షియోమి నుంచి మూడో మొబైల్ | Xiaomi launches Redmi Note for Rs 8999 and Redmi Note 4G for Rs 9999 | Sakshi
Sakshi News home page

షియోమి నుంచి మూడో మొబైల్

Published Tue, Nov 25 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

షియోమి నుంచి మూడో మొబైల్

షియోమి నుంచి మూడో మొబైల్

న్యూఢిల్లీ: చైనా యాపిల్‌గా ప్రసిద్ధి చెందిన షియోమి తాజాగా భారత్‌లో తన మూడో మొబైల్, రెడ్‌మి నోట్‌ను ఆవిష్కరించింది. ఈ మొబైల్‌ను ఈ కంపెనీ రెండు వేరియంట్లలో-  3జీ మోడల్(డ్యుయల్ సిమ్-ధర రూ.8,999). 4జీ మోడల్(సింగిల్ సిమ్-ధర రూ.9,999) అందించనున్నది. రెడ్ మి నోట్ 3జీలో 5.5 అంగుళాల స్క్రీన్, 1.7 గిగా హెర్ట్జ్ ఆక్ట-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,100 లిథియమ్- పాలిమర్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని షియోమి వివరించింది.

 ఈ ఫోన్‌కు  రిజిస్ట్రేషన్లు ఈ నెల 25 (నేడు-మంగళవారం) సాయంత్రం 6 గంటల నుంచి, విక్రయాలు  వచ్చే నెల మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.  1.6 గిగా ెహెర్ట్జ్  క్వాడ్-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో రూపొందిన  4జీ వేరి యంట్‌ను ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో అందిస్తున్నామని  తెలిపింది. ఈ మొబైల్‌ను ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, అంతేకాకుండా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఉన్న వంద ఎయిర్‌టెల్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చని వివరించింది. ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.  ఈ మొబైల్‌ను వచ్చే నెలలో  అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement