చైనా మొబైల్ మేకర్ షావోమి నోట్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. రెడ్ మి నోట్ 5ను త్వరలోనే లాంచ్ చేయనుందని , ఈ మేరకు ఇప్పటికే టెస్టింగ్ ప్రారంభించిందంటూ పలు నివేదికలు వెలుడ్డాయి. మరోవైపు దీనికి భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
అవుట్ గోయింగ్ మోడల్ రెడ్‌మి నోట్ 5 లాంచింగ్ బాగా లేట్ కానుందని మరో నివేదిక ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతగా చెబుతున్న క్వాల్కం చిప్‌సెట్ ఇంకా లాంచ్ కాకపోవడం దీనికి కారణమని ఓ చైనా వెబ్‌సైట్ వాదిస్తోంది. ఈ ఏడాది రెండవ క్వార్టర్‌కంటే ముందు అందుబాటులోకి రాదని తెలిపింది. అలాగే భారతీయ కొనుగోలుదారులు దీనికోసం మరింత ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుందని నివేదించింది. రెడ్ మి నెట్ 5 బేస్ వేరియంట్ ధర రూ.12 వేలుగా నిర్ణయించే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 12 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుందని అంచనా. మిగతా ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి.
రెడ్ మి నోట్ 5
5.99 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ స్క్రీన్18:9 యాస్పెక్ట్ రేషియో
క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 632 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.2.
4జీబీ ర్యామ్
64జీబీ స్టోరేజ్
4000ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment