
రాయ్‌గడ్ రైల్వే స్టేషన్‌లో లీకైన ఆక్సిజన్ ట్యాంకర్
రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్‌లో ఆగిఉన్న గూడ్సు వ్యాగన్‌లోని ఓ ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీక్ అయింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది అతికష్టం మీద ఆక్సిజన్ లీకేజీని అదుపుచేశారు. రౌర్కెలా నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న గూడ్సు స్థానిక రైల్వేస్టేషన్‌కి చేరుకోగానే సిగ్నల్స్ ఇవ్వకపోవడంతో అక్కడే కాసేపు దానిని నిలపాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి వాయువు బయటకు వచ్చినట్లు అక్కడి వారు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment