ఒక్క వీడియోతో రెండు నెలల కష్టం బూడిదలో పోసినట్లైంది: డైరెక్టర్ ఆవేదన | Lokesh Kanagaraj responds on Nagarjuna leaked Coolie scene | Sakshi
Sakshi News home page

Lokesh Kanagaraj: 'మీ అందరికీ విజ్ఞప్తి.. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు'

Published Thu, Sep 19 2024 8:41 AM | Last Updated on Thu, Sep 19 2024 10:12 AM

Lokesh Kanagaraj responds on Nagarjuna leaked Coolie scene

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం రజినీకాంత్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఈ యాక్షన్‌ మూవీని భారీ బడ్జెట్‌తో సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో సైమన్ పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వైజాగ్‌లో నాగార్జున్‌పై ఫైట్ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట లీకైంది. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేశారు. అది కాస్తా వైరల్ కావడంతో దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ స్పందించారు. దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

లోకేశ్ తన ట్వీట్‌లో రాస్తూ..' మేము దాదాపు రెండు నెలల పాటు కష్టపడ్డాం.. ఈ ఒక్క వీడియోతో మా కష్టం వృథా అయింది. మీ అందరికీ నాదొకటే విజ్ఞప్తి.. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు.. దీని వల్ల మేం పడిన కష్టమంతా వృథా అవుతుంది.. ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. 


(ఇది చదవండి: రజినీకాంత్‌- కనగరాజ్‌ 'కూలీ'.. నాగార్జున వీడియో లీక్!) 

కాగా.. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు శృతి హాసన్‌, సత్యరాజ్‌, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో  రజనీకాంత్ దేవాగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా మూవీ 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement