
అకౌంట్ల చోరీపై వర్రీ చెందొద్దు!
న్యూఢిల్లీ : ట్విట్టర్ యూజర్లకు షాకింగ్ నిలిచిన 3.3 కోట్ల మంది అకౌంట్ల చోరీపై ఆందోళన చెందొద్దని ఆ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ పేర్కొంది. తమ అకౌంట్ యూజర్ల ఐడీలు, అధికార పత్రాలు డేటా దొంగతనానికి గురవలేదని, తన కంప్యూటర్ సిస్టమ్స్ కు ఎలాంటి ఉల్లంఘన జరగలేదని ట్విట్టర్ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. లీక్ అయిన పాస్ వర్డ్ లు ప్లేయిన్ టెస్ట్ ఫార్మాట్ లో ఉన్నాయని, అంటే వారు ఎటువంటి ఎన్క్రిప్షన్, హాషింగ్ కలిగి లేరని అర్థమని పేర్కొన్నారు.
గూగుల్, ట్విట్టర్, ఇతర వెబ్ సైట్లు పాస్ వర్డ్ లను ప్లేయిన్ టెస్ట్ ఫార్మాట్ లో పెట్టవని చెప్పారు. ఒకవేళ హ్యాంకింగ్ గురైతే, వారిదగ్గరున్న పాస్ వర్డ్లు ప్లేయిన్ టెస్ట్ ఫార్మాట్ లో ఉండవని వెల్లడించారు. ఈ ఆధారంతో తమ సిస్టమ్స్ ఎలాంటి దొంగతనానికి గురవలేదని చెప్పొచ్చన్నారు.
తాజాగా భారీ ట్విట్టర్ అకౌంట్ల చోరీ జరిగిందని భద్రత సంస్థ లీక్డ్ సోర్సు రిపోర్టు నివేదించిన సంగతి తెలిసిందే. దాదాపు 3.3 కోట్ల మంది నెటిజన్ల యూజర్ నేమ్స్, పాస్ వర్డ్ లు లీక్ అయినట్టు వెల్లడించింది. ఈ హ్యాకింగ్ కు ఓ రష్యా హ్యాకర్ పాల్పడాడని, డార్క్ వెబ్ లో వీటిని అమ్మకానికి ఉంచినట్టు నివేదించింది.