ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యంతో జైలు నుంచి విడుదలైన బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర‍్మ తనపట్ల అధికారులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఆమె బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీ కార్యకర్తను కాబట్టే టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు. ఫోటో మార్ఫింగ్‌పై తాను క్షమాపణ చెప్పేది లేదని ప్రియాంక శర్మ మరోసారి స్పష్టం చేశారు. తనతో అధికారులు బలవంతంగా క్షమాపణ చెప్పించేందుకు యత్నించారని ఆమె ఆరోపించారు.