Red Mi Note
-
ఊహించని ధరల్లో రెడ్మి నోట్ 7
సాక్షి, న్యూఢిల్లీ: చైనాస్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన నోట్ సిరీస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7ను గురువారం (ఫిబ్రవరి 28) భారత మార్కెట్లో లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ఫోన్లను ఎట్టకేలకు న్యూఢిల్లీలో ఆవిష్కరించింది. అనూహ్యంగా ప్రారంభ ధర రూ.9999గా ఉంచి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటికే చైనా మార్కెట్లో మిలియన్ అమ్మకాలతో రెడ్మి నోట్ 7 దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రెడ్మి నోట్ 7లో 48 మెగా పిక్సెల్ భారీ కెమెరాకు బదులుగా ఇండియాలో కేవలం డ్యుయల్ రియర్ కెమెరాను అమర్చింది. రెండు వైపులా గొరిల్లాగ్లాస్ రక్షణ, క్విక్ చార్జ్ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. రెడ్మి నోట్ 7 తొలి ఫ్లాష్ సేల్: ఫ్లిప్‌కార్ట్, ఎం.ఐకాం ద్వారా మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12గంటలనుంచి రెడ్మి నోట్ 7 ఫీచర్లు 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 660ఆక్టాకోర్ ప్రొసెసర్ ఆండ్రాయిడ్ 9 పై 3జీబీ, 32 జీబీ స్టోరేజ్ 12+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ 3జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ.9999 4జీబీ/64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ. 11,999 దీంతో పాటు దాదాపు ఇదే ఫీచర్లతో రెడ్మి నోట్ 7 ప్రొను కూడా తీసుకొచ్చింది. అయితే క్వాల్కం స్నాప్ డ్రాగన్ 675 క్రియో ప్రాసెసర్ , 48+5 మెగా పిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరాను అమర్చడం విశేషం. 4జీబీ, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ.13,999 6జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ.16,999 ఫస్ట్ ఫ్లాష్ సేల్ : ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం ద్వారా మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12గంటలనుంచి -
రెడ్మీ కొత్తఫోన్ల విక్రయాలు నేటినుంచే
సాక్షి, ముంబై: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ తన లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు, ఎల్ఈడీ స్మార్ట్ టీవీని తొలిసారిగా దేశంలో విక్రయానికి అందుబాటులోకి తెచ్చింది. ఈ రోజు(గురువారం)మధ్యాహ్నం 12 గంటలనుంచి ప్రారంభించనుంది. రెడ్ మి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నరెడ్మీ నోట్ 5, నోట్ 5 ప్రొ పేరిట ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లో ఇవి లభ్యంకానున్నాయి. రెడ్మి నోట్ 5, నోట్ 5 ప్రో కొనుగోలుదారులకు రిలయన్స్ జియోతో కలిసి డబుల్ డేటాతో పాటు రూ .2,200 తక్షణ క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయిన షియోమీ రెడ్మీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ వేరియెంట్లలో రూ.9,999, రూ.11,999 ధరలకు ఫ్లిప్‌కార్ట్ సైట్లో లభ్యం కానుంది. అలాగే అవే కలర్లలో విడుదలైన షియోమీ రెడ్మీ నోట్ 5 ప్రొ 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.13,999, రూ.16,999 ధరలకు లభ్యం కానుంది. షావోమీ రెడ్మీ నోట్ 5 ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12 ఎంపీ బ్యాక్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. షావోమీ రెడ్మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్ మి నోట్ 5 వస్తుందా? ఎప్పుడు?
చైనా మొబైల్ మేకర్ షావోమి నోట్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. రెడ్ మి నోట్ 5ను త్వరలోనే లాంచ్ చేయనుందని , ఈ మేరకు ఇప్పటికే టెస్టింగ్ ప్రారంభించిందంటూ పలు నివేదికలు వెలుడ్డాయి. మరోవైపు దీనికి భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అవుట్ గోయింగ్ మోడల్ రెడ్మి నోట్ 5 లాంచింగ్ బాగా లేట్ కానుందని మరో నివేదిక ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతగా చెబుతున్న క్వాల్కం చిప్సెట్ ఇంకా లాంచ్ కాకపోవడం దీనికి కారణమని ఓ చైనా వెబ్సైట్ వాదిస్తోంది. ఈ ఏడాది రెండవ క్వార్టర్‌కంటే ముందు అందుబాటులోకి రాదని తెలిపింది. అలాగే భారతీయ కొనుగోలుదారులు దీనికోసం మరింత ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుందని నివేదించింది. రెడ్ మి నెట్ 5 బేస్ వేరియంట్ ధర రూ.12 వేలుగా నిర్ణయించే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 12 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుందని అంచనా. మిగతా ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి. రెడ్ మి నోట్ 5 5.99 అంగుళాల ఫుల్హెచ్డీ స్క్రీన్18:9 యాస్పెక్ట్ రేషియో క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 632 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.2. 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్ మి నోట్ 5 ఫీచర్లు లీక్
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో భారత్‌లో రారాజుగా దూసుకుపోతున్న షావోమి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో పాపులర్ రెడ్మి నోట్ 4కు కొనసాగింపుగా తీసుకొస్తున్న అప్ కమింగ్ డివైస్ రెడ్ మి నోట్ 5 ఫీచర్స్ , ఇమేజ్ తదితర సమాచారం లీకైంది. బెజెల్ లెస్ డిజైన్‌తో , డిస్ప్లే సైజ్, షేప్‌లో భారీ మార్పులతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుందని చైనా మీడియా తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే MIUI ఆధారంగా పనిచేసినా.. ఆండ్రాయిడ్7.1.2 ఆధారితం. అలాగే డబుల్ కెమెరాలతో లాంచ్‌కానుందని ఇటీవలి అంచనాలు వెలువడినా షావోమి అధికారిక ప్రకటన తరువాత మాత్రమే కెమెరాలకు సంబంధించిన వివరాలు భ్యం కానున్నాయి. రెడ్ మి నోట్ 5 ఫీచర్లు 5.99 ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1.2 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4000 ఎంఏహెచ్‌బ్యాటరీ -
షియోమి నుంచి మూడో మొబైల్
న్యూఢిల్లీ: చైనా యాపిల్‌గా ప్రసిద్ధి చెందిన షియోమి తాజాగా భారత్‌లో తన మూడో మొబైల్, రెడ్మి నోట్‌ను ఆవిష్కరించింది. ఈ మొబైల్‌ను ఈ కంపెనీ రెండు వేరియంట్లలో- 3జీ మోడల్(డ్యుయల్ సిమ్-ధర రూ.8,999). 4జీ మోడల్(సింగిల్ సిమ్-ధర రూ.9,999) అందించనున్నది. రెడ్ మి నోట్ 3జీలో 5.5 అంగుళాల స్క్రీన్, 1.7 గిగా హెర్ట్జ్ ఆక్ట-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,100 లిథియమ్- పాలిమర్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని షియోమి వివరించింది. ఈ ఫోన్‌కు రిజిస్ట్రేషన్లు ఈ నెల 25 (నేడు-మంగళవారం) సాయంత్రం 6 గంటల నుంచి, విక్రయాలు వచ్చే నెల మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. 1.6 గిగా ెహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో రూపొందిన 4జీ వేరి యంట్‌ను ఎయిర్టెల్ భాగస్వామ్యంతో అందిస్తున్నామని తెలిపింది. ఈ మొబైల్‌ను ఎయిర్టెల్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, అంతేకాకుండా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఉన్న వంద ఎయిర్టెల్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చని వివరించింది. ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఈ మొబైల్‌ను వచ్చే నెలలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.