నందు
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లవుతోంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. యూట్యూబ్ వచ్చిన తర్వాత అయితే ఇష్టం వచ్చినట్లు.... ఆత్మగౌరవాన్ని అహంలా భావించేవాడు నా స్థానంలో ఉండి ఉంటే సూసైడ్ చేసుకోవాలేమో. నాకు డబ్బు కన్నా.. గౌరవం ముఖ్యం. ఫలితంతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నా పదమూడేళ్ల స్ట్రగుల్‌కు ‘సవారి’ చిత్రం నాకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందని అనుకుంటున్నాను (చెమర్చిన కళ్లతో)’’ అన్నారు నందు.
సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంకా శర్మ జంటగా నిషాంక్ రెడ్డి కుడితి, సంతోష్ మోత్కూరి నిర్మించిన ‘సవారి’ నేడు విడుదవుతోంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ – ‘‘సాహిత్ మోత్కూరి ‘సవారి’ కథ చెప్పారు. బాగా నచ్చింది. కానీ సినిమాలో నాది సెకండ్ లీడ్ రోల్ అన్నారు. అసలు నన్నెందుకు హీరోగా ఊహించుకోలేకపోతున్నారనే బాధ కలిగింది. హీరోగా నటిస్తానని చెబితే సరే అన్నారు. ప్రాణం పెట్టి సినిమా చేశాం. యూఎస్‌లో మూడు ప్రీమియర్ షోలు సోల్డ్ అవుట్ అయ్యాయి’’ అన్నారు.
పాత్రను చంపను!
కెరీర్ మొదట్లో సర్వైవల్ కోసం కొన్ని సినిమాలు చేశాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చాను. నందు ఏ పాత్ర అయినా చేయగలడు అంటున్నారు కానీ నా కోసం పాత్ర రాయడం లేదు. నాకు ఇచ్చిన పాత్రను నా యాక్టింగ్‌తో చంపను. వీలైనంత బాగా చేయడానికే ట్రై చేస్తా.
Comments
Please login to add a commentAdd a comment