోర్స్-సెన్సార్ ఫంక్షనాలిటీతో కెపాసిటివ్గా ఉంటుందని భావిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఈ బటన్ వీడియో రికార్డింగ్ కోసమే ప్రత్యేకంగా ఉపయోగించేలా ఉంటుందని సమాచారం. -
రాజకీయాలను దిగజార్చిన కేసీఆర్
చుంచుపల్లి: ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. శనివారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లా డారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని ప్రలోభా లకు గురిచేసి తమ వైపు తిప్పుకునే సంస్కృతి బీఆర్ఎస్లో కొనసాగుతోందని, ప్రలోభాలకు లొంగకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘ఎవడిపాలైందిరో తెలంగాణ’ అనే పాటతో రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసిన సోమన్న.. గతంలో ఈ ప్రభుత్వంతో కొట్లాడారని, అలాంటి వ్యక్తి నేడు గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యాడని, నాయకులను, ప్రజాగాయకుల ను ఎలా లొంగదీసుకుంటున్నారో దీన్ని బట్టే అర్థం అవుతోందని ఈటల వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వ హయాంలో వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి 17 పేపర్లు లీక్ అయ్యాయని, ఫలితంగా ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలు ఆగమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబంలో ఐదు పదవులు ఉన్నాయని, అవి కూడా అత్యంత కీలకమైన శాఖలని గుర్తుచే శారు. కాగా, బీజేపీకి సంబంధించి అసెంబ్లీ ఎన్ని కల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతోందని, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో దరఖాస్తుల పరిశీ లన జరుగుతోందని ఆయన చెప్పారు. -
యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్...ఇక పండగే!
Apple Big Event iphone15 launch: టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి చెందిన కొత్త ఐఫోన్ వస్తోందంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు .ప్రతీ ఏడాది సెప్టెంబరులో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లో యాపిల్ ఈ సందడి ఉంటుంది. ఈ సందర్భంగా యాపిల్ తన కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో కొత్త ఫ్లాగ్‌షిప్‌లను లాంచ్‌లపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా రానున్న ఐఫోన్ 15 లాంచింగ్ డేట్ లీక్అయింది. రానున్న యాపిల్ బిగ్ ఈవెంట్కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజా లీక్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో ,ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఎప్పుడు లాంచ్ చేయబడుతుందో తేదీ బహిర్గతమైంది. సాధారణంగా ఈ ఈవెంట్‌ను తేదీని యాపిల్ లీక్‌కాకుండా చివరి గంట వరకూ ఉత్కంఠ రేపుతుంది.తాజా నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 13న యాపిల్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 13న లీవ్ తీసుకోవద్దని కంపెనీ తన ఉద్యోగులను కోరినట్టుతెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 7 ఈవెంట్ బుధవారం జరిగినప్పటికీ, ఐఫోన్ ప్రకటనలలో ఎక్కువ భాగం మంగళవారాల్లోనే జరిగాయి. సెప్టెంబరు 13 బుధవారం నాడు వస్తుంది కాబట్టి, ఈ ఏడాది స్పెషల్ ఈవెంట్కూడా అప్పుడే ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) సరఫరా సమస్యల కారణంగా ఐఫోన్ 14 ప్లస్ విక్రయాలు గత ఏడాది అక్టోబర్ 7న ప్రారంభమయ్యాయి. 2020లో ఐఫోన్ 12 Pro Max, ఐఫోన్12 mini లాంచింగ్ లేట్ అయింది. ఈ ఏడాది సేల్ కూడా ఐఫోన్ 15 మోడల్‌లు "తీవ్రమైన కొరత" కారణంగా ఆలస్యం కావచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తుండగా, మరికొందరు అన్ని కొత్త మోడళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే, యాపిల్ అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) Breaking 😍 Apple to launch iPhone 15 series on 13 September, 2023. USB-C#iPhone15 #USBC #Apple pic.twitter.com/2YPVLTMlbR — Abhishek Yadav (@yabhishekhd) August 4, 2023 -
టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల.. లీక్‌పై డైరెక్టర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ సోమవారం అనధికారికంగా బయటకొచ్చింది. అందుబాటులోకి వచ్చిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచి మొదలయ్యే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మార్చి 4వ తేదీతో ముగియనుంది. షెడ్యూల్ ఇలా... ♦జనవరి 27న అన్ని కేటగిరీల్లో ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్లైన్లో ప్రకటిస్తారు. ♦28 నుంచి 30 వరకు బదిలీ దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు ♦జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 లోపు.. దరఖాస్తుల హార్డ్ కాపీలను హైసూ్కల్ ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ పీఎస్, యూపీఎస్ ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈఓకు సమర్పించాలి ♦ఫిబ్రవరి 3–6 తేదీల మధ్య దరఖాస్తుల హార్డ్ కాపీలను ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు డీఈఓ కార్యాలయంలో సమరి్పంచడం, పరిశీలన.. ఆన్లైన్లో ఆమోదం. ♦7న డీఈఓ/ఆర్జేడీ వెబ్సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ, పదోన్నతుల సీనియారిటీ జాబితాలు ప్రకటిస్తారు. ♦8 నుంచి 10 వరకు మూడురోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, పరిష్కారం జరుగుతుంది. ♦11, 12 తేదీల్లో తుది సీనియారిటీ జాబితాల ప్రకటన, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు. ♦13న మల్టీ జోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునఃపరిశీలన చేసుకోవచ్చు. ♦14న ఆర్జేడీలు ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు విడుదల. ♦15న బదిలీల అనంతరం మిగిలిన ఖాళీల ప్రకటన. ►16, 17, 18 తేదీల్లో అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్ జరుగుతుంది. ►19, 20 తేదీల్లో సబ్జెక్ట్ వారీగా స్కూల్ అసిస్టెంట్స్ ఖాళీల ప్రకటన, బదిలీ ఆప్షన్స్ నమోదు. ►21న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం. ►22, 23 తేదీల్లో డీఈఓలచే స్కూల్ అసిస్టెంట్స్ బదిలీ ఉత్తర్వులు విడుదల. ►24న స్కూల్ అసిస్టెంట్ల బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన. ►25, 26, 27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు (కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు) మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు. ►ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన, వెబ్ ఆప్షన్ల నమోదు. ∙3న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలన. ►4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల. ►5 నుండి 19 వరకు డీఈఓలు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీళ్లు/అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు పంపవచ్చు. డైరెక్టర్ ఆగ్రహం: టీచర్ల బదిలీల షెడ్యూల్ బయటకు రావడంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన డీఈవోల సమావేశంలో విద్యా శాఖ బదిలీల షెడ్యూల్‌పై చర్చించారు. సమావేశం జరుగు తుండగానే షెడ్యూల్ లీకయ్యింది. ఈ నేపథ్యంలో డీఈవోల ఫోన్లు స్వా«దీనం చేసుకుని పరిశీలించినట్లు తెలిసింది. -
వాల్తేరు వీరయ్య సాంగ్ లీక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
-
తీహార్ లీక్స్.. బయటకొచ్చిన సత్యేంద్ర జైన్ మరో వీడియో
-
ట్రంప్ సోషల్ మీడియా డీల్ లీక్!
వాషింగ్టన్: యూఎస్ క్యాపిటల్ దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడిగా సేవలందించిన డొనాల్డ్ ట్రంప్.. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లు శాశ్వతంగా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ సొంతంగా కొత్త మీడియా కంపెనీతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ను లాంచ్ చేశారు. ప్రసుతం ఆయా కంపెనీలకు సంబంధించిన ఒప్పందాలు ముందుగా లీక్ అయ్యాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా కంపెనీ, బ్లాక్ చెక్ ఎంటిటీ మధ్య పెండింగ్‌లో ఉన్న విలీన ఒప్పందం గురించి మియామీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలోని ఉద్యోగులు ముందుగానే తెలుసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. రాకెట్ వన్ క్యాపిటల్ సంస్థ అధికారులు బ్లాంక్ చెక్ కంపెనీ డిజిటల్ అక్విజిషన్ కార్పొరేషన్లో పెట్టుబడుల పెట్టడం ద్వారా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలీజీ పొందే లాభాల తోపాటు ప్రకటించనున్న లావాదేవీల గురించి వెల్లడించారని తెలిపింది. అంటే ఇంకా పెండింగ్‌లో ఉన్న ఈ విలీన ఒప్పంద గురించి కీలక విషయాలు బయటకు రావడాన్నిబట్టి చూస్తే ముందుగానే ఈ విషయాలు బయటకు పొక్కినట్లు తెలుస్తోందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అదీగాక ఇప్పుడూ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు, రెగ్యులేటర్లు ఈ విషయమై కూలంకషంగా దర్యాప్తు చేయడమే కాకుండా పెండింగ్‌లో ఉన్న విలీన ఒప్పందం విషయాలను ముందుగానే బహిర్గతం చేసిన వ్యక్తులతో సహా విచారణ చేయడం మొదలు పెట్టింది. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్రూత్ సోషల్ సృష్టికర్త అక్టోబర్ 20న డిజిటల్ వరల్డ్‌తో విలీనానికి అంగీకరించారు. పైగా ఈ ఏడాది ద్వితియార్థంలో ఈ ఒప్పందం ముగుస్తుంది. ఈ డీల్ గురిచి ప్రకటించిన తదనంతరం డిజిటల్ వరల్డ్ షేర్లు అనుహ్యంగా 350 శాతం వరకు పెరిగాయి. ఐతే ఈ విషయమై ట్రంప్ మీడియా గానీ, రాకెట్ వన్ క్యాపిటల్ గానీ స్పందించలేదు. (చదవండి: ఫైటర్ జెట్‌లో ‘బోరిస్’ సెల్ఫీ వీడియో.. నెటిజన్ల పైర్!) -
‘సర్కారు వారి పాట’ మూవీ టీంకు షాక్, ముందుగానే ఆన్‌లైన్‌లోకి..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ టీంకు మరోసారి భారీ షాక్ తగిలింది. ప్రారంభం నుంచి సర్కారు వారి పాటను పైరసి వీరులు వెంటాడుతున్నారు. ప్రారంభం నుంచి ఈ మూవీ అప్డేట్ విషయంలో చిత్ర బృందం కంటే లీక్ వీరులు ముందుగా స్పందిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ల నుంచి రేపు రాబోయే తొలి సాంగ్ వరకు ముందుగానే అప్డేట్ లీక్ చేస్తున్నారు. చదవండి: సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీపై నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా రేపు ఈ చిత్రం నుంచి విడుదల కానున్న ఫస్ట్ లిరికల్ సాంగ్ ముందుగానే నెట్టింట దర్శనమించింది. వాలంటైన్స్ డేకు మహేశ్ ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేయాలనుకున్న మూవీ టీంకు షాకిస్తూ లీకు వీరులు ఒకరోజు ముందుగానే ఈ పాటను ఆన్లైన్లో లీక్ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మూవీ టీజర్ ఇలాగే లీక్ అయ్యిందని.. ఇప్పుడు కళావతి పాట కూడా లీక్ కావడంతో… చిత్రయూనిట్‌పై మండిపడుతున్నారు. చదవండి: ఖిలాడి డైరెక్టర్‌తో రవితేజ వివాదం, రమేష్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్ ఇదిలా ఉంటే నిన్న(శుక్రవారం) కళావతి పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్, కీర్తి సురేశ్‌ల మధ్య రొమాంటి యాంగిల్ ఉండటంతో సోషల్ మీడియాలో రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఫుల్సాంగ్ ఆసక్తికగా ఎదురు చూస్తున్న వారికి ఇది బిగ్ సర్ప్రైజ్ అంటు కామెంట్స్ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 12న విడుదల కానుంది. -
పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రాలు లీక్
సాక్షి హైదరాబాద్: ఈ నెల 8 నుంచి ప్రారంభమైన పాలిటెక్నిక్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నట్లు బోర్డు గుర్తించింది. దీంతో బోర్డు ఇతర జిల్లాలోని కాలేజి ప్రిన్సిపాల్స్‌ను అప్రమత్తం చేసింది. ఈ మేరకు బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ విద్యార్థులకు వాట్స్అప్ ద్వారా పేపర్లను పంపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో బోర్డు సెక్రెటరీ ప్రశ్నాపత్రాల లీక్ విషయమై ఆ ఇన్స్టిట్యూట్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ పైకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లీకైన కౌశిక్‌రెడ్డి మరో ఆడియో క్లిప్
-
లీకైన ఐఫోన్ 13 ఫీచర్లు
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్ ఐఫోన్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్. ఆపిల్ ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోని రిలీజ్ చేయనున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఐఫోన్ 13 కు సంబంధించి పలు ఫీచర్లు ఆన్లైన్లో లీకైయ్యాయి. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 12 సిరీస్‌తో పోల్చితే ఐఫోన్ 13లో పెద్ద వైర్లెస్ ఛార్జింగ్ కాయిల్‌ను అమర్చారు. దీంతో ఛార్జింగ్ కాయిల్ వేడేక్కె అవకాశం తక్కువగా ఉండనుంది. ఐఫోన్ 13 మోడళ్లలో పోర్ట్రెయిట్ మోడ్ వీడియో ఫీచర్ ఉంటుందని తెలుస్తోంది. ఆపిల్ కొత్త ఐఫోన్ 13 సిరీస్‌ను సెప్టెంబర్‌లో ఆవిష్కరిస్తోందని టెక్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఫోన్ 13 వస్తోన్న నేపథ్యంలో..ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 12 బేసిక్ మోడల్‌పై సుమారు రూ. 9000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ మోడళ్లపై భారీ తగ్గింపును ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ నుంచి పొందవచ్చును. భవిష్యత్తులో ఐఫోన్ 12 మోడళ్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. -
నెట్టింట రచ్చ చేస్తున్న పవన్ ‘హరిహర వీరమల్లు’ మేకింగ్ వీడియో
స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏ చిన్న వార్త అయినా అది వైరల్ అయిపోతుంది. ఈ మధ్య మేకింగ్ సమయంలో ఏదో ఓ సన్నివేశం, ఫోటోలాంటివి లీక్ కావడం మామూలుగా మారింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఓ వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. గతంలోనూ ‘వకీల్ సాబ్’ చిత్రం మేకింగ్ సమయంలో ఓ ఫోటో ఇలానే బయటకు రాగా, అప్పట్లో అది వైరల్‌గా మారడమే గాక చిత్ర బృందం దాన్నే టైటిల్ లోగోలో పెట్టేయడం విశేషం. చాలా కాలం తర్వాత పవన్ ‘వకీల్ సాబ్’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో అభిమానులకు ముందుకు వచ్చి ట్రీట్ ఇచ్చాడనే చెప్పాలి. కాగా ఇప్పుడు పవర్ స్టార్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఒక వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా పవర్ స్టార్ ఇలాంటి పాత్రల్లో నటించడం ఇదే మొదటి సారి కావడంతో ఈ సినిమాపై అంచానాలు ఇప్పటికే ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక అభిమానులైతే వాళ్ల హీరోని సరికొత్తగా చూడబోతున్నామని సినిమా విడుదల తేది కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ వీడియో లీక్ పవన్ ఫ్యాన్స్‌కి జోష్నిచ్చిందనే చెప్పాలి. ఈ వీడియోలో.. మల్ల యోధులు సై అంటుంటే.. ఎదురుగా పవన్ నిలబడి ఉంటాడు. ఇక వారి చుట్టూ ఉన్న మనుషులు కిందికి వంగి కాళ్ల మీద కూర్చన్నారు. చూస్తుంటే ఈ వీడియో సినిమాలో కీలకమైన పోరాట దృశ్యానికి సంబంధించిందిగా అనిపిస్తోంది. HariHaraVeeraMallu leaked video of Power star @PawanKalyan #HariHaraVeeraMallu #PSPK27 #PSPK28 #VakeelSaab #PSPKRanaMovie pic.twitter.com/fmKbQB6pDd— Niteesh Royal (@niteesh_royal) June 27, 2021 చదవండి: ఎక్కడా తగ్గేదే లే.. ‘రాధేశ్యామ్’ను వెనక్కి నెట్టి టాప్‌లో ‘పుష్ప’ -
నగ్న ఫొటోలు, వీడియో: ఆపిల్ కంపెనీకి కోట్ల జరిమానా
కాలిఫోర్నియా: ఓ విద్యార్థిని నగ్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఐ ఫోన్ సంస్థ కొన్ని కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. ఓ విద్యార్థిని తన ఫోన్ రిపేర్‌కు వచ్చిందని సర్వీస్ సెంటర్‌కు ఇచ్చింది. అయితే ఫోన్ రిపేర్‌లో ఉన్నప్పుడే ఆమెకు సంబంధించిన నగ్న ఫొటోలు, వీడియోలు ఫేస్బుక్లో పోస్టు చేసి ఉన్నాయి. వీటిని చూసి షాక్‌కు గురయిన ఆ యువతి ఐఫోన్ కంపెనీపై పోరాటం చేసింది. తత్ఫలితం ఆపిల్ కంపెనీ కొన్ని కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2016లో కాలిఫోర్నియాలోని ఒరెగాన్కు చెందిన ఓ విశ్వవిద్యాలయ విద్యార్థిని తన ఫోన్ రిపేర్‌కు రావడంతో సమీపంలోని పెగాట్రాన్ సంస్థ నిర్వహిస్తున్న సర్వీస్ సెంటర్‌కు వెళ్లింది. తన ఫోన్ బాగు చేయమని సర్వీస్ సెంటర్లో ఫోన్ ఇచ్చి వచ్చింది. కొన్నాళ్లకు ఫోన్లోని నగ్న ఫొటోలు, వీడియోలు ఆమె ఫేసుబుక్‌లో కనిపించాయని ఆమె స్నేహితులు చెప్పారు. దీంతో ఆ విద్యార్థిని షాక్‌కు గురై వెంటనే తన ఫేస్బుక్లో నుంచి ఆ ఫొటోలు, వీడియోలను తొలగించారు. అనంతరం సర్వీస్ సెంటర్‌కు వెళ్లి నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయికి సంబంధించిన అంశం కావడంతో సంస్థ సున్నితంగా ఈ కేసును డీల్ చేసింది. అమ్మాయి పరువుకు సంబంధించిన విషయం కావడంతో వివరాలు బయటకు పొక్కకుండా చర్యలు చేపట్టింది. ఆమె ఫిర్యాదుతో విచారణ చేపట్టగా మరమ్మతులు చేసే ఇద్దరు టెక్నీషియన్లు ఆ ఫొటోలు, వీడియోలను ఫేస్బుక్లో పోస్టు చేసినట్లు తేలింది. దీంతో ఆ ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. తమ తప్పిదం జరగడంతో ఐఫోన్ రహాస్య ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. సామరస్యంగా మాట్లాడుకుని 5 మిలియన్ డాలర్లు పరిహారంగా ఇచ్చేందుకు ఐఫోన్ ప్రతినిధులు అంగీకరించారు. ఈ విషయాలు రహాస్యంగా ఉంచారు. కానీ టెలిగ్రాఫ్ బహిర్గతం చేసింది. ‘వినియోగదారుడు మానసిక క్షోభ అనుభవించారు’ అని భావించి ఐఫోన్ అంత భారీ మొత్తంలో పరిహారం అందించినట్లు తెలుస్తోంది. సంస్థకు చెడ్డపేరు రాకుండా ఈ విధంగా రహాస్య ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. ఈ పరిహారం త్వరలోనే ఆమెకు అందించనున్నారు. -
తప్పిన ప్రమాదం: ఆక్సిజన్ ట్యాంకర్ లీక్
రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్లో ఆగిఉన్న గూడ్సు వ్యాగన్‌లోని ఓ ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీక్ అయింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది అతికష్టం మీద ఆక్సిజన్ లీకేజీని అదుపుచేశారు. రౌర్కెలా నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న గూడ్సు స్థానిక రైల్వేస్టేషన్‌కి చేరుకోగానే సిగ్నల్స్ ఇవ్వకపోవడంతో అక్కడే కాసేపు దానిని నిలపాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి వాయువు బయటకు వచ్చినట్లు అక్కడి వారు గుర్తించారు. -
‘పుష్ప’టీమ్‌కు షాక్.. రెండు సీన్లు లీక్
ఒక భారీ సినిమా తెరకెక్కుతున్నప్పుడు ఎలాంటి సన్నివేశాలు లీకవకుండా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటుంది చిత్ర యూనిట్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరో ఒకరు సన్నివేశాలను రహస్యంగా ఫోన్ కెమెరాలో షూట్ చేసి లీక్ చేసేస్తుంటారు. ఇప్పుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’కు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ సినిమా నుంచి తాజాగా రెండు సన్నివేశాలు లీకయ్యాయి. అందులో ఒకటి బన్నీ, రష్మికల మధ్య వచ్చే మెలోడీ సాంగ్, మరొకటి పోలీసులకు, అల్లు అర్జున్‌లకు మధ్య జరిగే ఫైట్ సీన్. ఈ రెండు సీన్లకు సంబంధించిన క్లిప్పింగులుచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెట్స్ పైకొచ్చిన మొదటి రోజు నుంచి ఈ సినిమా లీకుల బారిన పడుతూనే ఉంది. తాజాగా ఇలా ఒకేసారి రెండు సీన్లు లీక్ అవ్వడం యూనిట్ కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. కాగా, పుష్ప సినిమాను ఔట్ డోర్ లో షూట్ చేస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా బన్నీ కనిపించనున్నాడు. షూటింగ్ కోసం వచ్చిన జనాల్లో ఎవరో ఒకరు తమ మొబైల్ లో వీడియో తీసి వైరల్ చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఆగస్టు 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
హ్యాక్ అయ్యాయి
ఇటీవల కమల్‌హాసన్ కూతురు అక్షరా హాసన్‌కు సంబంధించిన కొన్ని వ్యక్తిగత ఫొటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కథానాయిక హన్సిక వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల ఆమె న్యూయార్క్ హాలిడేకి వెళ్లినప్పటి ఫొటోలు అవని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిలో హన్సిక బికినీ ధరించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ విషయం గురించి హన్సిక స్పందిస్తూ – ‘‘నా ఫోన్, ట్వీటర్ అకౌంట్ హ్యాక్ అయ్యాయి. వాటి నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దు. కంట్రోల్ చేయడానికి మా టీమ్ వర్క్ చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. సో... హ్యాక్ చేసినవాళ్లే హన్సిక ఫొటోలు బయట పెట్టి ఉంటారనుకోవాలేమో. ఇక ఆమె సినిమాల ప్రస్తావనకు వస్తే... తమిళంలో ‘100’ అనే పోలీస్ థ్రిల్లర్ చేశారు. ఈ చిత్రం రిలీజ్‌కి రెడీగా ఉంది. ప్రస్తుతం ‘మహా’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో సందీప్ కిషన్ సరసన ఓ సినిమాకి కమిట్ అయ్యారు హన్సిక. -
లీకైన స్టార్ హీరో సాంగ్ క్లిప్
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను లీకులు ఇబ్బంది పెడుతున్నాయి. గీత గోవిందం సినిమా వార్తలు మరువక ముందే మరో భారీ చిత్రానికి సంబంధించిన సీన్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో ఇంట్రో సాంగ్‌కు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా లాస్ వేగాస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీగా వేగాస్ వీదుల్లో విజయ్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. శోభి మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తున్న ఈ పాటలో విజయ్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆ క్లిప్ వైరల్ అయ్యింది. సన్ పిక్చర్స్ సంస్థభారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా దీపాకళికి రిలీజ్ కానుంది. చదవండి : సోషల్ మీడియాలో లీకైన గీత గోవిందం సీన్స్ ‘గీత గోవిందం’ సినిమా లీక్‌పై విజయ్ స్పందన! తెలిసి చేసినా తెలియక చేసినా నేరమే పైరసీ కోరల్లో భారీ చిత్రం : అల్లు అరవింద్ -
సినిమాటోగ్రాఫర్ అత్యుత్సాహం
సినిమాటోగ్రఫర్ అత్యుత్సాహం కొంప ముంచింది. హాలీవుడ్లో మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న అవెంజర్స్ చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అవెంజర్స్ సిరీస్‌లో భాగంగా ఇన్ఫినిటీ వార్ రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీని సీక్వెల్ వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్ర సినిమాటోగ్రఫర్ ‘ట్రెంట్ ఓపలోచ్’ అత్యుత్సహంతో టైటిల్‌ను రివీల్ చేసేశాడు. సోషల్ మీడియాలో ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ అంటూ అవెంజర్స్ లిస్ట్‌తో కూడిన మొత్తం జాబితాను ఉంచాడు. దీంతో ఇంటర్నెట్లో టైటిల్‌పై చర్చ మొదలైంది. అయితే కాసేటికే ఆ పేరును తొలగించి.. దాని స్థానంలో అవెంజర్స్-4 అనే టైటిల్‌ను చేర్చటం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ చిత్ర టైటిల్ విషయంలో ఇప్పటిదాకా ఏ నిర్ణయం తీసుకోలేదని దర్శకులు రుస్సో బ్రదర్స్ గతంలో ప్రకటించారు. కాగా, ఇన్ఫినిటీ స్టోన్స్ చేజిక్కించుకున్న థానోస్ చేతిలో అవెంజర్ హీరోలతోసహా సగం విశ్వం అంతం కావటంతో ఇన్ఫినిటీ వార్ చిత్రం ముగుస్తుంది. సీక్వెల్ వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. -
రజనీ సినిమాకు షాక్ : లీకైన 2.ఓ టీజర్
గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 2.ఓ. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్ అధికారికంగా విడుదల కాకముందే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విదేశాల్లో ప్రదర్శించిన సమయంలో ఎవరో మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ లీక్ పై స్పందించిన చిత్రయూనిట్ తాము టీజర్ అధికారికంగా రిలీజ్ చేయలేదని ప్రకటించారు. ఘనవిజయం సాధించిన రోబో సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న 2.ఓను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నెగెటివ్ రోల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపైద దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ టీజర్ లో రజనీతో పాటు అమీజాక్సన్, అక్షయ్‌కుమార్ లు కూడా కనిపించారు. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాక ముందే ఈ టీజర్ బయటకు వచ్చేయటంతో చిత్రయూనిట్ తలలు పట్టుకున్నారు. -
రెడ్ మి నోట్ 5 ఫీచర్లు లీక్
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో భారత్‌లో రారాజుగా దూసుకుపోతున్న షావోమి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో పాపులర్ రెడ్మి నోట్ 4కు కొనసాగింపుగా తీసుకొస్తున్న అప్ కమింగ్ డివైస్ రెడ్ మి నోట్ 5 ఫీచర్స్ , ఇమేజ్ తదితర సమాచారం లీకైంది. బెజెల్ లెస్ డిజైన్‌తో , డిస్ప్లే సైజ్, షేప్‌లో భారీ మార్పులతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుందని చైనా మీడియా తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే MIUI ఆధారంగా పనిచేసినా.. ఆండ్రాయిడ్7.1.2 ఆధారితం. అలాగే డబుల్ కెమెరాలతో లాంచ్‌కానుందని ఇటీవలి అంచనాలు వెలువడినా షావోమి అధికారిక ప్రకటన తరువాత మాత్రమే కెమెరాలకు సంబంధించిన వివరాలు భ్యం కానున్నాయి. రెడ్ మి నోట్ 5 ఫీచర్లు 5.99 ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1.2 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4000 ఎంఏహెచ్‌బ్యాటరీ -
లీకైన జై లవ కుశ స్టిల్స్
భారీ చిత్రాలకు లీకుల బెడద తప్పటం లేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జై లవ కుశ కూడా లీకు వీరుల బారిన పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కు సంబంధించినవిగా తెలుస్తున్నాయి. రావణ దహనం బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ పై తెరకెక్కించిన ఫైట్ సీన్ కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ స్టిల్స్ కువైట్ నుంచి లీక్ అయినట్టుగా భావిస్తున్నారు. ఈ సినిమాకు ఆన్ లైన్ ఎడిటర్ పనిచేస్తున్న గణేష్ అనే వ్యక్తి లీక్ చేశాడని అనుమానిస్తున్నారు. గణేష్ తన ఫ్రెండ్స్ ద్వారా కువైట్ నుంచి ఈ ఫోటోలు పోస్ట్ చేయించాడు. ఇప్పటికే చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేశారు.కేవలం స్టిల్స్ మాత్రమే లీక్ అయ్యాయా.. లేక సీన్స్ కూడా ఏమైన లీక్ అయ్యాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వాట్సాప్‌లో టెన్త్ ఇంగ్లిష్ పేపర్
♦ వరంగల్‌లో లీక్.. ఖమ్మంలో ప్రత్యక్షం ♦ పోలీసులకు విద్యాశాఖ అధికారుల ఫిర్యాదు ఖమ్మం జెడ్పీసెంటర్: పదో తరగతి ఇంగ్లిష్ పశ్నపత్రం లీకేజీ ఖమ్మంలోని పలువురి వాట్సాప్‌లో వైరల్ అయ్యింది. పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష పేపర్–1 మంగళవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత వాట్సాప్‌లలో ప్రశ్నపత్రాలు దర్శనమిచ్చాయి. అన్ని వాట్సాప్‌లలో ప్రశ్నలు కనిపించడంతో లీకేజీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న విద్యాధికారులు వెంటనే ఎంఈవోలు, చీఫ్ సూపరింటెండెంట్లను అప్రమత్తం చేశారు. ప్రశ్నపత్రం లీకైందనే వార్తలతో ఖమ్మం జిల్లా పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఏసీపీ గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు డీఈవో కార్యాలయానికి వచ్చి విద్యాశాఖాధికారిణి విజయలక్ష్మీబాయి, వరంగల్ ఆర్జేడీ బాలయ్యతో సంప్రదింపులు జరిపారు. ఉదయం 9.30 గంటలకే పరీక్ష ప్రారంభమైందని, 11.30 గంటలకు పరీక్ష పూర్తయి ఉంటుందా? లేక విద్యార్థి పరీక్ష రాసి వస్తే అతడి ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో పెట్టారా? లేదా నిజంగా లీక్ అయిందా? అనే విషయం విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ మీడియాలో వచ్చిన కథనాలపై డీఈవో విజయలక్ష్మీబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మంలో పరీక్షలు భారీ బందోబస్తు మధ్య పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, అయితే ఓ చానల్లో 12.15 గంటలకు ప్రశ్నపత్రం లీక్ అయిం దని కథనాలు ప్రసారమయ్యాయని, దీని ఆధారంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. వాట్సాప్‌లో వచ్చిన పేపర్ ఆధారంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో చర్చించి.. అసలు వ్యవహా రాన్ని రాబట్టారు. చివరకు ప్రశ్నపత్రాన్ని వరంగల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ వాట్సాప్‌లో పెట్టినట్లు వెల్లడైంది. అయితే జిల్లాలో పదో తర గతి పరీక్షల ప్రారంభం నుంచి పేపర్ లీక్ అవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు పలు స్కూళ్ల యాజమాన్యాల మ«ధ్య అంతర్గత పోరు నేపథ్యంలో ప్రచారం ఎక్కువైంది. ఏదేమైనా ఇక్కడ ప్రశ్నపత్రం లీక్ కాలేదని వెల్లడి కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఊపీరి పీల్చుకున్నారు. -
మోటో కొత్త ఫోన్లు లీక్.. ఫీచర్లివేనట!
లెనోవో మిడ్ రేంజ్లో తీసుకొస్తున్న మోటో జీ5, జీ5 ప్లస్ స్మార్ట్ఫోన్లు లాంచింగ్‌కు ముందే లీకైపోయాయి. ఫిబ్రవరి 26న బార్సిలోనాలో జరుగబోయే ఎండబ్ల్యూసీ 2017 ఈవెంట్లో వీటిని కంపెనీ అధికారికంగా లాంచ్ చేసేందుకు రంగం చేసుకుంది. కానీ అధికారికంగా లాంచింగ్‌కు ముందే వీటిని స్పానిస్ ఆన్ లైన్ రిటైలర్ తన సైట్ లో లిస్టుచేసేసింది. స్పెషిఫికేషన్స్, ఫీచర్లు, ఇతర వివరాలన్నింటిన్నీ ఈ రిటైలర్ లిస్టు చేసింది. మోటో జీ5, జీ5 ప్లస్ డిజైన్... మార్కెట్లోకి ఇక ఎంట్రీ ఇవ్వబోతున్న మోటో జీ5, జీ5 ప్లస్‌లు స్పోర్ట్ మెటల్ బాడీస్‌తో రాబోతున్నాయట. సైడ్ ప్యానెల్స్ విషయంలో లెనోవో బ్రాండింగ్ లో ఈ ఫోన్ మన ముందుకు వస్తోందని తెలుస్తోంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్రంట్ ప్యానెల్ లో ఉండబోతుందట. ప్రైమరీ కెమెరా వెనుకవైపు సర్క్యూలర్ డిజైన్ లో ఉంటుంది. మోటో ''ఎం'' లోగో కూడా వెనుకవైపే ఉంది. మోటో జీ5 స్పెషిఫికేషన్స్... 5 అంగుళాల ఫుడ్-హెచ్డీ డిస్ ప్లే, 32జీబీ బోర్డు స్టోరేజ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 1.4గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 ఎస్ఓసీ, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్టును కలిగి ఉంటుంది. మోటో జీ5 ప్లస్ స్పెషిఫికేషన్స్... 5.2 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ ప్లే, 64జీబీ స్టోరేజ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 ఎంపీ కెమెరా విత్ డ్యూయల్ ఆటోఫోకస్ ఫీచర్, 2 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ, 4జీ ఎల్టీఈ, 155 గ్రాముల బరువు ఇవీ మోటో జీ5 ప్లస్ ప్రత్యేకతలు. రెండు ఫోన్లకు ఉండబోయే సిమిలర్ ఫీచర్స్.. ఫుల్-హెచ్డీ స్క్రీన్ రెజుల్యూషన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కవర్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ 128జీబీ వరకు ఎక్స్ పాండబుల్ మెమరీ 2జీబీ ర్యామ్ 5ఎంపీ ఫ్రంట్ కెమెరా వాటర్ రిపేలెంట్ కోటింగ్ -
లాంచింగ్‌కు ముందే ఆ ఫోన్లు లీకైపోయాయ్!
కొత్త ఏడాదిలో గెలాక్సీ కొత్త సిరీస్ ఫోన్లతో మన ముందుకు రాబోతుంది స్మార్ట్ ఫోన్ల దిగ్గజం శాంసంగ్. జనవరి 5వ తేదీన గెలాక్సీ ఏ(2017) సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్లాన్స్ చేసింది. కౌలాలంపూర్‌లో జరిగే ఈ ఈవెంట్‌కు మీడియా ప్రతినిధులకు కూడా ఆహ్వానాలు పంపేసింది. అయితే గ్రాండ్‌గా రిలీజ్ చేద్దామనుకున్న ఈ గెలాక్సీ ఫోన్ల వివరాలు విడుదలకు ముందే లీకైపోయాయి. గెలాక్సీ ఏ3, గెలాక్సీ ఏ5, గెలాక్సీ ఏ7లలో ఈ మూడు డివైజ్‌లు రాబోతున్నాయని తెలుస్తోంది. ఐపీ68 రేటింగ్‌తో ఈ మూడు డివైజ్‌లను పెట్టనున్నట్టు సమాచారం. వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌ను ఇవి కలిగి ఉన్నాయట. ఫింగర్ ప్రింట్ స్కానర్స్, ఎన్ఎఫ్సీలతో ఇవి రూపొందాయట. లీకైన గెలాక్సీ ఏ7(2017) ఫీచర్లు... 5.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆక్టా కోర్ ఎక్సినోస్ 7880 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 16 ఎంపీలతో ఫ్రంట్, రియర్ కెమెరా ధర : సుమారు రూ.28,800 లీకైన గెలాక్సీ ఏ5(2017) ఫీచర్లు... 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఆక్టా కోర్ ఎక్సినోస్ 7880 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ దీనికి కూడా 16 మెగాపిక్సెళ్ల ఫ్రంట, రియర్ కెమెరా ధర : సుమారు రూ.25,700 గెలాక్సీ ఏ3(2017) రూమర్లు... 4.7 అంగుళాల హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఆక్టాకోర్ హెక్సినోస్ 7870 ప్రాసెసర్ 2జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్