Savaari Movie
-
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లవుతోంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. యూట్యూబ్ వచ్చిన తర్వాత అయితే ఇష్టం వచ్చినట్లు.... ఆత్మగౌరవాన్ని అహంలా భావించేవాడు నా స్థానంలో ఉండి ఉంటే సూసైడ్ చేసుకోవాలేమో. నాకు డబ్బు కన్నా.. గౌరవం ముఖ్యం. ఫలితంతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నా పదమూడేళ్ల స్ట్రగుల్‌కు ‘సవారి’ చిత్రం నాకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందని అనుకుంటున్నాను (చెమర్చిన కళ్లతో)’’ అన్నారు నందు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంకా శర్మ జంటగా నిషాంక్ రెడ్డి కుడితి, సంతోష్ మోత్కూరి నిర్మించిన ‘సవారి’ నేడు విడుదవుతోంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ – ‘‘సాహిత్ మోత్కూరి ‘సవారి’ కథ చెప్పారు. బాగా నచ్చింది. కానీ సినిమాలో నాది సెకండ్ లీడ్ రోల్ అన్నారు. అసలు నన్నెందుకు హీరోగా ఊహించుకోలేకపోతున్నారనే బాధ కలిగింది. హీరోగా నటిస్తానని చెబితే సరే అన్నారు. ప్రాణం పెట్టి సినిమా చేశాం. యూఎస్‌లో మూడు ప్రీమియర్ షోలు సోల్డ్ అవుట్ అయ్యాయి’’ అన్నారు. పాత్రను చంపను! కెరీర్ మొదట్లో సర్వైవల్ కోసం కొన్ని సినిమాలు చేశాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చాను. నందు ఏ పాత్ర అయినా చేయగలడు అంటున్నారు కానీ నా కోసం పాత్ర రాయడం లేదు. నాకు ఇచ్చిన పాత్రను నా యాక్టింగ్‌తో చంపను. వీలైనంత బాగా చేయడానికే ట్రై చేస్తా. -
‘సవారి’ ప్రీ రిలీజ్ వేడుక
-
వేసవిలో సవారి
నందు, ప్రియాంకా శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘సవారి’. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో శ్రీ విష్ణుతో కలిసి ట్రైలర్‌ను విడుదల చేసిన సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా నటించిన ‘సమ్మోహనం’ చిత్రంలో నందు నటించాడు. మొదట అతని పాత్రకు వేరొకరని తీసుకుందామని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణను అడిగాను. కానీ ఆ పాత్రను నందూయే చేయాలన్నారు. నందు బాగా నటించాడు. నేను, తను దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. నందు ఎలాంటి క్యారెక్టర్లో అయినా ఒదిగిపోగలడు. ఈ చిత్రదర్శకుడు సాహిత్ నాకో కథ చెప్పాడు. ఆ కథ నచ్చినప్పటికీ సినిమా చేయలేకపోయాం. ‘సవారి’ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. సాహిత్ భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం నందు పడ్డ కష్టం ఎక్కడికీ పోదు. విడుదల తర్వాత ‘సవారి’ చిత్రం పెద్ద సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పాటలు నాకు బాగా నచ్చాయి’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘డబ్బుల కోసం నేను చాలా సినిమాలు చేశాను. నటుడిగా అవి నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాయి. ‘సమ్మోహనం’ తర్వాత మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఏడాది గ్యాప్ తీసుకుని ‘సవారి’ చిత్రం చేశాను. తొలి పోస్టర్ రిలీజ్ నుంచే ఈ సినిమాకు మంచి బజ్ వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మంచి సినిమాలే చేస్తాను’’ అన్నారు నందు. ‘‘ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాను మా అన్నయ్య, స్నేహితుడు కలిసి నిర్మిస్తున్నారు. ఇందులోని రెండు పాటలకు 10 మిలియన్ (కోటి) వ్యూస్ రావడం చిన్న విషయం కాదు’’ అన్నారు సాహిత్ మోత్కూరి. ఈ కార్యక్రమంలో శివ, జీవన్, మ్యాడీ, శ్రీకాంత్ రెడ్డి, బల్వీందర్, పూర్ణాచారి, కరిముల్లా, ఎడిటర్ సంతోష్ మేనం పాల్గొన్నారు. -
సవారీ మూవీ ట్రైలర్ లాంచ్
-
నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ సవారి
‘‘తెలుగు తెరపై కొత్త కథలు వస్తున్నాయి. సాహిత్ ఎంచుకొన్న కథ డిఫరెంట్‌గా ఉంది. దాన్ని తెరపై బాగా చూపించి ఉంటారనే నమ్మకం ఉంది. నందుకు ఈ సినిమా చక్కటి బ్రేక్ ఇస్తుంది అనుకుంటున్నాను’ అన్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ‘బంధం రేగడ్’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్‌తో గుర్తింపు పొందిన సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సవారి’. సంతోశ్ మోత్కూరి, నిశాంక్ కుడితి నిర్మించారు. నందు, ప్రియాంకా శర్మలు జంటగా నటించిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు తరుణ్ భాస్కర్, ప్రణయ్‌రెడ్డి వంగా, టి.ఎన్.ఆర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘ఇదివరకు నేను చాలా సినిమాల్లో నటించాను. ‘సవారి’ నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్. సాహిత్ ఓ కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నా బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్ ఈ సినిమాకు కరెక్ట్‌గా సెట్ అయ్యాయి’’ అన్నారు. సాహిత్ మాట్లాడుతూ– ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో పాత్ర విభిన్నంగా ఉంటుంది. నందు ఈ పాత్రకు బాగా సెట్ అయ్యాడు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం షూటింగ్ సమయంలో నందు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశాడు. ఈ సినిమాలో నేను చాలెంజింగ్ రోల్ చేశాను. ఇంత మంచి పాత్ర ఇచ్చిన సాహిత్‌కు థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంకా శర్మ. -
కామెడీ ‘సవారి’కి రెడీ
బంధం రేగడ్ అనే ఇండిపెండెంట్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోత్ కూరి ‘సవారి’ చిత్రంతో దర్శకుడిగా మారారు. నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సమావేశంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హీరో నందు మాట్లాడుతూ.. ‘ఇదివరకు నేను చాలా సినిమాల్లో నటించాను. సవారీ చిత్రం నా కెరీర్లో బెస్ట్ అని భావిస్తున్నా. ఈ చిత్రం మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను. డైరెక్టర్ సాహిత్ కొత్త కథను మీముందుకు తీసుకొని వస్తున్నారు. నిర్మాతలు సంతోష్ మోత్కురి, నిశాంక్ రెడ్డి ఈ సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. నా బాడీ ల్యాంగేజ్ ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అయ్యింది. త్వరలో ట్రైలర్ విడుదల చేసి విడుదల తేదీని ప్రకటిస్తాము’ అన్నారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ... ‘తెలుగు సినిమాల్లో కొత్త కథలు వస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు సాహిత్ ఎంచుకున్న కథ డిఫరెంట్‌గా ఉంది, దాన్ని తెరమీద బాగా చూపిస్తాడన్న నమ్మకం ఉంది. నందుకు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని నమ్ముతున్న. ఈ చిత్రానికి పనిచేసిన అందరూ టెక్నీషియన్స్‌కు నిర్మాతలకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నా’ అన్నారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘కొత్త చిత్రాలను యూత్ ఎప్పుడూ ఆదరిస్తున్నారు. సవారీ సినిమా టీజర్ కొత్తగా ఉంది. ఈ మూవీ ప్రేక్షకాదరణ పొందుతుందని నమ్ముతున్నాను. నందుకు, డైరెక్టర్ సాహిత్‌కు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు. డైరెక్టర్ సాహిత్ మాట్లాడుతూ... ‘మీడియా వారికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్‌కు థాంక్స్, నందు ఈ పాత్రకు బాగా సెట్ అయ్యాడు. సినిమా విడుదల తరువాత మళ్ళీ మాట్లాడుతాను’ అన్నారు. హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ... ‘నందు మంచి నటుడు, ఈ చిత్ర షూటింగ్ సమయంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో నేను ఛాలెంగింగ్ రోల్ చేసాను, నా మీద నమ్మకంతో నాకు ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ సాహిత్‌కు థాంక్స్. టీజర్ బాగుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. సినిమా కూడా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను’ అన్నారు.