Huge Response For Die Hard Fan Movie Concept Motion Poster - Sakshi
Sakshi News home page

Die Hard Fan: అభిమాని... హీరోయిన్‌ని కలిసిన రాత్రి ఏం జరిగింది?

Published Sun, Jul 24 2022 1:14 PM | Last Updated on Sun, Jul 24 2022 2:29 PM

Huge Response For Die Hard Fan Movie Concept Motion Poster - Sakshi

ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి జంట‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘డై హార్డ్‌ ఫ్యాన్‌’. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్‌ డైరెక్టర్‌  అభిరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో షకలక శంకర్‌, రాజీవ్‌ కనకాల, నోయల్‌ కితర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన కాన్సెప్ట్‌ మోషన్‌ పోస్టర్‌కి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. 

 ‘సినిమా లో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్  ఉంటుందో అంద‌రికి తెలుసు. అలాంటి ఓ అభిమాని త‌ను అభిమానించే హీరొయిన్ ని క‌ల‌వాల‌నుకుంటాడు. అనుకొకుండా హీరోయిన్ క‌లిస్తే ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేది ఈ చిత్ర ముఖ్య క‌థాంశం. ఈ చిత్రం లో అన్ని పాత్ర‌లు కూడా హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ  ఉంటాయి.  ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించాం. కథలో మలుపులు ప్రేక్షకుడిని థ్రిల్‌ చేస్తాయి’అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా చిత్రాన్ని రిచ్‌గా నిర్మించామని నిర్మాత చంద్రప్రియ సుబుధి తెలిపారు. షూటింగ్‌ పూర్తి చేసు​కున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉంది. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement