లీకైన జై లవ కుశ స్టిల్స్ | Jai Lava Kusa Leaked And Arrested | Sakshi

లీకైన జై లవ కుశ స్టిల్స్

Jun 28 2017 12:15 PM | Updated on Sep 5 2017 2:42 PM

లీకైన జై లవ కుశ స్టిల్స్

లీకైన జై లవ కుశ స్టిల్స్

భారీ చిత్రాలకు లీకుల బెడద తప్పటం లేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలు సోషల్

భారీ చిత్రాలకు లీకుల బెడద తప్పటం లేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జై లవ కుశ కూడా లీకు వీరుల బారిన పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కు సంబంధించినవిగా తెలుస్తున్నాయి.

రావణ దహనం బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ పై తెరకెక్కించిన ఫైట్ సీన్ కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ స్టిల్స్ కువైట్ నుంచి లీక్ అయినట్టుగా భావిస్తున్నారు. ఈ సినిమాకు ఆన్ లైన్ ఎడిటర్ పనిచేస్తున్న గణేష్ అనే వ్యక్తి  లీక్ చేశాడని అనుమానిస్తున్నారు. గణేష్ తన ఫ్రెండ్స్ ద్వారా కువైట్ నుంచి ఈ ఫోటోలు పోస్ట్ చేయించాడు.

ఇప్పటికే చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేశారు.కేవలం స్టిల్స్ మాత్రమే లీక్ అయ్యాయా.. లేక సీన్స్ కూడా ఏమైన లీక్ అయ్యాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement