వాషింగ్టన్: యూఎస్ క్యాపిటల్ దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడిగా సేవలందించిన డొనాల్డ్ ట్రంప్.. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లు శాశ్వతంగా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ సొంతంగా కొత్త మీడియా కంపెనీతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌ను లాంచ్ చేశారు. ప్రసుతం ఆయా కంపెనీలకు సంబంధించిన ఒప్పందాలు ముందుగా లీక్ అయ్యాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా కంపెనీ, బ్లాక్ చెక్ ఎంటిటీ మధ్య పెండింగ్‌లో ఉన్న విలీన ఒప్పందం గురించి మియామీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలోని ఉద్యోగులు ముందుగానే తెలుసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
రాకెట్ వన్ క్యాపిటల్ సంస్థ అధికారులు బ్లాంక్ చెక్ కంపెనీ డిజిటల్ అక్విజిషన్ కార్పొరేషన్‌లో పెట్టుబడుల పెట్టడం ద్వారా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలీజీ పొందే లాభాల తోపాటు ప్రకటించనున్న లావాదేవీల గురించి వెల్లడించారని తెలిపింది. అంటే ఇంకా పెండింగ్‌లో ఉన్న ఈ విలీన ఒప్పంద గురించి కీలక విషయాలు బయటకు రావడాన్నిబట్టి చూస్తే ముందుగానే ఈ విషయాలు బయటకు పొక్కినట్లు తెలుస్తోందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అదీగాక ఇప్పుడూ ఫెడరల్ ప్రాసిక్యూటర్‌లు, రెగ్యులేటర్‌లు ఈ విషయమై కూలంకషంగా దర్యాప్తు చేయడమే కాకుండా పెండింగ్‌లో ఉన్న విలీన ఒప్పందం విషయాలను ముందుగానే బహిర్గతం చేసిన వ్యక్తులతో సహా విచారణ చేయడం మొదలు పెట్టింది.
ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్రూత్ సోషల్ సృష్టికర్త అక్టోబర్ 20న డిజిటల్ వరల్డ్‌తో విలీనానికి అంగీకరించారు. పైగా ఈ ఏడాది ద్వితియార్థంలో ఈ ఒప్పందం ముగుస్తుంది. ఈ డీల్ గురిచి ప్రకటించిన తదనంతరం డిజిటల్ వరల్డ్ షేర్లు అనుహ్యంగా 350 శాతం వరకు పెరిగాయి. ఐతే ఈ విషయమై ట్రంప్ మీడియా గానీ, రాకెట్ వన్ క్యాపిటల్ గానీ స్పందించలేదు.
(చదవండి: ఫైటర్ జెట్‌లో ‘బోరిస్’ సెల్ఫీ వీడియో.. నెటిజన్ల పైర్!)
Comments
Please login to add a commentAdd a comment