రజినీకాంత్‌- కనగరాజ్‌ 'కూలీ'.. నాగార్జున వీడియో లీక్! | Tollywood Hero Nagarjuna scene Leaked from the sets of Rajinikanth Coolie Movie | Sakshi
Sakshi News home page

Nagarjuna: రజినీకాంత్‌ కూలీ చిత్రం.. నాగార్జున వీడియో వైరల్!

Published Wed, Sep 18 2024 6:17 PM | Last Updated on Wed, Sep 18 2024 6:30 PM

Tollywood Hero Nagarjuna scene Leaked from the sets of Rajinikanth Coolie Movie

టాలీవుడ్ హీరో, కింగ్ నాగార్జున ప్రస్తుతం బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-8కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది అంతా సరికొత్తగా బిగ్‌బాస్‌ షో ప్రారంభమైంది. ఇప్పటికే హౌస్ నుంచి బేబక్క, ఆర్జే శేఖర్ భాష ఎలిమినేట్‌ అయ్యారు. ప్రస్తుతం మూడోవారంలో నామినేషన్స్ ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది.  అయితే నాగార్జున.. కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్‌ డైరెక్షన్‌లో వస్తోన్న కూలీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రస్తుతం నాగార్జున ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నాగ్ యాక్షన్‌ సీన్‌ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కింగ్ ఫైట్‌ చేస్తోన్న సీన్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున్ సైమన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు తమ అభిమాన హీరోను చూసి థ్రిల్ అవుతున్నారు. ఇందులో నాగార్జున పాత్రను విక్రమ్‌ సినిమాలోని కమల్‌ హాసన్‌ రోల్‌లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు శృతి హాసన్‌ని, సత్యరాజ్‌, ఉపేంద్ర నటిస్తున్నారు. ఇందులో  రజనీకాంత్ దేవాగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement