Cyclone Nisarga
-
28 వేల మందికి సోనూసూద్ సాయం..
ఆయన ‘చేతికి ఎముక లేదు’.. సాటి మనుషుల కష్టాలను అర్థం చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.. అసలు ఆ దాతృత్వ గుణం ముందు ఎవరూ నిలవలేరంటే అతిశయోక్తి కాదు.. ఎందుకంటే కోట్లాది రూపాయలు దానం చేసే మహానుభావులు ఎందరో ఉంటారు.. కానీ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు నేరుగా సాయం అందించే సోనూసూద్ లాంటి వ్యక్తులు కొంతమందే ఉంటారు. లాక్డౌన్ కాలంలో వలస కార్మికుల పట్ల నిజమైన హీరోగా నిలిచిన ఆయన.. తాజాగా తుపాను ప్రభావం నుంచి వేలాది మందిని కాపాడారు. నిసర్గ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దాదాపు 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి ఆహారం పంపిణీ చేసి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. (సోనూసూద్‌పై సీఎం ప్రశంసల జల్లు) ఈ విషయం గురించి సోనూసూద్ పీటీఐతో మాట్లాడుతూ... ‘‘ఈరోజు మనమంతా చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఒకరికొరం అండగా నిలబడి ధైర్యంగా పోరాడాలి. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో నేను, నా బృందం తీర ప్రాంతాల్లోని దాదాపు 28 వేల మందికి ఆహారం అందించాం. వారిని సమీపంలోని స్కూళ్లు, కాలేజీలు తదితర పునరావాస కేంద్రాలకు తరలించాం. వారంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం’’అని చెప్పుకొచ్చారు. అదే విధంగా నిసర్గ కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన 200 మంది అస్సామీ వలస కార్మికులను షెల్టర్ హోంకు తరలించినట్లు వెల్లడించారు. కాగా వలస కార్మికుల తరలింపు విషయంలో చొరవ చూపిన సోనూసూద్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్న సంగతి తెలిసిందే. (సోనూ మనసు బంగారం) ఈ క్రమంలో సోనూసూద్ సాయం పొందిన వారు ఆయనను దేవుడిగా అభివర్ణిస్తున్నారు. ఇక నిసర్గ ప్రమాదం పొంచి ఉన్న తరుణంలోనూ.. ‘‘నిసర్గ కోసం సోనూసూద్ ఎదురుచూస్తున్నాడు. వెంటనే దానిని ఇంటికి పంపేస్తాడు’’ అంటూ నెటిజన్లు ఛలోక్తులు విసరగా.. ‘‘రానివ్వండి.. పంపేస్తాను’’ అంటూ అంతే చమత్కారంగా సోనూసూద్ బదులిచ్చారు. కాగా అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాను (నిసర్గ)గా మారిన సంగతి తెలిసిందే. ముంబైకి వంద కిలోమీటర్ల దూరంలోని అలీబాగ్ వద్ద నిసర్గ తుఫాను బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తీరం దాటే సమయంలో సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే కొన్ని గంటల్లోనే తుపాను ప్రభావం తగ్గిపోవడంతో ముంబై వాసులు ఊపిరిపీల్చుకున్నారు.(ఇక నుంచి అలవాటు చేసుకోండి: హీరో) -
భయానక వీడియోలు.. ‘నిసర్గ’ విలయం
ముంబై: కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న ముంబైని నిసర్గ తుపాను మరింత భయపెట్టింది. ఆలీబాగ్ వద్ద బుధవారం మధ్యాహ్నం తీరాన్ని తాకింది. ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. దాంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. ముఖ్యంగా రాయ్‌గడ్ జిల్లాలో బలమైన గాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఓ చోట గాలుల తాకిడికి ఇంటి పై కప్పు ఎగిరి.. మరో ఇంటి మీద పడింది. చెట్లు విరిగి కార్ల మీద పడ్డాయి. ఎన్డీఆర్ఎఫ్ డీజీ సత్య నారాయణ్ ప్రధాన్ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. #CycloneNisarga makes landfall, visuals from Raigad District of Maharashtra (Video courtesy: Satya Pradhan(@satyaprad1), NDRF DG/Twitter) For more, follow: https://t.co/rmvEa6PjeJ#CycloneNisarga #CycloneNisargaUpdate pic.twitter.com/vYd6W6EwDm — Jagran English (@JagranEnglish) June 3, 2020 ప్రధాన్ రాయ్‌గఢ్ జిల్లాలోని పెన్ ప్రాంతానికి చెందినవారు. మరో వీడియో మంగోన్లోని ధాన్యం గోడౌన్ వద్ద జరిగిన నష్టాన్ని చూపిస్తుంది. హింసాత్మక గాలులు ఈ ప్రాంతాన్ని తాకడంతో ధాన్యం గోడౌన్ పైకప్పు పూర్తిగా ఎగిరి కిందపడింది. #CycloneNisargaUpdate DAY 0-3rd June 2020,1500 hrs#CycloneNisarga landed Visuals few minutes ago from Grain Godown,Mangaon,Raigad Video13@NDRFHQ @ndmaindia @PMOIndia @HMOIndia @BhallaAjay26 @PIBHomeAffairs @ANI @PTI_News @DDNewslive @DDNewsHindi @DisasterState pic.twitter.com/8WH1fBKfBP — ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) June 3, 2020 పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌లను నాశనం చేసిన నింపన్ తుపానుతో పోల్చుకుంటే నిసర్గ తుపాను వల్ల జరిగిన నష్టం తక్కువనే అంటున్నారు అధికారులు. -
నిసర్గ బీభత్సం
-
ముంబైకి తప్పిన ముప్పు
సాక్షి ముంబై/అహ్మదాబాద్: దేశ ఆర్థిక రాజధాని ముంబైకి నిసర్గ తుపాను ముప్పు తప్పింది. ఈ తుపాను బుధవారం మహారాష్ట్రలోని రాయిగఢ్ జిల్లా ఆలీబాగ్ సమీపంలో తీరం దాటిన అనంతరం దిశను మార్చుకుని ఉరణ్, పన్వెల్, పుణే, నాసిక్ మీదుగా ముందుకు వెళ్లిపోయింది. దీంతో ముంబైవాసులతోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆలీబాగ్ సమీపంలో తీరాన్ని తాకే సమయానికి ముంబైలో భారీ వర్షం కురవనప్పటికీ బలమైన ఈదురుగాలులు వీచాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. నిసర్గ తుపాను కారణంగా రాయిగఢ్ జిల్లాతోపాటు రత్నగిరి జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వివిధ గ్రామాల్లో ఇళ్లు, భవనాల పైకప్పులు గాలికి కొట్టుకుపోయా యి. అనేక ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నిసర్గ తుపాను ఇద్దరిని బలితీసుకుంది. బుధవారం రాయిగఢ్ జిల్లాలో ఒకరు, పుణే జిల్లా లో ఒకరు మరణించినట్టు తెలిసింది. మహారాష్ట్రలోని కోస్తా ప్రాంతాలతోపాటు దక్షిణ గుజరాత్లో వేలాది మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిసర్గ ప్రభావంతో గుజరాత్లో ఇప్పటిదాకా పెద్దగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు. 63,700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. బలహీన పడిన తుపాను మహారాష్ట్ర తీర ప్రాంతంలోకి అడుగుపెట్టిన నిసర్గ తుపాను బుధవారం సాయంత్రానికల్లా బలహీనపడిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. ప్రస్తుతం గంటకు 65–75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఈ తుపాను తీవ్రత తగ్గుముఖం పట్టిందని సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో తెలియజేసింది. అర్ధరాత్రికల్లా మరింత బలహీనపడే అవకాశం ఉందని వివరించింది. -
తీరాన్ని తాకిన ‘నిసర్గ’ తుఫాను
-
ఊపిరి పీల్చుకున్న ముంబై
సాక్షి, ముంబై: కరోనా వైరస్ విజృంభణతో అల్లాడుతున్న ముంబై నగరంపై నిసర్గ తుపాను కరుణ చూపింది. భారీ విధ్వంసానికి కారణమవుతుందని భావించిన నిసర్గ తీరందాటే క్రమంలో ముంబై నగరంపై తక్కువ ప్రభావాన్నే చూపింది. గాలి వేగం, వర్షం తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు నిసర్గ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని వెల్లడించారు. ఒకవైపు లాక్డౌన్, మరోవైపు నిసర్గ బారినపడకుండా ప్రభుత్వ హెచ్చరికలతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. బీచ్‌లు, పార్కులు, బహిరంగ ప్రదేశాలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాను (నిసర్గ)గా మారిన సంగతి తెలిసిందే. ముంబైకి వంద కిలోమీటర్ల దూరంలోని అలీబాగ్ వద్ద నిసర్గ తుఫాను బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తీరం దాటే సమయంలో సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే, ఆరు గంటల వ్యవధిలోనే (రాత్రి ఏడు గంటల ప్రాంతంలో) నీరస పడింది. ఇక తుపాను ప్రభావం తగ్గడంతో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేళీల్లో హై అలర్ట్‌లో ఉన్నాయి. (చదవండి: తుపానుల వలయంలో ముంబై) -
తుపానుల వలయంలో ముంబై
సాక్షి, న్యూఢిల్లీ : మరోసారి మహారాష్ట్రలోని ముంబై నగరానికి ‘నిసర్గ’ రూపంలో తుపాను వచ్చి పడింది. సముద్ర తీరమంతా అల్లకల్లోలంగా మారింది. వంద కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు చెట్లు చేమలు కూలిపోతున్నాయి. ముంబై నగరానికి తుపానులు, అధిక వర్షాల బెడద కొత్తకాదు. తరచుగా వస్తూనే ఉంటాయి. ఎంతో కొంత నష్టాన్ని తెస్తూనే ఉంటాయి. 2005, జూలై 26వ తేదీన కురిసిన కుంభవృష్టికి 447 మంది మరణించగా, అపార నష్టం సంభవించింది. నగర ప్రజలు ఆనాటి భయోపాతాన్ని ఇప్పటికీ మరచిపోలేక పోతున్నారు. (ముంబైని తాకిన నిసర్గ తుఫాను) 1618, మే 15న, 1742, సెప్టెంబర్ 11, 1887, జూన్ 15వ తేదీన సంభవించిన భారీ తుపానులు సృష్టించిన బీభత్సం అంతా ఇంతకాదు. అపార ప్రాణ, ఆస్తి నష్టాలను సృష్టించిన ఈ తుపానులు నగర చరిత్ర పుటల్లో నిలిచిపోయాయి. ఈ తుపానులు వచ్చినప్పుడు నగరంలో కుంభవృష్టి కురవడంతోపాటు సముద్రం అల్లకల్లోలమైంది. ఫలితంగా రాయల్ షిప్పులైన సోమర్సెట్, సాలిస్‌బరి ముఖ భాగాలు విరిగిపోయాయి. పలు ఇతర నౌకలు లంగర్లను తెంపేసుకొని రోడ్డ మీద వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ముంబై టౌన్ హాలు ముందున్న గార్డెన్లలో నడుం లోతు వరకు నీళ్లు వచ్చాయి. 1740, నవంబర్ 9, 1762, మార్చి 7, 1799, నవంబర్, 1854లో వచ్చిన ఓ మోస్తరు తుపానుల వల్ల కూడా దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ఎంతో నష్టం జరిగింది. ఇక ఈ తుపానుల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే జే. జర్సన్ డా కున్హా రాసిన ‘ది ఆరిజిన్ ఆఫ్ బాంబే’ చదవాల్సిందే. (నిసర్గ అలర్ట్: ఏం చేయాలి.. ఏం చేయకూడదు?!) -
నిసర్గ తుఫానుతో మూడు రాష్ట్రాల్లో అలర్ట్
-
ముంబైని తాకిన నిసర్గ తుఫాను
ముంబై : అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో సూరత్‌కి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీవ్ర తుఫాను(నిసర్గ తుఫాను)గా మారిన సంగతి తెలిసిందే. కాగా నిసర్గ తుపాను బుధవారం ముంబైలోని అలీబాగ్ వద్ద మధ్యాహ్నం 1గంట సమయంలో తీరాన్ని తాకింది. మరో మూడు గంటల్లో నిసర్గ సంపూర్ణంగా తీరం దాటనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. నిసర్గ తుఫాను అలీబాగ్ వద్ద తీరం దాటే సమయంలో సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి. కరోనాతో అతలాకుతలం అవుతున్న ముంబై నగరానికి ఈ తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది.(నిసర్గ: చార్జింగ్ పెట్టుకోండి.. గ్యాస్ కట్టేయండి!) ముందుజాగ్రత్త చర్యగా ముంబైలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాత్రి 7గంటల వరకు మూసివేశారు. కాగా తుఫాను ప్రభావంతో ముంబై నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ముంబైలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను తీవ్రత నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 144 సెక్షన్ విధించినట్లు గ్రేటర్ ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాలపై నిసర్గ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నది. జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్ఎఫ్) తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో 40 వేల మందిని, గుజరాత్లో 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంబై పరిసర ప్రాంతాల్లో 20 ఎన్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. గుజరాత్లో 15 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. దక్షిణ గుజరాత్‌లోని పరిశ్రమలను ముందస్తు జాగ్రత్తగా మూసివేశారు. -
నిసర్గ ప్రభావం తెలంగాణపై ఉంటుందా?
-
మహారాష్ట్ర: అలీబాగ్ వద్ద తీరాన్ని తాకిన నిసర్గ తుఫాన్
-
నిసర్గ అలర్ట్: ఏం చేయాలి.. ఏం చేయకూడదు?!
ముంబై: నిసర్గ తుపాను మహరాష్ట్ర తీరాన్ని తాకనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల పెనువేగంతో తుపాను తరుముకొస్తున్న తరుణంలో నిషేధాజ్ఞలు జారీ చేసింది. తుపాను తీవ్రత నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 144 సెక్షన్ విధించినట్లు గ్రేటర్ ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.(గుజరాత్, మహారాష్ట్రలను వణికిస్తోన్న నిసర్గ) ఏం చేయాలి? ఇంటి ఆవరణలో ఉన్న వస్తువులను వెంటనే లోపల పెట్టుకోవాలి. కీలకమైన పత్రాలు, ఆభరణాలు ప్లాస్టిక్ బ్యాగుల్లో భద్రపరచుకోవాలి. పవర్ సిస్టమ్స్ సరిగా పనిచేస్తున్నాయో లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఫోన్లు చార్జింగ్ పెట్టుకోండి. ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునేందుకు టీవీ, రేడియోలో అధికారుల సమావేశాలు చూడాలి. ఎమర్జెన్సీ సమయంలో ఎలా వ్యవహరించాలన్న విషయాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి. ఎమర్జెన్సీ కిట్ అందుబాటులో ఉంచుకోవాలి. కిటికీల నుంచి దూరంగా ఉండాలి. కొన్నింటిని మూసి మరికొన్నింటిని తెరచి ఉంచాలి. కుటుంబ సభ్యులంతా ఇంటి హాల్లో ఉంటే బాగుంటుంది. పాత ఇండ్లయితే కప్పు ఊడిపడే ప్రమాదం ఉన్నందున ఇలా చేయడం శ్రేయస్కరం. గాలులు బలంగా వీస్తున్న సమయంలో దృఢమైన ఫర్నీచర్ కింద దాక్కోవాలి. దానిని గట్టిగా పట్టుకుని కూర్చోవాలి. తల, మెడపై చేతులు అడ్డుపెట్టుకోవాలి. షాపింగ్ మాల్స్, ఆడిటోరియాలకు వెళ్లకూడదు. అవసరంలేని పరికరాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. శుభ్రమైన ప్రదేశంలో మంచినీళ్లను నిల్వ చేసుకోవాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి. వారికి ప్రాథమిక చికిత్స అందించండి. వంట చేయడం ముగిసిన వెంటనే గ్యాస్ కట్టేయాలి. లీక్ అయినట్లు అనిపిస్తే వెంటనే కిటికీలు తెరచి ఉంచాలి. వైర్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేదంటే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. దివ్యాంగులు, పిల్లలు, వృద్ధులు, మహిళలకు అవసరమైన సహాయం అందించండి తుపాను హెచ్చరిక: చేయకూడని పనులు దయచేసి వదంతులు ప్రచారం చేయవద్దు. తుపాను సమయంలో డ్రైవింగ్ చేయకూడదు. పురాతన భవనాల నుంచి ఖాళీ చేయాలి. గాయపడిన వారిని అత్యవరసమైతే తప్ప ఆస్పత్రికి తరలించకూడదు. ఎందుకంటే తుపాను వారితో పాటు మీకు కూడా హాని కలిగించవచ్చు. నూనె, ఇతర ఇంధనాలు కింద ఒలికిపోకుండా జాగ్రత్త పడాలి. Preparedness for #NisargaCyclone pic.twitter.com/n9G6WriWQU — CMO Maharashtra (@CMOMaharashtra) June 2, 2020 -
‘నిసర్గ’ అలర్ట్; ప్రియాంక ఆందోళన
ఇప్పటికే కరోనాతో అతలాకుతలమవుతున్న ముంబై నగరాన్ని నిసర్గ తుపాన్ వణికిస్తోంది. గత శతాబ్ద కాలంలో ముంబై నగరాన్ని భయాందోళనకు గురిచేస్తున్న మొదటి తుపాన్ ఇదే కావడం విశేషం. ఇటీవల ఉంపన్ తుపాన్ పశ్చిమబెంగాల్, ఒడిశాలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం పది రోజుల వ్యవధిలోనే దేశం ఎదుర్కొంటున్న రెండో తుపాన్ ఇది. ఇప్పటికే ముంబైలో అవసరం ఉంటే తప్ప ప్రజలను ఇంటి నుంచి బయటకు రావొద్దని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. నిసర్గ తుపాన్ హెచ్చరిక నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ముంబై నగరంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తుపాన్‌తో జాగ్రత్త వహించేందుకు బృహన్ ముంబై మునిసిపాల్ కార్పొరేషన్ జారీ చేసిన మార్గదర్శకాల జాబితాను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై పోలీసులకు ఫిర్యాదు) ప్రస్తుతం ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి లాస్ ఏంజెల్స్‌లో నివసిస్తున్నారు. అయితే తన తల్లి మధు చోప్రా, సోదరుడు సిద్ధార్థ ముంబైలోనే ఉన్నారని వారిని జాగ్రత్తగా ఉండాలని ప్రియాంక సూచించారు. ‘నిసర్గా తుపాన్ ముంబైను తాకనుంది. నా సొంత నగరమైన ముంబైలో నా తల్లి, సోదరుడితో సహా 20 మిలియన్లకు పైగా జనాభా నివసిస్తోంది. 1891 నుంచి ముంబైలో ఇంత తీవ్రమైన తుఫాను సంభవించలేదు. ఓ వైపు ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. మరోవైపు అత్యంత వినాశకరమనది కావచ్చు’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. (కరోనా టెస్టుల్లో ఏపీ మరో రికార్డు) మరో ట్వీట్లో ‘ఈ సంవత్సరం పూర్తిగా కనికరం లేనిదిగా కనిపిస్తోంది. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించండి. దయచేసి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అని తెలిపారు. తుపాన్ అలజడితో అధికారులు ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంబై పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోని వేలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుపాన్ ఎఫెక్ట్‌తో ముంబై నగరానికి రావాల్సిన అనేక విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. అలాగే అనేక రైళ్లను మళ్లించారు. (గుజరాత్, మహారాష్ట్రలను వణికిస్తోన్న నిసర్గ) This year feels relentless. Please everyone find cover, take precautions and follow the guidelines outlined. Please stay safe everyone. pic.twitter.com/S2xZ5h0g8z — PRIYANKA (@priyankachopra) June 2, 2020 -
వణికిస్తోన్న నిసర్గ
-
తీవ్ర తుఫానుగా ‘నిసర్గ’
సాక్షి, విశాఖపట్నం : నిసర్గ తుఫాను బుధవారం ఉదయం తీవ్ర తుఫానుగా మారింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా తుఫాను కొనసాగుతోంది. ఉత్తర మహారాష్ట్ర వైపు గంటకు 12కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. అలీబాగ్‌కు దక్షిణ నైరుతి దిశగా 140 కి.మీ, ముంబైకి 190 కి.మీ, సూరత్‌కు 415 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌కు ఆనుకుని హరిహరేశ్వర్-దామన్ మద్య అలీబాగ్‌కు సమీపంలో నిసర్గ తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 120 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. నిసర్గ తుఫాను ప్రభావం కారణంగా కొంకణ తీరం మొత్తం దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన ఇన్శాట్ త్రీడీ చిత్రాన్ని భారత వాతావరణ శాఖ తమ ట్విటర్ ఖాతాలో విడుదల చేసింది. ( నిసర్గ ఎఫెక్ట్: కరోనా పేషెంట్ల తరలింపు ) భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ఇన్శాట్ త్రీడీ చిత్రం కాగా, గుజరాత్, మహారాష్ట్రలపై నిసర్గ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందస్తు సహాయక చర్యలు చేపడుతున్నారు. గుజరాత్‌లోని వల్సాద్, సూరత్, నవ్సారీ, భరూచి జిల్లాల్లోని తీరప్రాంతాల్లో నివసించే 78,971 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. నిసర్గ తుపాను తాకిడిని తట్టుకునేందుకు రాష్ట్రంలో అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. తుపాను 16 ఎన్డీఆర్ఎఫ్ యూనిట్లలో 10 బృందాలు తుఫాను సహాయక చర్యల్లో ఉన్నాయని ఇంకా 6 బృందాలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ( దూసుకొస్తున్న మరో తుపాను ) -
గుజరాత్, మహారాష్ట్రలను వణికిస్తోన్న నిసర్గ
-
వణికిస్తోన్న నిసర్గ తుపాను
అహ్మదాబాద్: అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో సూరత్‌కి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం మరో 12 గంటల్లో నిసర్గ తుపానుగా మారనున్నదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 12 గంటల్లో ఉత్తర మహారాష్ట్రను దాటి, దక్షిణ గుజరాత్‌లోకి ప్రవేశించి, అలీబాగ్ వద్ద హరిహరేశ్వర్, డామన్‌ల మధ్య జూన్ 3వ తేదీ సాయంత్రం తీరందాటే అవకాశం ఉన్నదని, తీరందాటే సమయంలో గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.ఎస్.హసలీకర్ హెచ్చరించారు. ఎన్డీఆర్ఎఫ్కి చెందిన 14 జాతీయ విపత్తు సహాయక బృందాలు తీరప్రాంతాల్లో రక్షణచర్యలు చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. మరో ఐదు బృందాలను ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక విమానాల్లో రప్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తుపానుని ‘నిసర్గ’గా పిలుస్తున్నారు. నిసర్గ పేరుని బంగ్లాదేశ్ సూచించినట్టు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర వెల్లడించారు. గుజరాత్‌లోని వల్సాద్, సూరత్, నవ్సారీ, భరూచి జిల్లాల్లోని తీరప్రాంతాల్లో నివసించే 78,971 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 6 స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ తుఫాన్ సహాయక చర్యల్లో ఉన్నట్టు అధికారి హర్షద్ పటేల్ అహ్మదాబాద్‌లో వెల్లడించారు. వారికి 140 భవనాల్లో తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో సహాయక బృందాలు పీపీఈ కిట్లను ధరించాలనీ, షెల్టర్లలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు. నిసర్గ తుపాను తాకిడిని తట్టుకునేందుకు రాష్ట్రంలో అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. తుపాను 16 ఎన్డీఆర్ఎఫ్ యూనిట్లలో 10 బృందాలు తుఫాను సహాయక చర్యల్లో ఉన్నాయని ఇంకా 6 బృందాలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. జూన్ 1 నాటికి ముంబైలో నమోదైన 41,099 కేసులతో సహా మహారాష్ట్రలో 70,000కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మూలిగే నక్కపైన తాటికాయపడ్డ చందంగా ఇప్పుడు తుపాను తాకిడికి మహారాష్ట్ర మరింత అతలాకుతలం కానుంది. ముంబై నగరంలోని థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధు దుర్గ్ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసినట్టు అధికారులు వెల్లడించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోనూ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలతో మాట్లాడి రెండు రాష్ట్రాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాననీ, ప్రజలంతా సురక్షితంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు వహించాలని ప్రధాని ట్వీట్ చేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో ఉన్న 150 మంది కోవిడ్ పేషెంట్లను మరో ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. కేరళలో భారీ వర్షాలు నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన ఒక రోజు తరువాత కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. రాష్ట్ర రాజధానితో సహా ఏడు జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. ఈ ప్రాంతాల్లో 6.4 సెంటీమీటర్ల నుంచి 11.5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం, 11.5 సెంటీమీటర్ల నుంచి 20.4 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది. -
నిసర్గ తుపాను: ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్
సాక్షి, ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుపాను మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై విరుచుకుపడనుందనే భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముంబైకి సమీపంలో ఈ తుపాను బుధవారం తీరం దాటే అవకాశముందని ఐఎండీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తుపాను ప్రభావంపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాని హోమంత్రి తెలిపారు. కాగా, మహారాష్ట్ర, డయ్యూడామన్, గుజరాత్‌కు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శతాబ్దకాలంలో ముంబై మహానగరాన్ని తాకనున్న రెండో అతిపెద్ద తుపానుగా ‘నిసర్గ’ను పేర్కొంటున్నారు. (చదవండి: ముంబైకి రెడ్ అలర్ట్ ) -
నిసర్గ ఎఫెక్ట్: కరోనా పేషెంట్ల తరలింపు
ముంబై: అటు కరోనాతో వణికిపోతున్న భారత్‌పై ఉంపన్ తుపాను విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇది సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే మరో తుపాను దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుపాను మహారాష్ట్ర, గుజరాత్ తీరాలపై విరుచుకుపడనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇదివరకే వెల్లడించింది. ముఖ్యంగా ముంబై తీరంలో ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్న హెచ్చరికలతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. (ఒక్కరోజే 8171 కేసులు) అందులో భాగంగా బాంద్ర కుర్ల కాంప్లెక్స్ నుంచి సుమారు 250 మంది కోవిడ్ రోగులను వర్లిలోని ఎన్ఎస్సీఐ కరోనా కేంద్రానికి తరలించారు. కాగా దేశంలో కోవిడ్–19 మహమ్మారితో ఇప్పటివరకు 5,394 మంది మృతి చెందగా కేసుల సంఖ్య 1,90,535కు చేరుకుంది. ఒక్క మహారాష్ట్రలోనే కేసుల సంఖ్య దాదాపు 70 వేలు ఉండటం గమనార్హం. కేసుల సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉంది. కానీ మరణాల సంఖ్యలో టాప్ 10 జాబితాలో లేకపోవడం ఊరట కలిగించే అంశం. (ముంబైకి రెడ్ అలర్ట్) -
ముంబైకి నిసర్గ తుపాను ముప్పు
-
దూసుకొస్తున్న మరో తుపాను
సాక్షి, హైదరాబాద్: సూపర్ సైక్లోన్ ‘నింపన్’ సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా కోలుకోకముందే మరో తుపాను దూసుకోస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుపాను మహారాష్ట్ర, గుజరాత్ తీరాలపై విరుచుకుపడనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ముంబైకి సమీపంలో ఈ తుపాను బుధవారం తీరం దాటే అవకాశముందని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో భయంకరమైన గాలులు వీస్తాయని, ముంబై వాసులు అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ జారీ చేసింది. శతాబ్దకాలంలో ముంబై మహానగరాన్ని తాకనున్న రెండో అతిపెద్ద తుపానుగా ‘నిసర్గ’ను పేర్కొంటున్నారు. ‘అరేబియా సముద్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం దక్షిణ నైరుతి దిశగా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 12 గంటల్లో మరింత బలపడి తూర్పు మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో బలపడి తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. ప్రారంభంలో మంగళవారం ఉదయం వరకు ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తర ఈశాన్య దిశగా బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో హరిహరేశ్వర్ (రైగర్, మహారాష్ట్ర), దామన్ మధ్య ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలను దాటే అవకాశం ఉంద’ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. రాగల 24 గంటల్లో ముంబైపై తుపాను తీవ్ర ప్రభావం చూపనుందన్న సమాచారం నేపథ్యంలో కేంద్ర హెంశాఖ మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు 39 బృందాలను పంపినట్టు జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) ప్రకటించింది. (ఇంత బీభత్సమా.. షాకయ్యాను)