హ్యాక్‌ అయ్యాయి | Hansika Motwani’s private Photo Leaked | Sakshi
Sakshi News home page

హ్యాక్‌ అయ్యాయి

Published Fri, Jan 25 2019 3:03 AM | Last Updated on Fri, Jan 25 2019 5:04 AM

Hansika Motwani’s private Photo Leaked - Sakshi

హన్సిక

ఇటీవల కమల్‌హాసన్‌ కూతురు అక్షరా హాసన్‌కు సంబంధించిన కొన్ని వ్యక్తిగత ఫొటోలు లీక్‌ అయ్యి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కథానాయిక హన్సిక వ్యక్తిగత ఫొటోలు సోషల్‌ మీడియాలో హాల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇటీవల ఆమె న్యూయార్క్‌ హాలిడేకి వెళ్లినప్పటి ఫొటోలు అవని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిలో హన్సిక బికినీ ధరించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ విషయం గురించి హన్సిక స్పందిస్తూ – ‘‘నా ఫోన్, ట్వీటర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యాయి.

వాటి నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దు. కంట్రోల్‌ చేయడానికి మా టీమ్‌ వర్క్‌ చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. సో... హ్యాక్‌ చేసినవాళ్లే హన్సిక ఫొటోలు బయట పెట్టి ఉంటారనుకోవాలేమో. ఇక ఆమె సినిమాల ప్రస్తావనకు వస్తే... తమిళంలో ‘100’ అనే పోలీస్‌ థ్రిల్లర్‌ చేశారు. ఈ చిత్రం రిలీజ్‌కి రెడీగా ఉంది. ప్రస్తుతం ‘మహా’ అనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో సందీప్‌ కిషన్‌ సరసన   ఓ సినిమాకి కమిట్‌ అయ్యారు హన్సిక.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement