
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో భారత్‌లో రారాజుగా దూసుకుపోతున్న షావోమి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో పాపులర్ రెడ్‌మి నోట్ 4కు కొనసాగింపుగా తీసుకొస్తున్న అప్ కమింగ్ డివైస్ రెడ్ మి నోట్ 5 ఫీచర్స్ , ఇమేజ్ తదితర సమాచారం లీకైంది. బెజెల్ లెస్ డిజైన్‌తో , డిస్‌ప్లే సైజ్, షేప్‌లో భారీ మార్పులతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుందని చైనా మీడియా తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే MIUI ఆధారంగా పనిచేసినా.. ఆండ్రాయిడ్7.1.2 ఆధారితం. అలాగే డబుల్ కెమెరాలతో లాంచ్‌కానుందని ఇటీవలి అంచనాలు వెలువడినా షావోమి అధికారిక ప్రకటన తరువాత మాత్రమే కెమెరాలకు సంబంధించిన వివరాలు భ్యం కానున్నాయి.
రెడ్ మి నోట్ 5 ఫీచర్లు
5.99 ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 7.1.2
4జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
12 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4000 ఎంఏహెచ్‌బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment