ముంబై: అటు కరోనాతో వణికిపోతున్న భారత్‌పై ఉంపన్ తుపాను విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇది సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే మరో తుపాను దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుపాను మహారాష్ట్ర, గుజరాత్ తీరాలపై విరుచుకుపడనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇదివరకే వెల్లడించింది. ముఖ్యంగా ముంబై తీరంలో ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్న హెచ్చరికలతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. (ఒక్కరోజే 8171 కేసులు)
అందులో భాగంగా బాంద్ర కుర్ల కాంప్లెక్స్ నుంచి సుమారు 250 మంది కోవిడ్ రోగులను వర్లిలోని ఎన్ఎస్‌సీఐ కరోనా కేంద్రానికి తరలించారు. కాగా దేశంలో కోవిడ్–19 మహమ్మారితో ఇప్పటివరకు 5,394 మంది మృతి చెందగా కేసుల సంఖ్య 1,90,535కు చేరుకుంది. ఒక్క మహారాష్ట్రలోనే కేసుల సంఖ్య దాదాపు 70 వేలు ఉండటం గమనార్హం. కేసుల సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉంది. కానీ మరణాల సంఖ్యలో టాప్ 10 జాబితాలో లేకపోవడం ఊరట కలిగించే అంశం. (ముంబైకి రెడ్ అలర్ట్)
Comments
Please login to add a commentAdd a comment