అతి తక్కువ ధరకే యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది ఫ్లిప్‌కార్ట్. నిబంధనలప్రకారం 2019 లో లాంచ్ చేసిన యాపిల్ ఐఫోన్ 11ను ఇప్పుడు కేవలం రూ. 2749కే దక్కించుకోవచ్చు. ఐఫోన్ 11 ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 36,250 తగ్గింపు తర్వాత కేవలం రూ. 2,749కే లభిస్తుంది.
ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ మోడల్స్‌లో ఐఫోన్ 11 కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 2020లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు అద్భుతమైన స్పందన లభించింది.
ఐఫోన్ 11: 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్‌ప్లే, A13 బయోనిక్ చిప్‌సెట్ , 12 ఎంపీ రియర్ డ్యుయల్ కెమెరా ,12 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటివిప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్‌కి ఎదురుదెబ్బ: సీఈవో గుడ్‌బై, ప్రత్యర్థికి సై!?)
ఆఫర్ ఎలా వర్తిస్తుందంటే..
రూ.4,901 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.38,999 లిస్ట్ అయింది. అయితే దీనితో పాటు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీపై ఫ్లాట్ రూ. 1,250 తగ్గింపును పొందవచ్చు. అంటే ధర రూ. 37,749కి దిగి వచ్చింది. అలాగే పాత స్మార్ట్‌ఫోన్ మార్పడిద్వారా ఫ్లిప్‌కార్ట్ రూ. 35,000 వరకు తగ్గింపు లభ్యం. అంటే కేవలం రూ. 2,749కియాపిల్ ఐఫోన్ 11ని పొందవచ్చు. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!)
మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment