
అశోక్ కుమార్, ప్రియాంక శర్మ
అశోక్ కుమార్, ప్రియాంక శర్మ జంటగా కేవీ సాయికృష్ణ దర్శకత్వంలో చంద్రరావు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక ఊళ్లో’. పల్లెటూరికి వినోద యాత్ర అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఆడియోను శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ‘‘రాజమౌళి దగ్గర పని చేసిన సాయికృష్ణ ఈ సినిమాను చక్కగా తీశాడు. మంచి లొకేషన్స్‌లో చిత్రీకరించాం. సంగీతం బాగా కుదిరింది’’ అన్నారు ^è ంద్రరావు.
‘‘రాజమౌళి గారి దగ్గర వర్క్ చేస్తూ చాలా నేర్చుకున్నాను. పాటలు బావున్నాయని అందరూ అభినందిస్తున్నారు. సినిమా కూడా ఆకట్టుకుంటుంది’’ అన్నారు సాయికృష్ణ. ‘‘చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. మంచి ఫీల్ కలిగించే సినిమా అవుతుంది’’ అన్నారు హీరో విజయ్. ఈ సినిమాకు సహనిర్మాతలు: శ్రీతేజ్ మనోజ్ పాలిక, బాలాజి గెద్దాడ కమల్ వీవీ, సంగీతం: యాజమాన్య.
Comments
Please login to add a commentAdd a comment