ముంబై: కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న ముంబైని నిసర్గ తుపాను మరింత భయపెట్టింది. ఆలీబాగ్ వద్ద బుధవారం మధ్యాహ్నం తీరాన్ని తాకింది. ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. దాంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. ముఖ్యంగా రాయ్‌గడ్ జిల్లాలో బలమైన గాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఓ చోట గాలుల తాకిడికి ఇంటి పై కప్పు ఎగిరి.. మరో ఇంటి మీద పడింది. చెట్లు విరిగి కార్ల మీద పడ్డాయి. ఎన్‌డీఆర్ఎఫ్ డీజీ సత్య నారాయణ్ ప్రధాన్ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
#CycloneNisarga makes landfall, visuals from Raigad District of Maharashtra
— Jagran English (@JagranEnglish) June 3, 2020
(Video courtesy: Satya Pradhan(@satyaprad1), NDRF DG/Twitter)
For more, follow: https://t.co/rmvEa6PjeJ#CycloneNisarga #CycloneNisargaUpdate pic.twitter.com/vYd6W6EwDm
ప్రధాన్ రాయ్‌గఢ్ జిల్లాలోని పెన్ ప్రాంతానికి చెందినవారు. మరో వీడియో మంగోన్‌లోని ధాన్యం గోడౌన్ వద్ద జరిగిన నష్టాన్ని చూపిస్తుంది. హింసాత్మక గాలులు ఈ ప్రాంతాన్ని తాకడంతో ధాన్యం గోడౌన్ పైకప్పు పూర్తిగా ఎగిరి కిందపడింది.
#CycloneNisargaUpdate
— ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) June 3, 2020
DAY 0-3rd June 2020,1500 hrs#CycloneNisarga landed
Visuals few minutes ago from Grain Godown,Mangaon,Raigad
Video13@NDRFHQ @ndmaindia @PMOIndia @HMOIndia @BhallaAjay26 @PIBHomeAffairs @ANI @PTI_News @DDNewslive @DDNewsHindi @DisasterState pic.twitter.com/8WH1fBKfBP
పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌లను నాశనం చేసిన నింపన్ తుపానుతో పోల్చుకుంటే నిసర్గ తుపాను వల్ల జరిగిన నష్టం తక్కువనే అంటున్నారు అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment