Raigad
-
వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 16 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖలాపూర్ తహశీల్‌లోని ఇర్షల్వాడి గ్రామంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలతో రాళ్లు, బురద మట్టి గ్రామాన్ని కప్పేశాయని గురువారం ఘటనాస్థలిని సందర్శించిన సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. గ్రామంలో 48 గిరిజన కుటుంబాలకు చెందిన మొత్తం 103 మంది నివసిస్తుండగా కొందరు పాలం పనులకు, వారి పిల్లలు రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లారని తెలిసిందన్నారు. సుమారు 20 అడుగుల మేర పేరుకుపోయిన రాళ్లు, బురదలో 17 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు 16 మృతదేహాలను వెలికితీశారని, మరో 21 మందిని సహాయక సిబ్బంది కాపాడారని చెప్పారు. రోడ్డు సౌకర్యం కూడా లేని ఆ కొండప్రాంతంలో భారీ వర్షం కొనసాగుతున్నందున సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. 2014లో పుణే జిల్లా మాలిన్ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో 50 గిరిజన కుటుంబాలకు చెందిన 153 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఫ్ బృందాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద నుంచి 12 ఇప్పటి వరకు మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మరో 75 మందిని సురక్షింతంగా బయటకు తీశామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ వ్యక్తి సైతం గుండెపోటుతో మరణించినట్లు పేర్కొన్నారు. కాగా కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదే విధంగా క్షతగాత్రుల వైద్య ఖర్చులను మహారాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. #Breaking : An incident of devastating landslide reported at Irshalwadi village in Khalapur tehsil in #Raigad District of #Maharastra,as report says the entire village is victim of the landslide. 4 people have died till now and more than 100 villagers feared trapped . NDRF… pic.twitter.com/8SE5LTnnZD — Rahul Jha (@JhaRahul_Bihar) July 20, 2023 మరోవైపు శివసేన(ఉద్ధవ్ వర్గం) నేత ఆదిత్యా ఠాక్రే ప్రమాద స్థలానికి వెళ్లారు. అక్కడ వద్ద పరిస్థితి హృదయ విదారకంగా ఉందన్నారు. తాము గ్రామస్థులతో మాట్లాడటానికి ప్రయత్నించామని.. కానీ అక్కడికి చేరుకోవడం కష్టంగా ఉందన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అయితే ఘటనా స్థలానికి వెళ్లేందుకు పట్టుబట్టి రాష్ట్ర యంత్రాంగంపై మరింత ఒత్తిడి తీసుకురావాలనుకోవట్లేదని అన్నారు. అలాగే ఈ సమస్యను రాజకీయం చేయకూడదని కూడా అన్నారు. బాధితుల ప్రాణాలు కాపాడటం ముఖ్యమని, ప్రస్తుతానికి రెస్క్యూ కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. खालापूर (जि. रायगड) येथील इरशाळगडाच्या पायथ्याशी असलेल्या वस्तीवर दरड कोसळली आहे. या घटनेची माहिती मिळताच मुख्यमंत्री @mieknathshinde हे तातडीने घटनास्थळी दाखल झाले असून मदत व बचावकार्याचा आढावा घेत आहेत. प्रचंड पाऊस आणि अवघड रस्ता यामुळे बचाव कार्य कार्यात अडथळा येत असला तरी… pic.twitter.com/ipXze5yOZu — CMO Maharashtra (@CMOMaharashtra) July 20, 2023 కొండచరియలు విరిగిపడిన మృతులకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం తెలిపారు. ఈ సంఘటన గురించి సమాచారం అందినప్పటి నుంచి స్థానిక ధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని.. మరో రెండు బృందాలు త్వరలో చేరుకుంటాయని చెప్పారు. భారీ వర్షాలు, చీకటి కారణంగా మొదట్లో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని, అయితే ఇప్పుడు వేగం పుంజుకుందని ఆయన అన్నారు. #रायगड जिल्ह्यातील #खालापूर जवळील #इर्शाळवाडी येथे दरड कोसळून झालेल्या दुर्घटनेतील मदतकार्याला वेग देण्यासाठी मी स्वतः घटनास्थळी चालत जाण्याचा निर्णय घेतला आहे. मी स्थानिक नागरिकांना केलेल्या आवाहनाला प्रतिसाद देऊन #एनडीआरएफ पथकाच्या मार्गदर्शनाखाली मदतकार्याला वेग देण्यासाठी… pic.twitter.com/4AUCXf8gIU — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) July 20, 2023 -
అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన
సాక్షి, ముంబై: రాయ్‌గఢ్ జిల్లాలోని హరిహరేశ్వర్ బీచ్‌కు కొట్టుకొచ్చిన అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. బోటు వ్యవహారంలో ఉగ్రవాద కోణం లేదని చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే పడవలో మందుగుండు సామాగ్రీ ఎందుకు ఉన్నాయో ఇప్పుడే చెప్పలేమన్న డిప్యూటీ సీఎం.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగుతోందన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. కొట్టుకొచ్చిన బోటు ఆస్రేలియాకు చెందిన హాన్ అనే మహిళదని తెలిపారు. తన భర్త జేమ్స్ హర్బర్ట్‌తో కలిసి మస్కట్ మీదుగా యూరప్ వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. జూన్ 26న ఇంజిన్ ఫెయిల్ అవ్వడం వల్ల బోటు ప్రమాదానికి లోనైందన్నారు. బోట్లో ఉన్న వారిని కొరియా షిప్ రక్షించిందని పేర్కొన్నారు. చదవండి: రాయ్‌గఢ్‌లో బోటు కలకలం.. మూడు ఏకే 47.. ఇంకా అయితే ధ్వంసమైన పడవ మాత్రం సముద్ర జలాల్లో కలిసిపోయి అలలకు రాయ్‌గఢ్ తీరానికి కొట్టుకు వచ్చిందన్నారు. అయినప్పటికీ ఫెస్టివల్ సీజన్ కావడంతో ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం స్థానిక పోలీసులు, యాంటీ టెర్రర్ స్క్వాడ్లు కేసు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలు జరుపుకునే దహీ హండీ, వినాయకచవితి పండుగలకు పటిష్ట భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా హరిహరేశ్వర తీరం వద్దకు గురువారం ఓ అనుమానాస్పద బోటు కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే. బోటులో మూడు ఏకే 47 రైఫిళ్లు, తూటాలు, మరికొన్ని ఆయుధాలు ఉన్నాయి. దీంతో ఉగ్రవాదుల కట్రమోనని భావించిన అధికారులు, పోలీసులు రాయ్‌గఢ్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. -
మహారాష్ట్రలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర
-
Maharashtra: రాయ్‌గఢ్‌లో టెర్రర్ బోట్ కలకలం.. మూడు ఏకే 47.. ఇంకా
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. రాయ్‌గఢ్‌లోని హరిహరేశ్వర్ బీచ్‌లో టెర్రర్ బోట్ కలకలం సృష్టిస్తోంది. ముంబైకి 190 కి.మీ దూరంలోనున్న బీచ్ వద్ద స్థానికులు బోటును గుర్తించారు. అందులో ఎలాంటి సిబ్బంది లేకపోవడంతో భద్రతా ఏజన్సీలను అప్రమత్తం చేశారు. బోట్లలో మూడు ఏకే 47, బుల్లెట్లు, అమ్మోనియం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై తరహా దాడులకు కుట్ర చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయ్‌గఢ్ వ్యాప్తంగా పోలీసులు భద్రతకు కట్టుదిట్టం చేశారు.హై అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ దళం కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. పడవ ఎక్కడి నుంచి వచ్చింది? అందులోని ఆయుధాలు ఎవరు పంపారు? పడవలో ఎవరైనా వచ్చారా?. నే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా అనుమానస్పద బోటు ఘటనపై ప్రత్యేక విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరినట్లు రాయ్‌గఢ్ ఎమ్మెల్యే అదితి తట్కరే తెలిపారు. గణేష్ చవితి సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన వెలుగుచూడటం భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. చదవండి: కేంద్రం సీరియస్.. యూట్యూబ్ ఛానల్స్‌పై నిషేధం -
ప్రేయసి ముందు అనుమానం గెలిచి.. స్నేహం ఓడింది
రాయగడ: అలల ప్రయాణం తీరం చేరేవరకు మాత్రమే. కలల ప్రయాణం మెలకువ వచ్చేంత వరకే. కానీ స్నేహ ప్రయాణం ప్రాణమున్నంత వరకు అన్న వ్యాఖ్యలకు అర్థం మార్చేశాడో ప్రబుద్ధుడు. అనుమానం పెనుభూతమై ప్రియురాలి కోసం స్నేహితుడిని దారుణ హత్య చేసి.. మృతదేహాన్ని ఇసుక కుప్పలో దాచిన ఓ నిందితుడి ఉదంతం సోమవారం వెలుగుచూసింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. కలహండి జిల్లాలోని టిట్లాఘడ్ గ్రామానికి చెందిన రామన్ బబర్తీ, దేబన్పొడ గ్రామానికి చెందిన ఉమాకాంత కండొ (25) ప్రాణ స్నేహితులు. రామన్ ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అయితే స్నేహితుడైన ఉమాకాంత కండొతో రామన్ ప్రియురాలు చనువుగా ప్రవర్తించడంతో తట్టుకోలేకపోయిన రామన్ స్నేహితుడిని హత్య చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో రాయగడలో ఉన్న సోదరి ఇంటికి వచ్చి అక్కడి స్నేహితులైన ప్రశాంత్ బబర్తీ, ప్రకాష్ బటొలకు విషయం తెలియజేశాడు. వారంతా కలిసి పథకం ప్రకారం గత నెల 4 వ తేదీన ఉమాకాంతను రాయగడలో విందు భోజనానికి ఆహ్వానించారు. ఇసుక కుప్పలో మృతదేహం ఆహ్వానం మేరకు రాయగడ వచ్చిన ఉమాకాంతను రామన్, స్నేహితులు జిల్లాలోని కల్యాణసింగుపూర్ ప్రాంతంలోని చెక్ డ్యామ్‌కు తీసుకువెళ్లారు. పథకం ప్రకారం ఉమాకాంతతో ఎక్కువ మద్యం తాగించి గొంతునులిమి హత్య చేశారు. అనంతరం ఉమాకాంత మృతదేహాన్ని డ్యామ్ సమీపంలో ఇసుక కుప్పవద్ద పాతిపెట్టి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే మే 4 వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన ఉమాకాంత ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు టిట్లాఘడ్ పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉమాకాంత స్నేహితుడైన రామన్ బబర్తీ ఫోన్‌ను ట్రాక్ చేయడంతో విషయం బయటపడింది. రామన్ బబర్తీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఉమాకాంతను హత్య చేసిన సంగతి అంగీకరించాడు. ఈ సమాచారం మేరకు చెక్‌డ్యామ్ వద్ద పాతిపెట్టిన మృతదేహాన్ని మేరకు కల్యాణసింగుపురం పోలీసుల సహాయంతో టిట్లాఘడ్ పోలీసులు వెలికితీశారు. అనంతరం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. -
తప్పిన ప్రమాదం: ఆక్సిజన్ ట్యాంకర్ లీక్
రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్లో ఆగిఉన్న గూడ్సు వ్యాగన్‌లోని ఓ ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీక్ అయింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది అతికష్టం మీద ఆక్సిజన్ లీకేజీని అదుపుచేశారు. రౌర్కెలా నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న గూడ్సు స్థానిక రైల్వేస్టేషన్‌కి చేరుకోగానే సిగ్నల్స్ ఇవ్వకపోవడంతో అక్కడే కాసేపు దానిని నిలపాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి వాయువు బయటకు వచ్చినట్లు అక్కడి వారు గుర్తించారు. -
మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహద్ తాలుకా కేంద్రంలోని కాజల్‌పూరలో ఐదంతస్తుల అపార్ట్మెంట్ భవనం సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద దాదాపు 51 మంది చిక్కుకొని ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. రాత్రి 10 గంటల సమయంలో ఒక మృతదేహాన్ని వెలికితీశారు. ప్రాణనష్టం భారీగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మొత్తం 45 ఫ్లాట్లు ఉన్న తారేక్ గార్డెన్ అపార్ట్మెంటు కుప్పకూలి పెద్ద ఎత్తున దుమ్ము పైకిలేచిన దృశ్యాలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఏడుగురిని శిథిలాల కింది నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారి ఒకరు తెలిపారు. 10 ఏళ్ల కిందట నిర్మించిన ఈ అపార్ట్మెంటులో నివసించే వారిలో సగం మంది ప్రమాద సమయంలో వివిధ పనులపై బయటే ఉన్నట్లు తెలుస్తోంది. భవనం కూలుతున్న క్రమంలో దాదాపు 70 మంది బయటకు పరుగెత్తి ప్రాణాలను దక్కించుకున్నారని రాయ్‌గఢ్ కలెక్టర్ నిధి చౌదరి తెలిపారు. ఈ అపార్ట్మెం టులో నివసించే మరికొన్ని కుటుంబాలు కోవిడ్ కారణంగా స్వస్థలాలకు వెళ్లాయని ఆమె వెల్లడిం చారు. మొత్తం 51 మంది ఆచూకీ తెలియడం లేదన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి బయలుదేరాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. -
భయానక వీడియోలు.. ‘నిసర్గ’ విలయం
ముంబై: కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న ముంబైని నిసర్గ తుపాను మరింత భయపెట్టింది. ఆలీబాగ్ వద్ద బుధవారం మధ్యాహ్నం తీరాన్ని తాకింది. ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. దాంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. ముఖ్యంగా రాయ్‌గడ్ జిల్లాలో బలమైన గాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఓ చోట గాలుల తాకిడికి ఇంటి పై కప్పు ఎగిరి.. మరో ఇంటి మీద పడింది. చెట్లు విరిగి కార్ల మీద పడ్డాయి. ఎన్డీఆర్ఎఫ్ డీజీ సత్య నారాయణ్ ప్రధాన్ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. #CycloneNisarga makes landfall, visuals from Raigad District of Maharashtra (Video courtesy: Satya Pradhan(@satyaprad1), NDRF DG/Twitter) For more, follow: https://t.co/rmvEa6PjeJ#CycloneNisarga #CycloneNisargaUpdate pic.twitter.com/vYd6W6EwDm — Jagran English (@JagranEnglish) June 3, 2020 ప్రధాన్ రాయ్‌గఢ్ జిల్లాలోని పెన్ ప్రాంతానికి చెందినవారు. మరో వీడియో మంగోన్లోని ధాన్యం గోడౌన్ వద్ద జరిగిన నష్టాన్ని చూపిస్తుంది. హింసాత్మక గాలులు ఈ ప్రాంతాన్ని తాకడంతో ధాన్యం గోడౌన్ పైకప్పు పూర్తిగా ఎగిరి కిందపడింది. #CycloneNisargaUpdate DAY 0-3rd June 2020,1500 hrs#CycloneNisarga landed Visuals few minutes ago from Grain Godown,Mangaon,Raigad Video13@NDRFHQ @ndmaindia @PMOIndia @HMOIndia @BhallaAjay26 @PIBHomeAffairs @ANI @PTI_News @DDNewslive @DDNewsHindi @DisasterState pic.twitter.com/8WH1fBKfBP — ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) June 3, 2020 పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌లను నాశనం చేసిన నింపన్ తుపానుతో పోల్చుకుంటే నిసర్గ తుపాను వల్ల జరిగిన నష్టం తక్కువనే అంటున్నారు అధికారులు. -
స్కిడ్ అయిన సీఎం హెలికాఫ్టర్
రాయ్‌గడ్ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో స్కిడ్ అయింది. ఈ ఘటన రాయ్‌గడ్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. రాయ్‌గడ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఫడ్నవీస్ హెలికాఫ్టర్‌లో వచ్చారు. అయితే, హెలిప్యాడ్ వద్ద నేల తడిగా ఉండటంతో పైలట్ నియంత్రణ కోల్పోయాడు. వెంటనే తేరుకుని కొద్ది సెకన్లలోనే హెలికాఫ్టర్ క్షేమంగా ల్యాండ్ అయ్యేలా చేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హెలికాఫ్టర్‌లో సీఎం ఫడ్నవీస్‌తో పాటు ఆయన పర్సనల్ అసిస్టెంట్, ఒక ఇంజనీర్, పైలట్, కో-పైలట్లు ఉన్నారు. నేల తడిగా ఉండటంతోనే ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు. సీఎంతో పాటు మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నట్టు జిల్లా ఎస్పీ అనిల్ పరాస్కర్ తెలిపారు. కాగా, గతంలో ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లాథూర్‌లో క్రాష్ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి సీఎం క్షేమంగా బయటపడ్డారు. -
నడిరోడ్డుపై మహిళ ప్రసవం
రాయగడ(ఒడిశా): పేదల వైద్యానికి రూ.వేల కోట్లు మంజూరు చేస్తూ ఆదుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వం ప్రతి ఆస్పత్రిలో గర్భిణుల ప్రసవానికి అందుబాటులో అంబులెన్సులను ఏర్పాటు చేయలేకపోతోంది. అంబులెన్సులను ప్రైవేట్ సంస్థ ద్వారా నిర్వహించడం వల్ల వైద్యాధికారుల ఆధీనంలో ఈ సేవలు ప్రజలకు సక్రమంగా అందడం లేదు. ఫలితంగా పేదప్రజలు అత్యవసర సమాయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒడిశాలోని రాయగడ జిల్లాలోని శిఖరపాయి గ్రామ పంచాయతీలో ఓ మహిళ నడిరోడ్డుపై శుక్రవారం ప్రసవించింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కల్యాణ సింగుపురం సమితిలో శిఖరపాయి గ్రామ పంచాయతీ ఉపొరొసజి గ్రామానికి చెందిన రమేష్ భార్య లిసిక నిండు గర్భిణి. అర్ధరాత్రి దాటిన తరువాత ఆమెకు పురిటినొప్పులు ఎక్కువవడంతో శుక్రవారం వేకువజామున 3గంటల నుంచి శిఖరపాయి ఆస్పత్రికి అంబులెన్సు కోసం ఫోన్ చేయగా ఎంతకీ స్పందన లభించలేదు. ఉదయం 10గంటల వరకు అంబులెన్స్ చేరకపోవడంతో నొప్పులు తీవ్రవైన గర్భిణిని బంధువులు తీసుకుని ఉపొరొసజి నుంచి శిఖరపాయికి వస్తుండగా గొడొగాం గ్రామంలో (శిఖరపాయికి 5కిలోమీటర్ల దూరం) ఒక మామిడి చెట్టు కింద ఆమె ప్రసవించింది. ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పిస్తూ వైద్యవిభాగానికి కోట్లాది రూపాయలు మంజురు చేసినప్పటికీ గర్భిణులకు గ్రామీణ ప్రజలకు ఈపథకాలు చేరడం లేదని ఈ ఘటనతో రుజువవుతోంది. -
అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టు
=11 మందిని అరెస్టు చేసిన రాయ్‌గఢ్ పోలీసులు =నిందితుల్లో ఇద్దరు పుణే పోలీసులు =మహారాష్ట్రతో పాటు నగరంలోనూ దోపిడీ =వివరాలు ఆరా తీసున్నాం: ఖోపోలి ఇన్స్పెక్టర్ సాక్షి, సిటీబ్యూరో: ‘చోర్-పోలీసు భాయి భాయి’ ట్రెండ్ నగరంలోనే కాదు... మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లోనూ కొనసాగుతోంది. అక్కడి పోలీసులు అరెస్టు చేసిన ఓ ముఠాలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరి విచారణ నేపథ్యంలోనే ఈ గ్యాంగ్ హైదరాబాద్‌లోనూ నేరం చేసినట్లు వెల్లడించింది. అయితే, పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని ఖోపోలీ పోలీసు ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ శుక్లా ‘సాక్షి’కి తెలిపారు. ముంబై సాంగ్లీలోని అట్మాడీలో సునీల్ కాదమ్ హోల్‌సేల్ బంగారం షాపు నిర్వహిస్తున్నారు. ఇందులోని ఉద్యోగులు మారుతి లోఠే, సచిన్ టక్లే, అమోల్ మోర్ ఈనెల 10న సంస్థకు చెందిన రూ.1.29 కోట్ల విలువైన నగదు, బంగారంతో ముంబై నుంచి బెంగళూకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేలోని ఖోపోలీ వద్ద ఉన్న ఓ ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగినప్పుడు ఇద్దరు వ్యక్తులు పుణే పోలీసులమంటూ వారి వద్దకు వచ్చారు. బాంబు పేలుడు కేసు అనుమానితులంటూ... ఇటీవల జరిగిన ఓ బాంబు పేలుడు కేసులో ఈ ముగ్గురూ అనుమానితులని, అందుకే అరెస్టు చేస్తున్నామ మిగతా ప్రయాణికులకు ఆ ఇద్దరూ చెప్పారు. మారుతి లోఠే, సచిన్ టక్లే, అమోల్మోర్లను సొత్తుతో సహా బస్సులోంచి బయటకు తీసుకొచ్చారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మరో ఐదుగురు వచ్చారు. అంతా కలిసి ముగ్గురినీ ఠాణాకు తరలిస్తున్నామని చెప్పి టవేరా వాహనంలో తీసుకెళ్లారు. లోనావాలాలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి.. దాడి చేసి ఉద్యోగుల వద్ద ఉన్న బంగారంతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న షాపు యజమాని సునీల్ కాదమ్ ఖోపోలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న రాయ్‌గఢ్ ఎస్పీ అంకుష్ షిండే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గ్యాంగ్‌లో ఇద్దరు పోలీసుల సహా పది మంది... నేరం జరిగిన తీరును అధ్యయనం చేసిన పోలీసులు ఆ ముగ్గురు ఉద్యోగులు నగదు, సొత్తుతో ప్రయాణిస్తున్నారనే కచ్చితమైన సమాచారంతోనే దుండగులు విరుచుకుపడ్డారని నిర్థారించుకుని ఆ కోణంలో ఆరా తీశారు. సంస్థకు చెందిన అనేక మంది ఉద్యోగుల్ని, హోల్‌సేల్ వినియోగదారుల్నీ ప్రశ్నించిన అధికారులు చివరకు సాంగ్లీకి చెందిన తులసీరామ్ దాల్వే, సుదర్శన్ జవార్లు ముగ్గురి వద్ద బంగారం ఉన్న సమాచారం దోపిడీ దొంగలకు అందించినట్టు నిర్థారించారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పుణే జిల్లాలోని డెక్కన్, భోసారీ పోలీసుస్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లు అశిష్ పవార్, సంపత్ పార్థీలు ముఠాకు సూత్రధారులుగా తెలిసింది. బుధవారం ఈ నలుగురితో పాటు ముఠాకు చెందిన అమోల్ ఘోద్డే, దీపక్ నర్వాడీ, ప్రకాష్ చవాన్, సునీల్ దాటే, శంకర్ జద్వా, హీరామన్ శాల్ఖేలను అరెస్టు చేశారు. నగరంలో 8 కేజీల వెండి దోపిడీ... ఈ ముఠాను రాయ్‌గఢ్ న్యాయస్థానంలో హాజరుపరిచిన పోలీసులు కోర్టు అనుమతితో గురువారం నుంచి కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ గ్యాంగ్ హైదరాబాద్ సమీపంలోని హైవేపై ఇదే తరహాలో మరో నేరం చేసినట్లు బయటపెట్టింది. ఈ ముఠా అరెస్టు సమాచారం తెలుసుకున్న ‘సాక్షి’ శుక్రవారం ఫోన్లో ఖోపోలీ పోలీసు ఇన్స్పెక్టర్ శుక్లాను సంప్రదించగా... ‘పది మంది నిందితుల్లో ఒకడు ఈ విషయం బయటపెట్టాడు. తన గ్రామానికే చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో 8 కేజీల వెండి దోపిడీ చేసినట్లు బయటపెట్టాడు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాల్సి ఉంది. ఈనెల 27 వరకు నిందితులు మా కస్టడీలోనే ఉంటారు. ప్ర స్తుతం రూ.1.29 కోట్ల విలువైన నగదు, సొత్తు రికవరీపై దృష్టి పెట్టాం. ఇది పూర్తయ్యాక హైదరాబాద్ కేసు వివరాలు సేకరించి, అక్కడి పోలీసులకు సమాచారం ఇస్తాం’ అని అన్నారు.