
అనుష్కాశర్మ, ప్రియాంకచోప్రా
రేసింగ్‌లో ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ. ఇదేదో కార్, బైక్ రేసింగ్ కాదు. ఆన్‌లైన్ రేసింగ్. ఓ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ప్రింట్ పబ్లికేషన్స్, వైరల్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా, బ్రాడ్‌కాస్ట్ అండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఆధారంగా దేశంలోని 14 భాషలను ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకింగ్‌ను కేటాయించినట్లు సంబంధిత సర్వే ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సర్వేలో అనుష్కా శర్మ 71.90 మార్కులతో ఫస్ట్ ప్లేస్ సంపాదించారు.
తర్వాత ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్, కంగనా రనౌత్ వరుసగా సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్‌లలో నిలిచారు. ‘‘కచ్చితమైన కొలమానాల ఆధారంగా సర్వే నిర్వహించాం. మా అడ్వాన్డ్స్ టెక్నాలజీతో కూడిన సాఫ్ట్‌వేర్ అల్‌గారిథమ్స్ ఇంత పెద్ద సోషల్ మీడియా, ఇతర డేటాను విశ్లేషించడంలో ఉపయోగపడ్డాయి’’ అని సర్వే ప్రతినిధి పేర్కొన్నారు. ఇక.. సన్నీ లియోన్, సోనమ్ కపూర్, శ్రద్ధా కపూర్, విద్యాబాలన్, తాప్సీ పన్ను, మాధురి దిక్షీత్ టాప్ టెన్‌లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment