కామెడీ ‘సవారి’కి రెడీ | Nandu And Priyanka Sharma Savaari Movie Official Teaser | Sakshi
Sakshi News home page

కామెడీ ‘సవారి’కి రెడీ

Published Sat, Jul 6 2019 9:59 AM | Last Updated on Sat, Jul 6 2019 9:59 AM

Nandu And Priyanka Sharma Savaari Movie Official Teaser - Sakshi

బంధం రేగడ్ అనే ఇండిపెండెంట్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోత్ కూరి ‘సవారి’ చిత్రంతో దర్శకుడిగా మారారు. నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సమావేశంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా హీరో నందు మాట్లాడుతూ.. ‘ఇదివరకు నేను చాలా సినిమాల్లో నటించాను. సవారీ చిత్రం నా కెరీర్‌లో బెస్ట్ అని భావిస్తున్నా. ఈ చిత్రం మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను. డైరెక్టర్ సాహిత్ కొత్త కథను మీముందుకు తీసుకొని వస్తున్నారు. నిర్మాతలు సంతోష్ మోత్కురి, నిశాంక్ రెడ్డి ఈ సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. నా బాడీ ల్యాంగేజ్ ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అయ్యింది. త్వరలో ట్రైలర్ విడుదల చేసి విడుదల తేదీని ప్రకటిస్తాము’ అన్నారు.

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ... ‘తెలుగు సినిమాల్లో కొత్త కథలు వస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు సాహిత్ ఎంచుకున్న కథ డిఫరెంట్‌గా ఉంది, దాన్ని తెరమీద బాగా చూపిస్తాడన్న నమ్మకం ఉంది. నందుకు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని నమ్ముతున్న. ఈ చిత్రానికి పనిచేసిన అందరూ టెక్నీషియన్స్‌కు నిర్మాతలకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నా’ అన్నారు.

ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘కొత్త చిత్రాలను యూత్ ఎప్పుడూ ఆదరిస్తున్నారు. సవారీ సినిమా టీజర్ కొత్తగా ఉంది. ఈ మూవీ ప్రేక్షకాదరణ పొందుతుందని నమ్ముతున్నాను. నందుకు, డైరెక్టర్ సాహిత్‌కు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు.

డైరెక్టర్ సాహిత్ మాట్లాడుతూ... ‘మీడియా వారికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్‌కు థాంక్స్, నందు ఈ పాత్రకు బాగా సెట్ అయ్యాడు. సినిమా విడుదల తరువాత మళ్ళీ మాట్లాడుతాను’ అన్నారు.

హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ... ‘నందు మంచి నటుడు, ఈ చిత్ర షూటింగ్ సమయంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో నేను ఛాలెంగింగ్ రోల్ చేసాను, నా మీద నమ్మకంతో నాకు ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ సాహిత్‌కు థాంక్స్. టీజర్ బాగుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. సినిమా కూడా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement