ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్ ఐఫోన్లకు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్. ఆపిల్ ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోని రిలీజ్ చేయనున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఐఫోన్ 13 కు సంబంధించి పలు ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకైయ్యాయి. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 12 సిరీస్‌తో పోల్చితే ఐఫోన్ 13లో పెద్ద వైర్‌లెస్ ఛార్జింగ్ కాయిల్‌ను అమర్చారు. దీంతో ఛార్జింగ్ కాయిల్ వేడేక్కె అవకాశం తక్కువగా ఉండనుంది.
ఐఫోన్ 13 మోడళ్లలో పోర్ట్రెయిట్ మోడ్ వీడియో ఫీచర్ ఉంటుందని తెలుస్తోంది. ఆపిల్ కొత్త ఐఫోన్ 13 సిరీస్‌ను సెప్టెంబర్‌లో ఆవిష్కరిస్తోందని టెక్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఫోన్ 13 వస్తోన్న నేపథ్యంలో..ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 12 బేసిక్ మోడల్‌పై సుమారు రూ. 9000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ మోడళ్లపై భారీ తగ్గింపును ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ నుంచి పొందవచ్చును. భవిష్యత్తులో ఐఫోన్ 12 మోడళ్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
iPhone 13: లీకైన ఐఫోన్ 13 ఫీచర్లు
Published Mon, Jul 5 2021 10:11 PM | Last Updated on Mon, Jul 5 2021 10:14 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment