
సూపర్ స్టార్ రజనీకాంత్- డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కూలీ'. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి పలు రూమర్స్ వచ్చాయి. తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో తెరపైకి వచ్చింది. భారీ అంచనాలున్న ఈ సినిమాపై సినీ అభిమానులు ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో నటిస్తున్న తారల గురించీ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇదొక మల్టీస్టారర్ సినిమా తరహాలో తెరకెక్కబోతోందని, ఇందులో టాలీవుడ్ హీరో నాగార్జునతో పాటు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించనున్నారని తమిళ సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే, తాజాగా కన్నడ సూపర్ స్టార్ 'ఉపేంద్ర' ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు సమాచారం. ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కొద్దిరోజుల క్రితమే కూలీ సినిమా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. దాదాపు 25రోజుల పాటు ఈ షెడ్యూల్ ఇక్కడే కొనసాగింది. బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment