రెడ్‌మీ కొత్తఫోన్ల విక్రయాలు నేటినుంచే | Redmi Note 5, Redmi Note 5 Pro and Xiaomi Mi LED TV 4 sale today at 12 noon | Sakshi
Sakshi News home page

రెడ్‌మీ నోట్ 5, నోట్‌ 5 ప్రొ విక్రయాలు నేటినుంచే

Published Thu, Feb 22 2018 10:17 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Redmi Note 5, Redmi Note 5 Pro and Xiaomi Mi LED TV 4 sale today at 12 noon - Sakshi

సాక్షి, ముంబై: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ  షావోమీ తన లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లు,  ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీని  తొలిసారిగా   దేశంలో విక్రయానికి అందుబాటులోకి తెచ్చింది.   ఈ రోజు(గురువారం)మధ్యాహ్నం 12 గంటలనుంచి ప్రారంభించనుంది. రెడ్‌ మి అభిమానులు  ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నరెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ పేరిట  ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌లో  ఇవి లభ్యంకానున్నాయి. రెడ్‌మి నోట్ 5,  నోట్ 5 ప్రో కొనుగోలుదారులకు రిలయన్స్ జియోతో కలిసి డబుల్ డేటాతో పాటు  రూ .2,200 తక్షణ క్యాష్‌బ్యాక్‌ కూడా  అందిస్తోంది.   బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయిన షియోమీ రెడ్‌మీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ వేరియెంట్లలో రూ.9,999, రూ.11,999 ధరలకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది. అలాగే అవే కలర్లలో విడుదలైన షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.13,999, రూ.16,999 ధరలకు లభ్యం కానుంది.


షావోమీ  రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్‌ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
3/4 జీబీ ర్యామ్
32/64 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12 ఎంపీ బ్యాక్ కెమెరా
5 ఎంపీ  సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షావోమీ  రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్‌ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్,
4/6 జీబీ ర్యామ్,
64 జీబీ స్టోరేజ్,
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
20 ఎంపీ సెల్ఫీ కెమెరా,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement