సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ సోమవారం అనధికారికంగా బయటకొచ్చింది. అందుబాటులోకి వచ్చిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచి మొదలయ్యే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మార్చి 4వ తేదీతో ముగియనుంది.
షెడ్యూల్ ఇలా...
♦జనవరి 27న అన్ని కేటగిరీల్లో ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు.
♦28 నుంచి 30 వరకు బదిలీ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు
♦జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 లోపు.. దరఖాస్తుల హార్డ్ కాపీలను హైసూ్కల్ ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ పీఎస్, యూపీఎస్ ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈఓకు సమర్పించాలి
♦ఫిబ్రవరి 3–6 తేదీల మధ్య దరఖాస్తుల హార్డ్ కాపీలను ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు డీఈఓ కార్యాలయంలో సమరి్పంచడం, పరిశీలన.. ఆన్‌లైన్‌లో ఆమోదం.
♦7న డీఈఓ/ఆర్జేడీ వెబ్‌సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ, పదోన్నతుల సీనియారిటీ జాబితాలు ప్రకటిస్తారు.
♦8 నుంచి 10 వరకు మూడురోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, పరిష్కారం జరుగుతుంది.
♦11, 12 తేదీల్లో తుది సీనియారిటీ జాబితాల ప్రకటన, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు.
♦13న మల్టీ జోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునఃపరిశీలన చేసుకోవచ్చు.
♦14న ఆర్జేడీలు ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు విడుదల.
♦15న బదిలీల అనంతరం మిగిలిన ఖాళీల ప్రకటన.
►16, 17, 18 తేదీల్లో అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్ జరుగుతుంది.
►19, 20 తేదీల్లో సబ్జెక్ట్ వారీగా స్కూల్ అసిస్టెంట్స్ ఖాళీల ప్రకటన, బదిలీ ఆప్షన్స్ నమోదు.
►21న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం.
►22, 23 తేదీల్లో డీఈఓలచే స్కూల్ అసిస్టెంట్స్ బదిలీ ఉత్తర్వులు విడుదల.
►24న స్కూల్ అసిస్టెంట్ల బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన.
►25, 26, 27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు (కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు) మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు.
►ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన, వెబ్ ఆప్షన్ల నమోదు. ∙3న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలన.
►4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల.
►5 నుండి 19 వరకు డీఈఓలు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీళ్లు/అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు పంపవచ్చు.
డైరెక్టర్ ఆగ్రహం:
టీచర్ల బదిలీల షెడ్యూల్ బయటకు రావడంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన డీఈవోల సమావేశంలో విద్యా శాఖ బదిలీల షెడ్యూల్‌పై చర్చించారు. సమావేశం జరుగు తుండగానే షెడ్యూల్ లీకయ్యింది. ఈ నేపథ్యంలో డీఈవోల ఫోన్లు స్వా«దీనం చేసుకుని పరిశీలించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment