షాక్ ఇచ్చిన 'రంగం' బ్యూటీ | Pia Bajpai on going bald for Abhiyum Anuvum | Sakshi
Sakshi News home page

షాక్ ఇచ్చిన 'రంగం' బ్యూటీ

Published Thu, Sep 7 2017 12:44 PM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

షాక్ ఇచ్చిన 'రంగం' బ్యూటీ

షాక్ ఇచ్చిన 'రంగం' బ్యూటీ

రంగం సినిమాతో బబ్లీ క్యారెక్టర్ తో ఆకట్టుకున్న భామ పియా బాజ్పాయ్. రంగం సినిమా తరవాత కూడా బోల్డ్ ఫొటో షూట్లతో అలరించిన ఈ భామ ఇప్పుడు అభియుం అనువుం అనే కోలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. చాలా కాలం తరువాత సినిమాటోగ్రాఫర్ ఆర్ విజయలక్ష్మి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డోవినో థామస్ హీరోగా నటిస్తున్నారు.

సీనియర్ నటి రోహిణి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పియా ఓ ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నారు. అందుకే కథ డిమాండ్ మేరకు సినిమా కోసం గుండు గీయించుకున్న పియా అందరికి షాక్ ఇచ్చారు. అంతేకాదు ' ఈ సినిమాలో నటించే అవకాశం రావటం నా అదృష్టం. విజయలక్ష్మి కథ వినిపించినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. నటులు ఇలాంటి పాత్రల కోసమే ఎదురుచూస్తుంటారు.

అందుకే  వెంటనే ఓకె చెప్పేవా. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ గుండుతో నటించాల్సి వచ్చింది. గుండుతో కనిపించేందుకు ప్రొస్థటిక్ మేకప్ చేసే అవకాశం ఉన్నా.. నేచురల్ గా కనిపించేందుకు గుండు గీయించుకోవాలని నిర్ణయించుకున్నా'  అని తెలిపారు. ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా మైత్ స్టోన్ గానిలిచిపోతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement