సినిమాలకు స్టార్ వారసురాలు గుడ్ బై..? | Karthika quits films to star in Hindi serials | Sakshi
Sakshi News home page

సినిమాలకు స్టార్ వారసురాలు గుడ్ బై..?

Published Tue, Jul 12 2016 1:11 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

సినిమాలకు స్టార్ వారసురాలు గుడ్ బై..?

సినిమాలకు స్టార్ వారసురాలు గుడ్ బై..?

అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కార్తీక. అలనాటి స్టార్ హీరోయిన్ రాధ కూతురిగా అందరి దృష్టిని ఆకర్షించిన కార్తీక, తొలి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం సాధించలేకపోయింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సరసన నటించినా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది.

తెలుగులో హిట్ ఇవ్వకపోయినా తమిళ నాట హీరోయిన్గా నటించిన రంగం సినిమాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ సినిమా కూడా కార్తీక కెరీర్ను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. అందుకే కొద్ది రోజులుగా సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉంటున్న ఈ అందాల భామ, ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని డిసైడ్ అయ్యిందట. అయితే నటిగా మాత్రం కొనసాగేందుకు ఓ హిందీ టివి సీరియల్లో నటించాలని నిర్ణయించుకుంది. మరి బుల్లి తెర అయినా ఈ స్టార్ వారసురాలికి సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement