
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈయన ఇటీవల జ్ఞానవేల్ దర్మకత్వంలో వేట్టైయన్‌లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా మెప్పించారు. అయితే, ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా కూలీ చిత్రం తరువాత రజనీకాంత్ కోసం మరో చిత్రం ఎదురు చూస్తోంది.
ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన అందులో నటి రమ్యకృష్ణ రజనీకాంత్‌కు భార్యగా నటించగా, నటి తమన్నా ప్రత్యేక పాత్రలో మెరిశారు. కాగా జైలర్ చిత్రం నిర్మా ణ దశలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ పేర్కొన్నారు. దీంతో ఈయన జైలర్– 2 చిత్ర కథను తయారు చేసే పనిలో ఉన్నారు. తా జాగా కథను రెడీ చేసి నెల్సన్ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధం అయ్యారని సమాచారం.
ఈ చిత్రానికి 'హుకూమ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడికాకపోయినా ప్రస్తుతం 'హుకూమ్' చిత్రం గురించి అప్ డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం డిశంబర్ తొలి వారంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన పనులు స్థానిక పూందమల్లిలోని ఈవీపీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో వీడియోను రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే నిజం అయితే రజనీకాంత్ అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment