
Flipkart Big Saving Days Sale Apple iPhone 14: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు (జూలై 19)తో ముగియనుంది. ఈ సేల్ యాపిల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. యాపిల్ ఐఫోన్ తక్కువ ధరలో లభిస్తోంది అంటే ఐఫోన్ లవర్స్‌కు పండగే పండగ. అలాంటి వారు.. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్14ను సొంతం చేసుకోవాలనుకుంటే ఇదే మంచి తరుణం. వివరాలేంటో చూద్దాం రండి! (యాపిల్ వాచ్ కొత్త ఫీచర్ వచ్చేసింది: క్రానిక్ హార్ట్ కండిషన్ ఈజీ ట్రాక్)
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్ 14 రూ. 47,501 తగ్గింపు తర్వాత కేవలం రూ. 32.399కి అందుబాటులో ఉంది. ఇంత తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి అవకాశం నేటితో ముగియనుంది. యాపిల్ ఐఫోన్ 14 రూ. 10,901 తగ్గింపుతో రూ. 68,999 వద్ద అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, యాక్సిస్ బ్యాంక్ , సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , EMI లావాదేవీలపై రూ. 1000 తగ్గింపును పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.67,999కి తగ్గింది. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఫ్లిప్‌కార్ట్ రూ. 35,600 దాకా తగ్గింపు లభిస్తుంది. అలా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 47,501 తగ్గింపు తర్వాత రూ. 32,399కి లభిస్తుంది.
గత ఏడాది చివర్లో లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 14 ఐఫోన్ 13 లానే ఉంది,పెద్దగా అప్‌డేట్ లేదనే అంచనాల నేపథ్యంలో ప్రారంభ అమ్మకాల సమయంలో పెద్దగా స్పందనను పొందడంలో విఫలమైంది. అయితే ఇటీవలి ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆదరణ పొందుతోన్నట్టు తెలుస్తోంది.