![Senior Actress Radha Daughter Karthika Nair Wedding - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/20/karthika%20marrage.jpg.webp?itok=04PIu3pm)
రోహిత్ మేనన్, కార్తీక
సీనియర్ నటి రాధ కుమార్తె, ‘రంగం’ ఫేమ్ హీరోయిన్ కార్తీక వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. రోహిత్ మేనన్ తో కార్తీక ఏడడుగులు వేశారు. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయ ఫ్యాలెస్ కన్వెన్షన్ సెంటర్‌లో కేరళ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు హీరో చిరంజీవి–సురేఖ దంపతులు, నటీనటులు రాధిక, సుహాసిని, రేవతి, భాగ్యరాజ్ తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కాగా నాగచైతన్య హీరోగా రూపొందిన ‘జోష్’(2009) సినిమాతో కార్తీక తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015 తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బిజీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment