తాడికోనలో ఓఎన్ జీసీ గ్యాస్ లీక్ | ongc limited gas well disiminates gas at tadikona, officials evacuating villages | Sakshi
Sakshi News home page

తాడికోనలో ఓఎన్ జీసీ గ్యాస్ లీక్

Published Fri, Sep 9 2016 7:15 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

తాడికోనలో ఓఎన్ జీసీ గ్యాస్ లీక్

తాడికోనలో ఓఎన్ జీసీ గ్యాస్ లీక్

తూర్పుగోదావరి: జిల్లాలోని తాడికోన గ్రామం వద్ద గల ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్ జీసీ) వెల్ నుంచి గ్యాస్ లీక్ అయింది. పెద్ద మొత్తంలో వెల్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో సయ్యద్ అనిసుల్ హక్ అనే వ్యక్తికి తీవ్ర అస్వస్ధతకు గురైయ్యాడు. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

వెల్ నుంచి గ్యాస్ ఎక్కువగా లీక్ అవుతుండటంతో రక్షణా చర్యల్లో భాగంగా ఓఎన్ జీసీ సిబ్బంది చుట్టుపక్కల గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు.  దీంతో ఓఎన్ జీసీ నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ స్థానికులు కంపెనీ రిగ్ వద్ద ఆందోళనకు దిగారు. 2014లో నగరం గ్రామం దగ్గరలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) పైప్ లైన్ పేలుడులో 15 మంది గ్రామస్థులు మరణించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement