లాంచింగ్కు ముందే ఆ ఫోన్లు లీకైపోయాయ్! | Samsung Galaxy A series (2017) specifications leaked ahead of launch | Sakshi
Sakshi News home page

లాంచింగ్కు ముందే ఆ ఫోన్లు లీకైపోయాయ్!

Published Sat, Dec 31 2016 12:22 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

లాంచింగ్కు ముందే ఆ ఫోన్లు లీకైపోయాయ్!

లాంచింగ్కు ముందే ఆ ఫోన్లు లీకైపోయాయ్!

కొత్త ఏడాదిలో గెలాక్సీ కొత్త సిరీస్ ఫోన్లతో మన ముందుకు రాబోతుంది స్మార్ట్ ఫోన్ల దిగ్గజం శాంసంగ్. జనవరి 5వ తేదీన గెలాక్సీ ఏ(2017) సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్లాన్స్ చేసింది. కౌలాలంపూర్లో జరిగే ఈ ఈవెంట్కు మీడియా ప్రతినిధులకు కూడా ఆహ్వానాలు పంపేసింది. అయితే గ్రాండ్గా రిలీజ్ చేద్దామనుకున్న ఈ గెలాక్సీ ఫోన్ల వివరాలు విడుదలకు ముందే లీకైపోయాయి. గెలాక్సీ ఏ3, గెలాక్సీ ఏ5, గెలాక్సీ ఏ7లలో ఈ మూడు డివైజ్లు రాబోతున్నాయని తెలుస్తోంది. ఐపీ68 రేటింగ్తో ఈ మూడు డివైజ్లను పెట్టనున్నట్టు సమాచారం. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ను ఇవి కలిగి ఉన్నాయట. ఫింగర్ ప్రింట్ స్కానర్స్, ఎన్ఎఫ్‌సీలతో ఇవి రూపొందాయట. 
 
లీకైన గెలాక్సీ ఏ7(2017) ఫీచర్లు...
5.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
ఆక్టా కోర్ ఎక్సినోస్ 7880 ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
16 ఎంపీలతో ఫ్రంట్, రియర్ కెమెరా
ధర :  సుమారు రూ.28,800
 
లీకైన గెలాక్సీ ఏ5(2017) ఫీచర్లు...
5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
ఆక్టా కోర్ ఎక్సినోస్ 7880 ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
32 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
దీనికి కూడా 16 మెగాపిక్సెళ్ల ఫ్రంట, రియర్ కెమెరా
ధర :  సుమారు రూ.25,700
 
గెలాక్సీ ఏ3(2017) రూమర్లు...
 4.7 అంగుళాల హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
ఆక్టాకోర్ హెక్సినోస్ 7870 ప్రాసెసర్
2జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement