నందు
నందు, ప్రియాంక శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సవారి’. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి నిర్మించిన ఈ సినిమాని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అన్ని వర్గాలను ఆకట్టుకునే లవ్ ఎంటర్‌టైనర్ చిత్రమిది.
ఇప్పటికే విడుదలైన టీజర్, శేఖర్ చంద్ర సంగీతానికి మంచి స్పందన రావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘నీ కన్నులు..’ లిరికల్ సాంగ్‌కి ఇప్పటికే 5 మిలియన్ వ్యూస్ దక్కాయి. అదేవిధంగా ‘ఉండిపోయా..’ పాటకు కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ సంస్థ ఏషియన్ సినిమాస్ మా సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు.. నైజాంలో వారు విడుదల చేయనున్నారు’’ అన్నారు. శ్రీకాంత్ గంట, శివ, మది తదితరులు ఈ చిత్రంలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment