rangam
-
హైదరాబాద్ : అమ్మవారి రంగం ఊరేగింపుల్లో హోరెత్తిన భక్తులు (ఫొటోలు)
-
మూడు ముళ్లు... ఏడడుగులు
సీనియర్ నటి రాధ కుమార్తె, ‘రంగం’ ఫేమ్ హీరోయిన్ కార్తీక వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. రోహిత్ మేనన్ తో కార్తీక ఏడడుగులు వేశారు. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయ ఫ్యాలెస్ కన్వెన్షన్ సెంటర్లో కేరళ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు హీరో చిరంజీవి–సురేఖ దంపతులు, నటీనటులు రాధిక, సుహాసిని, రేవతి, భాగ్యరాజ్ తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా నాగచైతన్య హీరోగా రూపొందిన ‘జోష్’(2009) సినిమాతో కార్తీక తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015 తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బిజీ అయ్యారు. -
రక్షణ రంగానికి బ్రాండ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగానికి ఒక బ్రాండ్‌గా మారేందుకు, నేవల్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి విశాఖపట్నంలో పుష్కల అవకాశాలున్నాయని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ డా.వై శ్రీనివాసరావు అన్నారు. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ(ఎన్ఎస్టీఎల్)లో శనివారం జరిగిన 54వ ల్యాబ్ రైజింగ్ డే ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘విశాఖపట్నంలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందితే అత్యవసర పరిస్థితుల్లో సహకారం అందించేందుకు అవసరమైన మానవ వనరులు, మెషినరీ అందుబాటులోకి వస్తాయి. నేవల్ డిఫెన్స్ అంటే విశాఖ గుర్తుకురావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాయి. హిందూస్తాన్ షిప్‌యార్డు, పోర్టులకు సంబంధించిన పరికరాలు, కమర్షియల్ నేవీ, ఇండియన్ నేవీకి ఏ పారిశ్రామిక సహకారం కావాలన్నా.. విశాఖ అత్యంత ముఖ్యమైన వనరు. రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తే.. విశాఖలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందుతుంది. డాక్‌యార్డు, ఎన్ఎస్టీఎల్, నేవీ, షిప్‌యార్డుకు సహకారం అందించేలా బీఈఎల్ మాదిరిగా ఎల్అండ్టీ వంటి సంస్థలు వస్తే.. ఆ వెంటే ఎంఎస్ఎంఈలు కూడా ఏర్పాటవుతాయి. తద్వారా విశాఖ రక్షణ రంగానికి ఒక బ్రాండ్‌గా మారే అవకాశముంది. విశాఖ సమీప ప్రాంతాల్లో పోర్టులు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, రాజమండ్రి ఎయిర్‌పోర్టు, రైల్వే వ్యవస్థ కూడా ఉన్నందున.. అభివృద్ధి చెందేందుకు ఎక్కువ సమయం పట్టదు. సొంతంగా సబ్మెరైన్లు, టార్పెడోలు.. సముద్ర గర్భంలోనూ సత్తా చాటే దిశగా అడుగులు పడుతున్నాయి. వరుణాస్త్ర విజయవంతమైంది. హెవీ వెయిట్, లైట్ వెయిట్ టార్పెడో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. బ్యాటరీ ప్రొపల్షన్ టార్పెడోలు ప్రస్తుతం కీలకంగా మారాయి. క్షణాల్లో టార్పెడోలు దూసుకుపోయేలా బ్యాటరీల రూపకల్పన జరుగుతోంది. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. టార్పెడోలను సమర్థంగా కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా సిద్ధమవుతోంది. నౌకలు, సబ్మెరైన్ల మోడల్ టెస్టింగ్స్ కోసం ఒకప్పుడు ఇతర దేశాలపై ఆధారపడే వాళ్లం. ఇప్పుడు అన్ని షిప్‌యార్డులూ ఎన్ఎస్టీఎల్ వైపే చూస్తున్నాయి. ఇప్పుడు సబ్మెరైన్లను సొంతంగా తయారు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ నౌకల ఉనికిని శత్రుదేశాలు పసిగట్టకుండా అడ్డుకునే స్టెల్త్ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నాం. శత్రుదేశాలు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా.. దాని నుంచి తప్పించుకునేందుకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పనకూ ప్రయోగాలు జరుగుతున్నాయి’ అని చెప్పారు -
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)
-
బోనాలు: మీ తప్పుల వల్లే కుండపోత వర్షాలు కురిపిస్తున్నా
తెలంగాణలో ఉజ్జయిని బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు(సోమవారం) సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం వద్ద రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. ‘‘మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. గతంలో చేసినట్టుగా పూజలు చేయడంలేదు. ఆలయంలో పూజలు సరిగా జరగడంలేదు. గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు చేయాలి. నా రూపాన్ని ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. నా రూపాన్ని స్థిరంగా ఉంచండి. నా సంతోషానికి కాదు.. మీ సంతోషానికే పూజలు. నాకు పూజలు సరిగ్గా చేయనందుకే కుండపోత వర్షాలు కురిపిస్తున్నాను. మీ కళ్లు తెరిపించడానికే ఇలా వర్షాలు కురిపిస్తున్నాను. ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నాను’’ అని అన్నారు. -
ప్రభుత్వంపై, అధికారుల పనితీరుపై జోగిని స్వర్ణలత ఆగ్రహం
-
ఉజ్జయిని మహంకాళి: స్వర్ణలత భవిష్యవాణి
-
ప్రభుత్వంపై, అధికారులపై అమ్మవారి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై, అధికారుల పనితీరుపై జోగిని స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు బోనం సమర్పించామని సంతోష పడుతున్నారు.. కానీ నాది నాకే సమర్పించారని చెప్పారు. బంగారు బోనం సమర్పించినా.. తాను దుఖంతో ఉన్నానని.. తన దర్శనానికి వచ్చే భక్తులు సైతం ఈ ఏడాది దుఃఖంతో వచ్చారని స్వర్ణలత అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భాగంగా అమ్మవారు స్వర్ణలత ద్వారా భవిష్యవాణి వినిపించారు. తనకు బంగారు బోనం వద్దని.. సంతోష బోనం సమర్పించాలని అమ్మవారు రంగంలో సూచించారు. ‘నా సన్నిధికి వస్తున్న భక్తులు దుఖంతో వస్తున్నారు. దుఖంతోనే పోతున్నారు. ఈ ఏడాది మాత్రం భక్తులు సంతోషంగా లేరు. నా భక్తులు సంతోషంగా ఉన్నారని మీరు మాత్రమే అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. మాటల్లో ఉన్నంతగా చేతల్లో మాత్రం పనులు లేవు. నా బిడ్డలు, అడపడుచులందరు ఎడుపులతో ఉన్నారు. మీరు ప్రజలను ఇబ్బంది పెట్టినా.. నేను మాత్రం ప్రజలను సంతోషంగా చూసుకుంటాను. ప్రజలకు మేలు చేస్తున్నామని అనుకుంటున్నారు.. కానీ కీడు చేస్తున్నారు. ప్రజలందరూ శాపాలు పెడుతున్నారు. నేను ఎప్పుడు శాపం పెట్టలేదు. ప్రజలను సంతోషంగా చూసుకుంటాను. ఆ భాద్యత నాది. నా ఆశీర్వాదం అందరికి ఉంటుంది. నాకు మాత్రమే మొక్కులు సమర్పించడం కాదు. ప్రజలను సంతోషపెట్టండి. వచ్చే రోజుల్లో నా భక్తులకు ఇబ్బందులు కాకుండా చూసుకోండి. నేనెప్పుడూ న్యాయం పక్షాన నిలబడుతా. కోరినన్ని వర్షాలు ఉన్నాయి. వచ్చే రోజుల్లో వర్షాలు కురుస్తాయి. పాడి పంటలు బాగా పండుతాయని’ అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. శ్యామల కామెంట్లపై స్పందించిన తలసాని -
రంగం చెబుతున్న స్వర్ణలత
-
షాక్ ఇచ్చిన 'రంగం' బ్యూటీ
రంగం సినిమాతో బబ్లీ క్యారెక్టర్ తో ఆకట్టుకున్న భామ పియా బాజ్‌పాయ్. రంగం సినిమా తరవాత కూడా బోల్డ్ ఫొటో షూట్లతో అలరించిన ఈ భామ ఇప్పుడు అభియుం అనువుం అనే కోలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. చాలా కాలం తరువాత సినిమాటోగ్రాఫర్ ఆర్ విజయలక్ష్మి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డోవినో థామస్ హీరోగా నటిస్తున్నారు. సీనియర్ నటి రోహిణి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పియా ఓ ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నారు. అందుకే కథ డిమాండ్ మేరకు సినిమా కోసం గుండు గీయించుకున్న పియా అందరికి షాక్ ఇచ్చారు. అంతేకాదు ' ఈ సినిమాలో నటించే అవకాశం రావటం నా అదృష్టం. విజయలక్ష్మి కథ వినిపించినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. నటులు ఇలాంటి పాత్రల కోసమే ఎదురుచూస్తుంటారు. అందుకే వెంటనే ఓకె చెప్పేవా. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ గుండుతో నటించాల్సి వచ్చింది. గుండుతో కనిపించేందుకు ప్రొస్థటిక్ మేకప్ చేసే అవకాశం ఉన్నా.. నేచురల్ గా కనిపించేందుకు గుండు గీయించుకోవాలని నిర్ణయించుకున్నా' అని తెలిపారు. ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా మైత్ స్టోన్ గానిలిచిపోతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
రంగ రంగం
-
లాల్‌దర్వాజలో ఘనంగా రంగం కార్యక్రమం
-
సినిమాలకు స్టార్ వారసురాలు గుడ్ బై..?
అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కార్తీక. అలనాటి స్టార్ హీరోయిన్ రాధ కూతురిగా అందరి దృష్టిని ఆకర్షించిన కార్తీక, తొలి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం సాధించలేకపోయింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సరసన నటించినా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. తెలుగులో హిట్ ఇవ్వకపోయినా తమిళ నాట హీరోయిన్గా నటించిన రంగం సినిమాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ సినిమా కూడా కార్తీక కెరీర్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. అందుకే కొద్ది రోజులుగా సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉంటున్న ఈ అందాల భామ, ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని డిసైడ్ అయ్యిందట. అయితే నటిగా మాత్రం కొనసాగేందుకు ఓ హిందీ టివి సీరియల్లో నటించాలని నిర్ణయించుకుంది. మరి బుల్లి తెర అయినా ఈ స్టార్ వారసురాలికి సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. -
'కో' కాంబినేషన్లో మరో సినిమా
2011లో జీవా హీరోగా తెరకెక్కిన 'కో' అప్పట్లో సంచలనం విజయం సాధించింది. తరువాత ఆ సినిమా 'రంగం' పేరుతో తెలుగులోకి అనువాదమై ఇక్కడ కూడా అదే స్ధాయిలో విజయం సాధిచింది. కార్తీక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కెవి ఆనంద్ దర్శకుడు. ఈ సినిమా విడుదలైన నాలుగేళ్ల తరువాత అదే కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే కెవి ఆనంద్ దర్శకత్వంలో జీవా హీరోగా మరో సినిమాకు రెడీ అవుతున్నారు. ధనుష్ హీరోగా తెరకెక్కిన అనేగన్ సినిమా తరువాత ఇంతవరకు నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయని కెవి ఆనంద్ త్వరలోనే కొత్త సినిమా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు. అజిత్, శివకార్తీకేయన్, ఆర్య లాంటి హీరోలతో ఆనంద్ సినిమా ఉంటుందన్న టాక్ వినిపించినా ఫైనల్‌గా జీవాతోనే సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కెవి ఆనంద్. -
అమ్మవారి 'రంగం'
-
ప్రజలకు ఏ కష్టం రానివ్వను....
-
ప్రజలకు ఏ కష్టం రానివ్వను....
సికింద్రాబాద్: ప్రజలకు ఏ కష్టం రానివ్వను...ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజలందరికీ ఎలాంటి భారం, భయం లేకుండా చూసుకునే బాధ్యత తనదని ఆమె భవిష్యవాణి ద్వారా తెలిపారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని స్వర్ణలత రంగంలో పేర్కొన్నారు. తన ఆజ్ఞ లేకుండా ఏ పనీ చేయవద్దని సూచించారు. భవిష్యవాణి అనంతరం అమ్మవారిని అంబారీపై ఊరేగించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిచ్చారు. -
కమల్‌హాసన్‌లా పేరు తెచ్చుకోవాలని ఉంది!
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని కొంతమంది తారలు చెబుతుంటారు. అజ్మల్ ఆ కోవకు చెందినవారే. తండ్రి లాయర్. కొడుకుని డాక్టర్ చేయాలన్నది ఆయన కల. కానీ, అజ్మల్‌కి మాత్రం సినిమాలంటే ప్రాణం. తండ్రి కోరిక మేరకు ఎంబీబీఎస్ చదివి, ఆ తర్వాత సినిమాల్లోకొచ్చేశారు. తమిళ, మలయాళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అజ్మల్ ‘రంగం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ‘రచ్చ’లో కీలక పాత్ర చేసిన అజ్మల్ తెలుగులో సోలోగా చేసిన ‘ప్రభంజనం’ రేపు విడుదల కానుంది. సోలో హీరోగా తెలుగులో బ్రేక్ తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ సినిమా చేయలేదని, కథ నచ్చడం వల్లే చేశానని అజ్మల్ చెబుతూ -‘‘ఇలాంటి కథలు ఏ పది, పదిహేనేళ్లకో మాత్రమే వస్తాయి. ఇది సాదాసీదా కథ కాదు. అందుకే చేశాను. సమాజానికి మంచి చేయాలనుకొనే ఓ సామాన్యుడి పోరాటమే ఈ సినిమా. అల్లరి చిల్లరిగా తిరిగే హీరో ఆ తర్వాత ఓ మంచి పౌరుడిగా ఎలా మారాడు? సమాజానికి ఏ విధంగా మంచి చేశాడు? అనేది కథాంశం. తాత, తండ్రి, కొడుకు.. ఇలా మూడు తరాలకు సంబంధించిన కథ. అందుకని మూడు తరాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది. నాది రెండు కోణాలున్న పాత్ర కావడంతో నటుడిగా నాకు సవాల్ అనిపించింది. రాజకీయాల నేపథ్యంలో సాగే సినిమా అయినా, ఏ పార్టీపైనో, ప్రధానంగా ఏ రాజకీయ నాయకుడిపైనో వ్యంగ్యాస్త్రాలు ఉండవు. అలాగే ఎవర్నీ సపోర్ట్ చేసే సినిమా కాదు. దర్శకుడు వేండ్రాతి భాస్కరరావు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు’’ అని చెప్పారు. వంశీ దర్శకత్వంలో చేసిన ‘తను మొన్నే వెళ్లిపోయింది’ విడుదలకు సిద్ధమైందని, ఆయన దర్శకత్వంలో నటించడం తన అదృష్టమని అజ్మల్ అన్నారు. భవిష్యత్తులో ఓ ఆస్పత్రి కట్టించాలనుకుంటున్నానని చెప్పారు. దక్షిణాది భాషల్లో సినిమాలు చేసి, కమల్‌హాసన్‌లా బహుభాషా నటుణ్ణి అనిపించుకోవాలన్నదే తన లక్ష్యమని అజ్మల్ తెలియజేశారు.